మంత్రి పువ్వాడ అజయ్ కి కరోనా పాజిటివ్. గాంధీ ఆసుపత్రి బాటే పడతాడా ?
Admin - January 6, 2021 / 03:30 PM IST

తెలంగాణాలో కరోనా మహమ్మారి దాటికి అడ్డుకట్ట లేకుండా పోతుంది. ఇప్పటికే సాధారణ ప్రజలనుండి సినీనటులు, రాజకీయ నాయకుల వరకు ప్రతిఒక్కరు ఈ మహమ్మరి బారిన పడ్డారు. ఇందులో చాలావరకు కోలుకొని మాములు స్థితికి వచ్చారు. ఒకరిద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇదిలా ఉంటె తాజాగా తెలంగాణాలో మరొక మంత్రి కరోనా బారిన పడ్డారు. అయితే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఇక ఈ విషయాన్నీ మంత్రిగారే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు.
ఎవ్వరు ఆందోళన చెందొద్దు :
‘ RTPCR పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. కావున దయచేసి నాకు ఫోన్ చేయడానికి గాని, కలవడానికి గాని ప్రయత్నించకండి. అలాగే కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకొని, హోమ్ క్వారంటైన్ లో ఉండండి. నేను ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను. నా గురించి ఎవ్వరు ఆందోళన చెందొద్దు. అలాగే కరోనా నెగిటివ్ రాగానే అన్ని కార్యక్రమాల్లో ఎదావిదిగా కొనసాగుతానని ‘ ట్వీట్ చేసాడు.
#RTPCR పరీక్షల్లో నాకు #COVID పాజిటివ్ అని తేలింది.దయచేసి నాకు ఫోన్ చేయడానికీ, కలుసుకోవడానికీ ప్రయత్నించకండి. నాతో కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకోవాలని మనవి. హోం ఐసోలాషన్ లో ఉన్నాను. ఆందోళన చెందాల్సిన పని లేదు. మళ్ళీ యధావిధిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను.
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) December 15, 2020
గాంధీ బాటే పడుతారా లేక ప్రవేట్ ఆసుపత్రి బాటనా ? :
ఇక ఇదిలా ఉంటె గతంలో పలు సార్లు మంత్రి అజయ్ మాట్లాడుతూ.. నాకు కరోనా వచ్చిన నేను గాంధీ ఆసుపత్రిలోనే చేరుతా, నయం అయ్యే వరకు అక్కడే చికిత్స చేసుకుంటా అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఆయనకు కరోనా రావడంతో గాంధీ ఆసుపత్రిలో చేరుతారా లేక ప్రవేట్ ఆసుపత్రిలో చేరుతారా అని పలువురు సందేహపడుతున్నారు.