Connect with us

Latest News

అచ్చెన్నాయుడు కష్టం కూడా లొకేశ్ ఖాతాలో పడనుందా!

Published

on

Share the News from here

డీలాపడ్డ టీడీపీ నేతల్లో నూతన ఉత్సహాన్ని నింపడానికి టీడీపీ నాయకత్వాన్ని అచ్చెన్నాయుడుకి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు పతకం రచిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కూడా టీడీపీలోనే ఉన్న అచ్చెన్నాయుడుకి పార్టీ పగ్గాలు అప్పగించడంలో ఎలాంటి తప్పు లేదని టీడీపీ సీనియర్ నేతలు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టనున్న అచ్చెన్నాయుడుకి నారా లొకేశ్ నుండి ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటి వరకు పార్టీని నడిపించిన లొకేశ్ ముద్రను అచ్చెన్న తొలగించి, తన ముద్రను వేయడం కష్టంగా మారనుంది.

ఎలాగోలా కష్టపడి టీడీపీ నాయకులను తన దారిలోకి తెచ్చుకొని రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించినా కూడా ఆ ఫలితం లొకేశ్ కే దక్కుతుందని, చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడిని ముఖ్యమంత్రి కానివ్వడని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అలా కాకుండా పార్టీ ఓటమి పాలు అయితే మాత్రం ఆ నిందను బాబు అచ్చెన్నాయుడు మీదకు నెట్టేస్తాడని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇవన్నీ తెల్సి కూడా అచ్చెన్నాయుడు టీడీపీ పగ్గాలు చేపడుతాడో లేదో వేచి చూడాలి.

Do NOT follow this link or you will be banned from the site!