cm kcr : దుబ్బాక తప్పు సాగర్‌లో మళ్లీ చేయవద్దని కేసీఆర్‌ మాస్టర్ ప్లాన్‌.. ఇక బండి జుట్టు పీక్కున గెలవడం కష్టమే

Tech Desk-2 - February 11, 2021 / 07:53 PM IST

cm kcr : దుబ్బాక తప్పు సాగర్‌లో మళ్లీ చేయవద్దని కేసీఆర్‌ మాస్టర్ ప్లాన్‌.. ఇక బండి జుట్టు పీక్కున గెలవడం కష్టమే

cm kcr : తెలంగాణ సీఎం కేసీఆర్‌ లో కాస్త గుబులు అయితే కనిపిస్తుంది. అది ఎందుకు అంటే రాష్ట్రంలో బీజేపీ కాస్త హడావుడి మొదలు అవ్వడంతో పాటు పార్టీ పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని ఆయన దృష్టికి వచ్చిందట. దుబ్బాక మరియు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కాస్త బలం పుంజుకున్నట్లుగా కనిపిస్తుంది. ఆ పార్టీ బలం విషయంకు వస్తే టీఆర్‌ఎస్ ను మించడం ఇప్పట్లో సాధ్యం అయ్యే పని కాదు. కాని వారిపై జనాల్లో నమ్మకం కలిగేలా మరో రెండు మూడు విజయాలు వారికి దక్కితే మాత్రం ఖచ్చితంగా పరిస్థితులు మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే కేసీఆర్‌ ముందస్తు వ్యూహాలు అమలు చేస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

దుబ్బాక ఉప ఎన్నికలకు సీఎం కేసీఆర్ చాలా లైట్ తీసుకున్నాడు. ఎలాగూ సిట్టింగ్ స్థానం కనుక ఈజీగా మనకే వచ్చేస్తుంది. సెంటిమెంట్ తో పాటు ప్రత్యర్థి పార్టీలో బలమైన నాయకుడు లేడు అంటూ దుబ్బాక ఉప ఎన్నిక విషయంలో వదిలేశారు. దానికి తోడు అక్కడ బీజేపీ అభ్యర్థిపై సానుభూతి కలిగేలా కొన్ని సంఘటనలు ప్రభుత్వం అనాలోచితంగా చేయడం వల్ల జరిగాయి. కనుక అలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు జాగ్రత్తలు తీసుకునే పనిలో కేసీఆర్ ఉన్నట్లుగా టీఆర్‌ఎస్ వర్గాల వారు అంటున్నారు. అందులో భాగంగానే నిన్నటి ఉప ఎన్నిక సమర భేరి హాలియాలో జరిగిందని ఈ సందర్బంగా ఆ పార్టీ నాయకులు బలంగా చెబుతున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారం చేయక పోవడం వల్లే ఓటమి పాలయ్యాము అని కేసీఆర్‌ కూడా నిర్ణయానికి వచ్చాడు. అందుకే సాగర్ ఉప ఎన్నిక బాధ్యత పూర్తిగా తన బాద్యత అన్నట్లుగా కేసీఆర్‌ భావిస్తున్నాడు. ఉప ఎన్నిక సన్నాహక సభ హాలియాలో జరిగింది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్‌ రాబోతుంది. అంతకు ముందే అక్కడ భారీ ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఖచ్చితంగా బీజేపీకి పరాభవం చూపించి వారి పొగరు అణచివేయాలనేది కేసీఆర్ ప్లాన్‌. సాగర్‌ లో వారు గెలిస్తే ఏకంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదే అని విరవీగడం ఖాయం అందుకే వారిని కట్టడి చేయాలని స్వయంగా కేసీఆర్‌ రంగంలోకి దిగారు అంటూ టీఆర్‌ఎస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us