WhatsApp : వాట్సప్ లో ‘కెప్ట్ మెస్సేజెస్’ అనే కొత్త ఫీచర్.. ఇక ఆ ఇబ్బందికి చెక్
NQ Staff - September 8, 2022 / 03:16 PM IST

WhatsApp : ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో కొత్త ఫీచర్ తో వినియోగదారుల ముందుకు రాబోతుంది. రెగ్యులర్ గా కొత్త కొత్త మార్పులను తీసుకు వస్తున్న వాట్సప్ ఈసారి కెప్ట్ మెస్సేజెస్ అనే సరికొత్త ఫీచర్ తో వినియోగదారులకు అనుకూలంగా ఉండే నిర్ణయాన్ని తీసుకుంది.
సాధారణంగా ఒక గ్రూపు లేదా వ్యక్తిగత చార్ట్

Messaging App WhatsApp Comes Another New Feature
అనవసరం అనుకున్నప్పుడు డిసప్పియరింగ్ మెస్సేజెస్ అనే ఆప్షన్ ని వాట్సాప్ ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసుకున్న దాన్ని ప్రకారం ఒకరోజు లేదా వారం రోజులలో ఆ మెసేజ్లు అన్ని ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి.
అయితే ఆ మెసేజ్ ల్లో కొన్ని మెసేజ్ లు సేవ్ చేసుకొని మిగతావి డిలీట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు. కానీ ఇక ముందు కెప్ట్ మెసేజెస్ ఆప్షన్ తో ఆ అవకాశం ఉంటుందని వాట్సప్ అధికారికంగా ప్రకటించింది.
కావలసిన మెసేజ్ లను కెప్ట్ మెసేజెస్ గా ఎంపిక చేసుకుంటే డిసప్పియరింగ్ మెసేజెస్ ఆన్ లో ఉన్నా కూడా ఆ మెసేజ్ లు అలాగే ఉంటాయని వాట్సప్ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు.
అతి త్వరలోనే ఈ ఫీచర్ వినియోగదారులకు అందుబాటులోకి రాబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. మెసేజ్లను సేవ్ చేసుకునే ఆప్షన్ రావడంతో కచ్చితంగా ఇది అందరికీ ఉపయోగదాయకం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.