తెలంగాణాలో మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయం : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణాలో జిహెచ్ఎంసి ఎన్నికల పోరు జోరుగా సాగుతుంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు ప్రచారంలో స్పీడ్ ను పెంచాయి. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ ల మధ్య మాటల యుద్ధం తీరా స్థాయిలో జరుగుతుంది. ఒకరిపై మరొకరు విమర్శలు పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. ఇక ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అయితే ఆయన మాట్లాడుతూ.. తెలంగాణాలో జిహెచ్ఎంసి ఎన్నికలు అయిపోగానే మధ్యంతర ఎన్నికలు వస్తాయని వ్యాఖ్యానించాడు.

bandi sanjay
bandi sanjay

అవినీతి ప్రభుత్వం కూలిపోవడడం ఖాయమని, ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. సీఎం కెసిఆర్ జైలుకు పోవడం ఖాయమని పేర్కొన్నారు. ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒక్కో డివిజన్ కు 5 కోట్ల రూపాయలు పంచుతుందని, ఆ డబ్బులు అందరు తీసుకోవాలని ఓటర్లకు సూచించాడు. ఓటు మాత్రం బీజేపీ కి వేయాలని చెప్పుకొచ్చాడు. తెలంగాణాలో కారు సారు.. ఇక రారు అని హితువు పలికాడు.

తెలంగాణ వచ్చాక కెసిఆర్ తన కుటుంబం బాగుపడింది కానీ తెలంగాణ ప్రజలు మాత్రం బాగుపడలేదని చెప్పుకొచ్చాడు. మొత్తానికి మధ్యంతర ఎన్నికలు వస్తాయని బండి సంజయ్ పలికిన మాటలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలకు అధికార పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Advertisement
Advertisement