Bandi : బండి సంజయ్ సార్.. భలే ‘క్యాండేట్’ని పెట్టావ్ పో..

Bandi : ప్రస్తుతం అన్ని రకాల మీడియాల్లో చక్కర్లు కొడుతున్న ఒక వీడియోని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సార్ గారు చూశారో లేదో తెలియదు. దాన్ని చూసిన ప్రతిఒక్కరూ ‘‘కమలనాథులు భలే క్యాండేట్ ని పెట్టారు పో’’ అని అంటున్నారు. నాగార్జునసాగర్ శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీల అభ్యర్థుల్లాగే కాషాయం పార్టీ అభ్యర్థి పానుగోతు రవి కుమార్ కూడా ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. ‘‘అడుగుతున్నారు’’ అనే పదం కంటే ‘‘అడుక్కుంటున్నారు’’ అనే పదం వాడితే ఇంకా బాగుంటుందని, సూటబుల్ గా కూడా ఉంటుందని సోషల్ మీడియా అభిప్రాయపడుతోంది. ఎందుకంటే వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఈ రవికుమార్ పాలిటిక్స్ ప్రవృత్తి రీత్యా యాక్టర్ గా సరికొత్త అవతారం ఎత్తాడని వెటకారంగా చెప్పుకుంటున్నారు. ముందు మీరు ఈ వీడియో చూడండి. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం.

వార్నీ.. వేషాలో..

ఈ వీడియోలో మీరు చూసిన వ్యక్తే ఆ పానుగోతు రవి కుమార్. పైన తెల్ల చొక్కా.. కింద తెల్ల బూట్లు.. మెడలో పార్టీ కండువా.. దాంతోపాటే ఒక పూల దండ.. సగటు రాజకీయ నాయకుడి వేషమే. అయితే అక్కడితో ఈ సన్నివేశం అయిపోలేదు. చుట్టూ పది మందిని వేసుకొని ప్రచారం చేస్తున్నాడు. ఒక చోట కొంత మంది ఓటర్లు కనపడేసరికి ఇంకేముంది ‘‘భాంచన్ నీ కాల్మొక్తా అనే రీతిలో ఒంగి ఒంగి వాళ్ల కాళ్లు పట్టుకోబోయాడు. తర్వాత రెండు చేతులూ జోడించి నమస్కారం చేశాడు. ఇక ఆ తర్వాత మొదలు పెట్టాడు. అరిగోస. లబా లబా నెత్తీ, నోరు, చేతులు కొట్టుకున్నాడు. దయచేసి నాకు ఓట్లేయండి బాబో అని మొత్తుకున్నాడు. చంటి పిల్లాడి లెక్క గుక్క తిప్పుకోకుండా ఏడ్చేశాడు. అది చూసినవాళ్లంతా ‘‘వార్నీ ఓటు వేషాలో. ఇక ఆపరా నాయనా. నీకే ఓటేస్తాంలేగానీ’’ అని మనసులో అనుకున్నారు.

ఎందుకీ విచిత్ర పవర్తన?: Bandi

పానుగోతు రవికుమార్ సామాజికపరంగా గిరిజనుడు(లంబాడీ). సహజంగా ఎస్టీల్లోని ఆ వర్గం వాళ్లు ఒకప్పట్లో(నా చిన్నతనంలో.. మా ఊరిలో..) చుట్టాలు ఇంటికి వస్తే ఆనందం ఆపుకోలేక ముఖ్యంగా ఆడవాళ్లు ముఖానికి కొంగు అడ్డం పెట్టుకొని ఒకర్ని ఒకరు దగ్గరకు తీసుకొని పెద్దగా ఏడ్చేసేవాళ్లు. అసలు విషయం తెలియక బయటి నుంచి చూసేవాళ్లు ఆ ఇంట్లో ఎవరైనా ‘‘బకెట్ తన్నారా’’ అని అనుమానపడేవాళ్లు. బహుశా ‘‘కాబోయే ఎమ్మెల్యే’’ అనలేని ఈ వ్యక్తి కూడా ఇంకా అదే కల్చర్ ని మర్చిపోలేదేమో అని జనం భావిస్తున్నారు. నిజానికి ఇతణ్ని బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది బండి సంజయ్ కుమార్ కాదు. అధిష్టానం. అయితే.. హైకమాండ్ కి రికమండ్ చేసింది మాత్రం ఆయనే.

Bandi : nagarjunasagar bjp candidate differently campainging
Bandi : nagarjunasagar bjp candidate differently campainging