Realme Pad X : తొలి 5జీ ట్యాబ్గా రియల్మీ ప్యాడ్ ఎక్స్.. ఫీచర్స్ ఏంటో తెలుసా?
NQ Staff - July 15, 2022 / 07:18 PM IST

Realme Pad X : మిడ్ రేంజ్లో 5జీ కనెక్టివిటీని కలిగి ఉన్న ట్యాబ్‌ని తీసుకొచ్చేందుకు రియల్ మీ కసరత్తులు చేస్తుంది. రియల్మీ ప్యాడ్ ఎక్స్ అతి త్వరలోనే ఇండియాలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని రియల్మీ అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే చైనాలో లాంచ్ అయిన ఈ ట్యాబ్ అతిత్వరలో ఇండియాకు రానుంది.
మంచి ఫీచర్స్‌తో..
రియల్మీ ఇండియా వెబ్సైట్లో ట్యాబ్ కోసం ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసింది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్లోనూ లిస్ట్ అయింది. స్పెసిఫికేషన్లు, అంచనా ధర వివరాలు చూస్తే.. చైనా మోడల్ స్పెసిఫికేషన్లతో భారత్‌లోనూ రియల్మీ ప్యాడ్ ఎక్స్ విడుదల కానుంది. 2K రెజల్యూషన్ ఉన్న 11 ఇంచుల డిస్ప్లేను రియల్ మీ ప్యాడ్ ఎక్స్ కలిగి ఉంటుంది.

Realme Pad X will Released in India
స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఈ ట్యాబ్‌లో ఉంటుంది. గరిష్ఠంగా 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వరకు ఉంటుంది. స్టోరేజ్‌ను పొడిగించుకునేందుకు ఈ ట్యాబ్‌లో మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్‌ను రియల్మీ ఇస్తోంది. 5జీ కనెక్టివిటీకి ఈ రియల్మీ ట్యాబ్ సపోర్ట్ చేస్తుంది. దీని వెనుక 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 105 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉండే ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
ఈ ట్యాబ్‌లో 8,340 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉన్న నాలుగు స్పీకర్లు ఈ ట్యాబ్‌కు ఉంటాయి. రియల్మీ మ్యాగ్నటిక్ స్టైలస్, కీబోర్డ్‌ను రియల్మీ ప్యాడ్ ఎక్స్‌కు పెయిర్ చేసుకొని వాడుకోవచ్చు.
4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ ఉన్న రియల్ ప్యాడ్ ఎక్స్ ట్యాబ్ బేస్ వేరియంట్ ధర చైనాలో 1,299 యువాన్లు (సుమారు రూ.15,000)గా ఉంది. భారత్‌లోనూ ఇదే ధరతో ఈ ట్యాబ్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా అందుబాటులోకి రానుంది.