CPI Narayana : సీపీఐ నారాయణ పుత్రోత్సాహము.! గులాబీ కండువా భుజాన వేసుకుంటారేమో.!

NQ Staff - October 5, 2022 / 04:42 PM IST

CPI Narayana : సీపీఐ నారాయణ పుత్రోత్సాహము.! గులాబీ కండువా భుజాన వేసుకుంటారేమో.!

CPI Narayana : ఎర్ర పార్టీలు ఎప్పుడో తోక పార్టీల స్థాయికి దిగజారిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా వామపక్షాల అడ్రస్ దాదాపుగా గల్లంతయిపోయింది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, వామపక్షాలా.? అంటే, ఏంటి.? అనే స్థాయికి వెళ్ళిపోయింది పరిస్థితి.

సీపీఐ నారాయణ.. బిగ్ బాస్ రియాల్టీ షో మీద విమర్శలు చేసుకునే స్థాయికి దిగజారిపోయారు. అక్కడ ఎలా తగలబడితే ఈయనకెందుకు.? సరే, ఆ సంగతి పక్కన పెడదాం. సీపీఐ నారాయణ, తాజాగా తెలంగాణ సీఎం కేసీయార్ మీద ప్రశంసల జల్లు కురిపించేశారు.

భారత రాష్ట్రీయ సమితిని ఆహ్వానిస్తున్నారట..

తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా, భారత రాష్ట్రీయ సమితిగా మారడం పట్ల సీపీఐ నారాయణ హర్షం వ్యక్తం చేసేశారు. ‘పుత్రోత్సాహము..’ అంటూ ఓ పద్యాన్ని కూడా అందేసుకున్నారు. అక్కడికేదో, టీఆర్ఎస్ కాస్తా సీపీఐ పార్టీ పుత్రుడన్నట్లుంది వ్యవహారం.

అబ్బే, అలక్కాదు.. జాతీయ పార్టీగా రాష్ట్ర పార్టీ స్థాయిని పెంచడం గొప్ప కాదు, జాతీయ స్థాయిలో బీజేపీకి ధీటుగా నిలబడి, బీజేపీ దౌర్జన్యాల్ని ప్రశ్నించాలి.. అంటూ నారాయణ ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చారండోయ్.

అసలు, వామపక్షాలకు ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలతోనూ పొత్తుల వ్యవహారాలు అయిపోయాయ్. తమలో తాము కొట్టుకుని సీపీఐ, సీపీఎం.. తమను తాము సర్వనాశనం చేసేసుకున్నాయ్. పైగా, పుత్రోత్సాహమంటూ నారాయణ పాటలొకటి.!

 

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us