CPI Narayana : నారాయణ నారాయణ.! ఇవేం రాజకీయాలు నారాయణా.?
NQ Staff - August 22, 2022 / 03:53 PM IST

CPI Narayana : కేంద్ర హోంమంత్రిని క్రిమినల్ అనడమేంటి.? మరీ ఇంత నీఛమా.? ఈ రోజుల్లో రాజకీయ నాయకుల మీద కేసులనేవి సర్వసాధారణం. అందులో క్రిమినల్ కేసులున్నాసరే, జనం వాటిని పట్టించుకోవడంలేదు. అలాగని నేర చరిత్ర వున్న రాజకీయ నాయకుల్ని సమర్థించగలమా.? సమర్థించలేం.
కాకపోతే, కేంద్ర హోంమంత్రి మీద ‘క్రిమినల్’ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. వయసు మీద పడేకొద్దీ విజ్ఞత కోల్పోతున్నారు సీపీఐ నారాయణ. తాజాగా కేంద్ర హోంమంత్రి మీద అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారాయన.
నేరగాళ్ళు.. చెప్పులు మోసేటోళ్ళు.!

CPI Narayana Criticized Telangana BJP Leaders For Carrying Sandals
తెలంగాణ బీజేపీ నేతల్ని చెప్పులు మోసేటోళ్ళని సీపీఐ నారాయణ విమర్శించారు. మునుగోడులో బీజేపీ బహిరంగ సభ సక్సెస్ అవడంతో నారాయణ తన మాట మీద అదుపు కోల్పోతున్నారు. బహుశా ఆయనలో ఆ స్థాయిలో బీజేపీ పెరిగిపోయినట్లుంది.
రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ, మరీ ఇంత దారుణంగానా.? సొంతంగా పోటీ చేసే ధైర్యం లేక, అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతిచ్చిన సీపీఐ, బీజేపీ మీద విమర్శలు చేయడమేంటో.? నిజానికి, మునుగోడులో వామపక్షాలకు మంచి పట్టుంది. కానీ, టీఆర్ఎస్‌ని భుజాన మోయాలనుకుంటోంది వామపక్ష దండు. ఇక్కడ వామపక్ష దండు గతంలో తమను తోక పార్టీలని అభివర్ణించిన గులాబీ పార్టీకి చెంచాగిరీ చేయడాన్ని ప్రజలంతా గమనిస్తూనే వున్నారు.