Raghunandan : ఐటీ సోదాలకీ, గుండె నొప్పికీ లింకేంటి.? బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ డౌటానుమానం.!
NQ Staff - November 23, 2022 / 02:19 PM IST

Raghunandan : సీబీఐ సోదాలు జరిగినా, ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు జరిగినా, ఐటీ దాడులు జరిగినా.. ప్రముఖులకు చాలా తేలిగ్గా గుండె నొప్పి వచ్చేస్తుంటుంది. సర్వసాధారణమైన వ్యవహారమిది. సంబంధిత శాఖల అధికారులకీ ఇది పరమ రొటీన్ వ్యవహారంగా మారిపోయింది.
తెలంగాణ రాష్ట్ర సమితి నేత, మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఆస్తులపైనా, బంధువులపైనా ఆదాయపు పన్ను శాఖ స్పెషల్ పోకస్ పెట్టింది. నిన్నటి నుంచీ సోదాలు జరుగుతున్నాయి.
కొడుక్కి గుండె నొప్పి.!
మల్లారెడ్డి తనయుడు గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరారు. మల్లారెడ్డి బంధువు ప్రవీణ్ రెడ్డి కూడా గుండె నొప్పితోనే ఆసుపత్రిలో చేరారు. విచారణ సందర్భంగా ‘గుండె నొప్పి’ అని సదరు ప్రముఖులు చెప్పడంతో, ఐటీ అధికారులే వారిని ఆసుపత్రికి తరలించారట.
తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందిన మల్లారెడ్డి, ఆసుపత్రికి వెళ్ళేందుకు ప్రయత్నించగా ఐటీ అధికారులు అడ్డుకున్నారట. ఈ మొత్తం వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
‘ఉదయం వాకింగ్‌కి కూడా వెళ్ళి వచ్చిన వ్యక్తి, అనూహ్యంగా గుండె పోటు అనడమేంటి.? సోదాల సందర్భంగా ఎందుకు ప్రముఖులకు గుండె నొప్పి వస్తుంది.?8 అంటూ అనుమానం వ్యక్తం చేశారు రఘునందన్.