Bandi Sanjay : బండి సంజయ్‌ని తెలంగాణ సీఎం కేసీయార్ ఆపగలరా.?
NQ Staff - November 27, 2022 / 10:35 PM IST

Bandi Sanjay : కేసీయార్ ఎంతలా ఆపాలని చూస్తున్నా, తెలంగాణలో బీజేపీ యెదుగుదలని మాత్రం ఆపలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా బండి సంజయ్ విషయంలో కేసీయార్ పప్పులుడకని పరిస్థితి కనిపిస్తూనే వుంది.
అనూహ్యంగా తెలంగాణ రాజకీయాల్లో బండి సంజయ్ ఎదిగారు. బహుశా కేసీయార్ ఊహించని ఎత్తుకి ఆయన ఎదిగారనడం అతిశయోక్తి కాదేమో. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్, తెలంగాణలో బీజేపీ యెదుగుదల కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.
ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. ఆగేదే లే.!
ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ ప్రారంభించనుండగా, ‘సున్నితమైన పరిస్థితులు’ అనే సాకుతో తెలంగాణ పోలీస్, బండి సంజయ్ పాదయాత్రకు ఆదిలోనే బ్రేకులేసేందుకు ప్రయత్నిస్తోంది.
అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు బహిరంగ సభ నిర్వహించి తీరతాననీ, పాదయాత్ర ఆపేది లేదని బండి సంజయ్ చెబుతున్నారు. అవసరమైతే న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయిస్తామన్నది బండి సంజయ్ వాదన.
ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకపోవడమేంటి.? అన్న ప్రశ్న తరచూ ఉత్పన్నమవుతుండడం తెలంగాణ ప్రభుత్వానికే మంచిది కాదు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, బండి సంజయ్‌ని ఆపాలని చూడటం ద్వారా ఏం సాధించనున్నట్టు.?