Bandi Sanjay : నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రకు బండి సంజయ్ రెడీ.!
NQ Staff - September 10, 2022 / 09:55 PM IST

Bandi Sanjay : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇప్పటిదాకా మూడు విడతల పాదయాత్ర పూర్తి చేసిన బండి సంజయ్, ఈసారి నాలుగో విడత పాదయాత్రలో మల్కాజిగిరి పార్లమెంటు మీద స్పెషల్ పోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి పాదయాత్ర మొదలు కానుంది.

Bandi Sanjay is ready for the news Praja Sangrama Yatra
ప్రారంభ సభకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ హాజరు కానున్నారు. ఈ నెల 22న పెద్ద అంబర్ పేట రింగు రోడ్డు సమీపంలో పాదయాత్ర ముగుస్తుంది. గ్రేటర్ వాసుల సమస్యలే ప్రధాన ఎజెండాగా ఈ పాదయాత్ర జరగనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
మూడు విడతలూ సూపర్ సక్సెస్..
తొలి విడత, అంతకు మించి రెండో విడత.. దానికి మించి మూడో విడత పాదయాత్ర సక్సెస్ అయ్యింది. నాలుగో విడత పాదయాత్ర మరింత సక్సెస్ అవుతుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
హైద్రాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోల్చితే భిన్నమైన సమస్యలున్నాయనీ, వాటిని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్రలో అడ్రస్ చేయనున్నారనీ తెలుస్తోంది.
ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు, దోమల సమస్య, పెట్రోల్ – డీజిల్ మీద వ్యాట్ తగింపు వంటి అంశాలపైనా పాదయాత్రలో చర్చిస్తామని బీజేపీ చెబుతోంది. పాదయాత్రను అడ్డుకునేందుకు అధికార పార్టీ ఎలాంటి ప్రయత్నాలు చేసినా వాటిని తిప్పి కొడతామని బీజేపీ నేతలు చెబుతున్నారు.
‘పోలీసులు అనుమతిచ్చినా, ఇవ్వకున్నా.. న్యాయస్థానాన్ని ఆశ్రయించి అయినా పాదయాత్ర చేసి తీరతాం..’ అని బీజేపీ చెబుతోంది. కూకట్‌పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా సాగే యాత్ర పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డుకి సమీపంలో ముగుస్తుంది నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర.