జానారెడ్డికి కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.
Admin - December 13, 2020 / 04:15 PM IST

దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డిపై విమర్శలు చేసాడు. అయితే ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక లో బీజేపీ గెలుపు మొదలయ్యి హైదరాబాద్ లో సౌండ్ వినిపించిందని ఇక ఈ సౌండ్ ఇప్పుడు నాగార్జునసాగర్ వరకు వినిపించాలని చెప్పుకొచ్చాడు. అలాగే ఒక ముసలాయన నేను పుట్టింది కాంగ్రెసే.. పెరిగింది కాంగ్రెసే.. ఆఖరికి నేను చచ్చిన కూడా కాంగ్రెసే అని అంటున్నారని, భవిష్యత్ లో బీజేపీ పార్టీలో చేరితే బడతా పూజ చేస్తామని హెచ్చరించాడు. ఏదో పెద్దోడివని పార్టీలోకి ఆహ్వానించామని చెప్పుకొచ్చాడు. నాగార్జునసాగర్ లో బీజేపీ గెలుస్తుందని పేర్కొన్నారు.