Dasara Festival : దసరా పండగ కిక్కు.! 1100 కోట్ల మద్యం తాగేశారహో.!

NQ Staff - October 7, 2022 / 03:18 PM IST

Dasara Festival  : దసరా పండగ కిక్కు.! 1100 కోట్ల మద్యం తాగేశారహో.!

Dasara Festival  : విజయదశమి పండక్కి, తెలంగాణలో మందుబాబులు ప్రభుత్వానికి బోల్డంత ‘కిక్కు’ ఎక్కించారు. ప్రభుత్వ ఖజానానికి మద్యం కిక్కు భలేగా కలిసొచ్చింది.

చాలామందికి విజయదశమి అంటే మద్యంతోపాటు మాంసాహారం కూడా తప్పనిసరి. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలూ అలాగే నాన్ వెజ్ అమ్మకాలూ విజయదశమి సీజన్‌లో చాలా జోరుగా సాగాయ్. మరీ ముఖ్యంగా మద్యం అమ్మకాలైతే సరికొత్త రికార్డుల్ని నెలకొల్పాయ్..

ఏడు రోజుల్లో రికార్డు అమ్మకాలు..

కేవలం వారం రోజుల్లోనే ఏకంగా 1100 కోట్ల రూపాయల మద్యాన్ని తాగేశారు మందుబాబులు తెలంగాణలో. ఇది సరికొత్త రికార్డుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల వద్ద గడచిన ఏడు రోజుల్లో నిత్యం రద్దీ కనిపిస్తూ వచ్చింది.

మద్యం కిక్కుతో ఖజానా కళకళ్లాడుతోందన్న చర్చ ఓ వైపు, మందుబాబుల బలహీనతను ప్రభుత్వం క్యాష్ చేసుకుంటోందన్న విమర్శలు ఇంకో వైపు.. ఆ సంగతి పక్కన పెడితే. ప్రభుత్వ ఖజానాకి మద్యం ఆదాయం మాంఛి కిక్కు ఇవ్వడమైతే విశేషమే కదా.!

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us