Bellampally Municipality : మంత్రి కేటీయార్ బర్త్ డే వేడుకలకు గైర్హాజరు: ఉద్యోగులకు మెమో జారీ.!

NQ Staff - July 29, 2022 / 08:11 PM IST

Bellampally Municipality : మంత్రి కేటీయార్ బర్త్ డే వేడుకలకు గైర్హాజరు: ఉద్యోగులకు మెమో జారీ.!

Bellampally Municipality : తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పుట్టినరోజు వేడుకల్ని పార్టీ శ్రేణులు ఇటీవల ఘణంగా నిర్వహించాయి. పార్టీ పరంగా ఇలాంటి వేడుకలు నిర్వహించడమనేది సర్వసాధారణం. కానీ, ప్రభుత్వ పరంగా కూడా వేడుకలు నిర్వహిస్తారా.? నిర్వహిస్తే మాత్రం అది చర్చనీయాంశమే.!

Bellampally Municipality Issued Memo Three Employees

Bellampally Municipality Issued Memo Three Employees

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మునిసిపాలిటీ, ముగ్గురు ఉద్యోగులకు మెమో జారీ చేసింది, కేటీయార్ పుట్టినరోజు వేడుకలకు గైర్హాజరయ్యారన్న కారణంగా. ఈ నెల 24వ తేదీన బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉదయం 10 గంటలకు కేటీయార్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారట.

వాట్సాప్‌లో సమాచారం పంపినా గైర్హాజరయ్యారని..

Bellampally Municipality Issued Memo Three Employees

Bellampally Municipality Issued Memo Three Employees

ఉద్యోగులంతా ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా సమాచారం పంపినా కూడా, ముగ్గురు ఉద్యోగులు (సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సిస్టమ్ మేనేజర్) ఆ ఆదేశాల్ని లెక్క చేయలేదన్నది ‘మెమో’లో ఉన్నతాధికారులు పేర్కొన్న అంశం.

బెల్లంపల్లి మునిసిపాలిటీ కమిషనర్ ఈ మేరకు మెమో జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. రాజులు, రాజ్యాల కాలంలో.. ఇలాంటివి జరిగేవేమోగానీ, ప్రజాస్వామ్య దేశంలో ప్రభువుల సేవలో తరించాలనడమేంటి.? అన్నది సర్వత్రా వెల్లువెత్తుతోన్న విమర్శ.
సాధారణంగా ఇలాంటి విషయాలపై సోషల్ మీడియా వేదికగా సీరియస్‌గా స్పందించే కేటీయార్, ఇప్పుడేమంటారో.?

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us