భాగ్యలక్ష్మి టెంపుల్ ఏమైనా పాకిస్థాన్ లో ఉందా.. టీఆర్ఎస్ పై బండి సంజయ్ ఫైర్
Admin - November 22, 2020 / 04:16 PM IST

బీజేపీ తీసుకున్న నిర్ణయానికి టీఆర్ఎస్ నాయకులకు భయం ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కొంతమంది టీఆర్ఎస్ నాయకులు సంజయ్ ను అరెస్ట్ చేయాలనీ మాట్లాడడం ఏంటని మండిపడ్డారు. నేను విసిన సవాల్ కు కెసిఆర్ బయపడి రాలేదని చెప్పుకొచ్చాడు. భాగ్యనగర్ కు పేరు వచ్చిందే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి వలన అని తెలిపాడు. అయిన భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఏ పాకిస్తాన్ లోనో, ఏ బాంగ్లాదేశ్ లోనో లేదని చెప్పుకొచ్చాడు. టీఆర్ఎస్ అబద్దాలను ప్రచారం చేస్తుందని, అయినా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని వారికీ నిజాలు యేవో తెలుసనీ వెల్లడించాడు.