Telangana : తెలంగాణలో అమరరాజా రూ.9500 కోట్ల పెట్టుబడులు
NQ Staff - December 2, 2022 / 10:18 PM IST

Telangana : అమర రాజా గ్రూప్ కు చెందిన బ్యాటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలో 9500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మంత్రి కేటీఆర్ సమక్షం లో రాష్ట్ర ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.
విద్యుత్ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీలను తెలంగాణలో తయారు చేసేందుకు గాను అమరరాజ సంస్థ ముందుకు వచ్చినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ప్రభుత్వంతో అమరరాజా గ్రూప్ ఒప్పందం చేసుకోవడం జరిగింది.
ఈ ఒప్పంద కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో పాటు అమర రాజా సంస్థ చైర్మన్, ఎండీ గల్లా జయదేవ్ ఇంకా పలువురు సంస్థ ప్రతినిధులు ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన అమర రాజ సంస్థకు శుభాకాంక్షలు. ఈ సంస్థ గత 37 సంవత్సరాలుగా వినియోగదారులకు సేవలు అందిస్తుంది.
రాష్ట్రానికి వచ్చిన భారీ ప్రాజెక్టుల్లో ఇది ఒకటి, తెలంగాణలో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. పరిశ్రమలకు మరియు పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలుగా అవకాశాలు కల్పించే విధంగా తెలంగాణలో వసతులు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు.