KCR Temple: కేసీఆర్ గుడిని అమ్మకానికి పెట్టిన ఘ‌నుడు..!

KCR Temple: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే చాలా మందికి ప్ర‌త్యేక‌మైన అభిమానం ఉంటుంది. కొంద‌రు ఆయ‌న‌పై ప్రేమ‌తో గుడులు క‌ట్టి పూజ‌లు కూడా చేస్తుంటారు. ప‌లు చోట్ల మ‌న‌కు కేసీఆర్ గుడులు ద‌ర్శ‌న‌మిస్తూనే ఉంటాయి. అయితే మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు రవీందర్‌ కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో కేసీఆర్‌కి గుడి క‌ట్టించాడు.

KCR Temple

ఇప్పుడు ఆ గుడికి అమ్మ‌కానికి పెట్టి వార్త‌ల‌లోకి ఎక్కాడు. కనీసం కేసీఆర్, కేటీఆర్‌లను కలిసే అవకాశం కూడా రాలేదని గుడిని, గుడిలోని కేసీఆర్‌ విగ్రహాన్ని అమ్మకానికి పెట్టాడు. కేసీఆర్‌పై అభిమానం ఉన్న‌ప్పుడు అత‌ని పాల‌రాతి విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించి పూజ‌లు చేశాడు.

కేసీఆర్, కేటీఆర్‌ను కలిసే అవకాశం కూడా రావడం లేదని, టీఆర్‌ఎస్‌ పార్టీలోనూ గుర్తింపు దక్కలేదని నిరాశ చెంది కొన్ని రోజుల క్రితం బీజేపీలో చేరాడు. అప్పటి నుంచి కేసీఆర్‌ విగ్రహానికి ముసుగు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఉద్యమంలో పాల్గొని అప్పుల పాలయ్యానని, అప్పులు తీర్చేందుకు కేసీఆర్‌ గుడిని, విగ్రహాన్ని విక్రయిస్తున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఇప్పుడు ఈ విష‌యం అంత‌టా హాట్ టాపిక్‌గా మారింది.

చాలా మంది కూడా ఇప్పుడు కేసీఆర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఉద్య‌మం అప్పుడు మంచిగా మ‌ట్లాడి చేసిండు. ఇప్పుడు అస్స‌లు ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కోప‌డుతున్నారు. కేసీఆర్‌పై కోపాన్ని ర‌క‌రకాలుగా వ్య‌క్త ప‌రుస్తున్నారు.