WhatsApp : గుడ్ న్యూస్ చెప్పిన వాట్సాప్.. డిలీట్ అయిన మెసేజ్ తిరిగి పొందే ఆప్షన్
NQ Staff - August 20, 2022 / 08:51 AM IST

WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ సంస్థ వాట్సాప్ వినియోగదారులకి గుడ్ న్యూస్ చెప్పింది.ఇటీవల యూజర్స్ సౌలభ్యంకి తగ్గట్టు కొత్త ఫీచర్స్ అందిస్తుండగా, తాజాగా వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌ని తిరిగి పొందే ఆప్షన్‌ను అందించనున్నారు. ఇప్పుడు ఇది ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో ప్రయోగాత్మక దశలో ఉంది.

Good news WhatsApp
సరికొత్త ఫీచర్స్‌తో..
ఇప్పుడు ఎవరికైనా సందేశాన్ని పంపి, పొరపాటున దానిని తొలగించినట్లయితే, ఆ సందేశాన్ని తిరిగి పొందేందుకు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. అయితే ఈ ఆప్షన్ అమల్లోకి రావడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు . త్వరలో ఆండ్రాయిడ్ , ఐఓఎస్ యూజర్లకు ఈ ఆప్షన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది . ఇదే మరొక కొత్త ఫీచర్ కూడా డెవలప్ చేస్తున్నారు.
వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోలో అవతార్ అనే ఆప్షన్‌ను డెవలప్ చేస్తున్నట్లు వాట్సాప్ బెటా ఇన్ఫో నివేదించింది . ఈ అవతార్ ఫీచర్‌ని ఉపయోగించడం ద్వారా మీరు మీ ప్రొఫైల్ ఫోటోను మరింత అందంగా మార్చుకోవచ్చు . అంటే , ఇక్కడ మీరు బ్యాక్ గ్రౌండ్ కలర్ ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది . ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ మరికొద్ది రోజుల్లో ఆండ్రాయిడ్ , iOS, డెస్క్‌టాప్ యూజర్లకు అందుబాటులోకి రానుంది .
దీనికి అదనంగా, కొత్త లాగిన్ ఫీచర్‌ను తీసుకురావాలని ప్రతిపాదించింది . న్యూ డివైజ్‌లో మీ వాట్సాప్ ఖాతాకు లాగిన్ చేస్తే , మీకు వాట్సప్ నుండి నోటిఫికేషన్ వస్తుంది . మీరు లాగిన్ చేస్తున్నారా లేదా అని నిర్ధారించమని ఈ నోటిఫికేషన్ మిమ్మల్ని అడుగుతుంది . మీరు ఓకే చేస్తేనే వాట్సాప్ లాగిన్ అవుతుంది . అలాగే, మీరు 6 -అంకెల వెరిఫికేషన్ కోడ్‌ను తప్పుగా షేర్ చేస్తే, మీ లాగిన్ ప్రయత్నం విఫలమవుతుంది.