OPPO K10 5G : ఒప్పో నుండి అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్ లోకి కొత్త 5జీ ఫోన్..!

NQ Staff - June 9, 2022 / 07:47 PM IST

OPPO K10 5G : ఒప్పో నుండి అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్ లోకి కొత్త 5జీ ఫోన్..!

OPPO :ధునిక ప్రపంచంలో మొబైల్ ఫోన్ వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరి చేతిలోనైనా మొబైల్ ఫోన్ కచ్చితంగా ఉండాల్సిందే. గతంలో ఫోన్ ఉంటే చాలు స్టేటస్ గా ఫీల్ అయ్యేవారు అయితే ఇప్పుడు మంచి ఫీచర్స్ వున్న ఫోన్ ఉంటేనే స్టేటస్ గా ఫీల్ అవుతున్నారు. ఐఫోన్, సామ్సంగ్ ఇలా మంచి ఫోన్స్ కోసం కాస్త డబ్బు ఎక్కువైనా సరే కొనుగోలు చేస్తున్నారు జనం. ప్రజల అబీష్టం మేరకు రోజు రోజుకు అధిక సంఖ్యలో ఫోన్స్ మార్కెట్ లోకి వచ్చి కష్టమర్లను కవ్విస్తున్నాయి. గతంలో మిగతా ఫోన్స్ కు ఏమాత్రం పోటీ ఇవ్వని ఒప్పో ఇప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో మిగతా ఫోన్స్ కు పోటీగా మారింది.

OPPO-K10-5G

ఒప్పో నెక్స్ట్ కే సీరిస్ ఫోన్ కే10 5జీ ఫోన్ ను ఈనెల 8వ తేదీన అధికారికంగా విడుదల చేయనుంది. 5జీ తో పాటు పలు ఫీచర్స్ తో రానుంది ఈ ఫోన్. 810 చిప్ సెట్ తో అందుబాటులో వుంది. చైనీస్ వర్షన్ తో పోలిస్తే భారత్ వర్షన్ పర్ఫామెన్స్ తక్కువగా ఉండడానికి చిప్ సెట్ వ్యత్యాసమే కారణం అని టెక్ నిపుణులు అంటున్నారు. అందుకే చైనా కంటే భారత్ వర్షన్ ఎక్కువ చిప్ తో వస్తుంది. ఈ ఫోన్ కు వెనుకవైపు రెండు కెమెరాలు వున్నాయి. బ్లాక్, బ్లూ కలర్స్ లో ఈ ఫోన్ అందుబాటులో వున్న ఈ ఫోన్ ధర భారత్ లో రూ.15,000 వేలు వుంటుంది. ఫ్లిప్ కార్డు, ఒప్పో అన్ లైన్ స్టోర్ లతో పాటు మిగిలిన రిటైల్ షాప్స్ లో ఈ ఫోన్స్ వున్నాయి. మిగతా ఫోన్ లకంటే ఈ ఫోన్ కస్టమర్లను బాగా ఆకట్టుకుంటుంది. ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ కూడా అందుబాటులో వుంది.

OPPO-K10-5G

OPPO-K10-5G

ఈసారి మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఒప్పో ధరలు వున్నాయి. కె10 ఫోన్ ఎప్పుడెప్పుడు అంటూ కష్టమర్లు ఎదురుచూస్తున్నారు. ఫోన్ లాంచ్ కు ముందే ఏ ప్రాసేసర్ తో వస్తుందో అన్న విషయాన్ని కూడా ఒప్పో చెప్పింది. ఇదే మొబైల్ చైనా లో 8000 + మ్యాక్స్ తో వస్తుండగా చైనా వేరియంట్ తో పోలిస్తే చాలా మార్పులతో ఈ ఫోన్ భారత్ లో అందుబాటులోకి రానుంది. జూన్ 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ అధికారికంగా లాంచ్ అవుతుంది. స్లిమ్, స్టైలిష్ డిజైన్ లతో ఈ ఫోన్ రానుంది, సైట్ ఫ్లిప్ కార్డ్ లలో అందుబాటులోకి రానుంది. 6.56 ఇంచులతో ఫుల్ హెచ్డీ తో ఫోన్ వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసేసర్ గా వుంది.

OPPO-K10-5G

OPPO-K10-5G

ఒప్పో కె10 ఫోన్ కు వెనుక రెండు కెమెరాల సెటప్ వుంటుంది. 48 మెగాఫిక్సెల్ ప్రధాన కెమెరా వుంటుంది. 2మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా వుంటుంది. సెల్ఫీ, వీడియోల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందుబాటులో ఉంచారు. ఈ ఫోన్ 5,000 మహా బ్యాటరీ వుంటుంది. 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వుంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్ల సెటప్ తో ఈ ఫోన్ రావొచ్చు.

Read Today's Latest Technology in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us