మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ బహిరంగ సభలో భారీ ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు హాజరు కాబోతున్నారు. సాదారణంగా అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం విషయంలో పెద్దగా పట్టించుకునే వారు కాదు. కాని అటు వైపు నుండి బీజేపీకి చెందిన కేంద్ర నాయకులు మరియు కేంద్ర మంత్రులు ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులు ఇలా అంతా కూడా వస్తున్న కారణంగా అనూహ్యంగా కేసీఆర్ కూడా రంగంలోకి దిగబోతున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికలతో పోల్చితే ఈ సారి టీఆర్ఎస్ పార్టీ మరింత ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.

గత ఎన్నికల్లో సాధించిన డివిజన్ల కంటే ఎక్కువగా సాధిస్తేనే టీఆర్ఎస్ పరువు నిలుస్తుంది. దుబ్బాక లో పోగొట్టుకున్నది హైదరాబాద్లో దక్కించుకోకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది అనేది టీఆర్ఎస్ పార్టీ నాయకుల మనసులో మాట. అందుకే ప్రతి ఒక్క నాయకుడు కూడా చాలా కఠినంగా పార్టీ కోసం పని చేయడంతో పాటు తమ అభ్యర్థుల గెలుపు కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలోకే నేడు కేసీఆర్ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభలో కేసీఆర్ మొత్తంగా తమ ఆరు సంవత్సరాల పాలనలో తీసుకు వచ్చిన సంస్కరణలు మరియు హైదరాబాద్ లో చేసిన అభివృద్దిని చూపించబోతున్నాడు.
హైదరాబాద్ లో ఆరు సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు మరియు ఇప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా కేసీఆర్ చెప్పబోతున్నాడు. టీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా కేసీఆర్ మాటల కోసం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ బహిరంగ సభల్లో మాట్లాడే మాటలను ఇతర పార్టీల వారు కూడా ఆస్వాదిస్తారు అనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన సూటిగా సుత్తి లేకుండా టపి టపి అంటూ మాటలతో ప్రత్యర్థులను కొడతాడు అనడంలో సందేహం లేదు. అలాంటి మాటల కోసం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. నేటి బహిరంగ సభ హాట్ హాట్ గా సాగడంతో పాటు కేసీఆర్ మాటల తూటాలు పేల్చడం ఖాయం అనిపిస్తుంది.