Whatsapp: వాట్సాప్‌లో యూపీఐ పేమెంట్ ఫీచ‌ర్.. ఎలా క్రియేట్ చేయాలంటే..!

NQ Staff - March 14, 2022 / 05:17 PM IST

Whatsapp: వాట్సాప్‌లో యూపీఐ పేమెంట్ ఫీచ‌ర్.. ఎలా క్రియేట్ చేయాలంటే..!

Whatsapp: వాట్సాప్‌ మెసేజింగ్ యాప్ ప్ర‌తి ఒక్క‌రి ఫోన్స్‌లో త‌ప్ప‌క ఉంటుంది. ఇది యూజ‌ర్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. అందుకే ఎన్ని రకాల మెసేజింగ్‌ యాప్స్‌ వచ్చినా వాట్సాప్‌ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండడం, అన్ని రకాల ఫీచర్లు అందుబాటులో ఉండడంతో వాట్సాప్‌ను ఎక్కువ మంది ఉపయోగిస్తుంటారు.

How to create Whatsapp UPI Feature

How to create Whatsapp UPI Feature

చివరికి యూపీఐ పేమెంట్స్ కూడా వాట్సాప్‌ ద్వారానే చేసుకునే అవకాశం ఉండడం.. వాట్సాప్‌ క్రేజ్‌ తగ్గకపోవడానికి ఓ కారణంగా చెప్పవచ్చు. ఇలా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న వాట్సాప్‌ తాజాగా యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. వాట్సాప్ ఇన్ చాట్ పేమెంట్ అనే టూల్ ప్రవేశపెట్టింది. ఈ టూల్ యూపీ ఆధారిత పేమెంట్ ఆప్షన్ కలిగి ఉంటుంది.

దీనిద్వారా వాట్సాప్ పేమెంట్స్ పంపుకోవచ్చు. మీ వాట్సాప్ కాంటాక్టు లిస్టులోని వారికి డబ్బు పంపడం లేదా వారి నుంచి కూడా పొందే అవకాశం ఉంది. ఈ టూల్ వర్క్ చేయాలంటే ముందుగా మీరు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా డెవలప్ చేసిన WhatsApp Pay యాక్టివేట్ చేసుకోవాలి.

WhatsApp Pay ఫిబ్రవరి 2018లో ట్రయల్ రన్‌గా భారతదేశంలో విడుదల చేయబడింది. తర్వాత ఫిబ్రవరి 7, 2020న WhatsApp తన డిజిటల్ చెల్లింపు సేవను దశలవారీగా ప్రారంభించేందుకు NPCI ఆమోదం పొందింది. వాట్సాప్ చెల్లింపు సేవ ప్రారంభంలో దేశంలోని 10 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు. అయితే WhatsApp Payని ఉపయోగించడానికి వినియోగదారు ముందుగా డబ్బు పంపే వ్యక్తి నుంచి అభ్యర్థనను స్వీకరించిన తర్వాత వినియోగదారు WhatsAppలో వారి UPI ఖాతాను సెటప్ చేయవచ్చు.

WhatsApp Pay ద్వారా పేమెంట్స్ చేయాలంటే ముందుగా డబ్బు పంపే వ్యక్తి నుంచి రిక్వెస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాతే యూజర్ Whatsapp వారి అకౌంట్లో UPI సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టూల్ ద్వారా WhatsApp Pay యూజర్లు తమ కాంటాక్ట్‌లలో ఎవరికైనా డబ్బు పంపేందుకు అనుమతినిస్తుంది.

ఇక్కడే మీరు UPI IDని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. Whatsapp Pay యూజర్లు తమ UPI IDని నమోదు చేయడం ద్వారా డబ్బు పంపవచ్చు. యూజర్లు తమ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తులకు డబ్బు పంపడానికి QR కోడ్‌ ద్వారా కూడా యాక్సస్ చేసుకోవచ్చు. వాట్సాప్ యూజర్లు వాట్సాప్ చాట్ ద్వారా నేరుగా మనీ పంపుకోవచ్చు. చాట్‌లో అటాచ్‌మెంట్ ఆప్షన్ దగ్గరే ఒక రూపాయి సింబల్ ఉంటుంది. మెసేజింగ్ సాఫ్ట్‌వేర్ యూజర్లు తమ డబ్బును పంపుకోవచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు.

Read Today's Latest Technology in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us