Revanth Reddy : తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ.! పేరు రిజిస్టర్ చేయించిన రేవంత్ రెడ్డి.?

NQ Staff - December 26, 2022 / 07:42 PM IST

Revanth Reddy : తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ.! పేరు రిజిస్టర్ చేయించిన రేవంత్ రెడ్డి.?

Revanth Reddy : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చుట్టూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లే నానా రచ్చా చేస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్ సహా, టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతల్ని ‘వలస నేతలు’గా కాంగ్రెస్ సీనియర్లు పిలవడం, కాంగ్రెస్ పార్టీలో పెను ప్రకంపనలకు కారణమయ్యింది.

రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు చాలామందే వున్నారు. అందులో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు.

కొత్త పార్టీ రేవంత్ పెట్టబోతున్నారా.?

రేవంత్ రెడ్డి తాజాగా తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు రంగం సిద్ధం చేశారనీ, కొత్త పార్టీని రిజిస్ట్రేషన్ కూడా చేయించారనీ ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సామాజిక కాంగ్రెస్ పార్టీగా దానికి పేరు పెట్టినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

అసలు ఇది సాధ్యమేనా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, తెలంగాణ రాజకీయాల్లో ఇంకో కొత్త పార్టీకి, అందునా.. రేవంత్ రెడ్డి పెట్టబోయే పార్టీకి రాజకీయంగా ఎంత స్కోప్ వుంటుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

వాస్తవానికి రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా పనిచేశారు. రాజకీయంగా ఆయన ఎదిగింది టీడీపీలోనే. మళ్ళీ తెలంగాణలో టీడీపీ పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ ప్రచారం జరుగుతున్న వేళ, అవకాశం ఏమన్నా వుంటే రేవంత్ అటువైపుకు దూకేందుకు ఆస్కారమెక్కువ.

బీజేపీ నుంచి కూడా ఆహ్వానం వున్నాగానీ..

రేవంత్ రెడ్డి బీజేపీలో చేరితే మంచి భవిష్యత్తు వుంటుందని కొందరు రేవంత్ రెడ్డి అనుచరులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డికి బీజేపీ నుంచి కూడా ఆఫర్ వుంది. కానీ, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తెస్తానంటున్నారు.

తెలంగాణ జన సమితి సహా తెలంగాణలో చాలా ‘ఇంటి’ పార్టీలున్నాయి. అవేవీ రాజకీయంగా మనుగడ సాధించలేకపోయాయి. ఈ తరుణంలో రేవంత్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీ పెడతారని అనుకోలేం.
కానీ, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.! ఏమో గుర్రం ఎగరావచ్చు.!

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us