Telugu News » Tag » YSRP
అధికార పార్టీ నేతల నడుమ రాజుకుంటున్న అంతర్గత కలహాలు మెల్లగా జనంలోకి వెళుతున్నాయి. ఇన్నాళ్లు లోపలే ఉన్న గొడవలు ఇప్పుడు బహిర్గతమైపోయాయి. అందుకు నిదర్శనమే విజయసాయిరెడ్డి మీద ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విరుచుకుపడటమే. ఆయనే కాదు అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబులు సైతం అసహనం వ్యక్తం చేశారు. దీంతో పార్టీ నేతలు ఖంగుతున్నారు. ఇదంతా విశాఖ జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశంలో జరిగింది. ఈ సంఘటన విశాఖ, గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. పార్టీలో ఇన్ని గొడవలు ఉన్నాయా, ఒకరితో ఒకరికి ఇన్ని సమస్యలు […]
పోలవరం ప్త్రాజెక్ట్ విషయంలో కేంద్రం మోడీకి వేయడం చూస్తుంటే ఇప్పట్లో నిధులు విడుదలయ్యేలా కనిపించట్లేదు. కేంద్రం ఇస్తానంటున్న 2013-14 అంచనా వ్యయం 20,398 కోట్లు పునరావాసానికి కూడ సరిపోవు. తాజా లెక్కల మేరకు పునరావాస అంచనా వ్యయం 30 వేల కోట్లు. ఆ లెక్కన కేంద్రం ఇస్తానంటున్న 20 వేల కోట్లు పునరావాసానికే చాలనప్పుడు నిర్మాణం ఎలా చేస్తారు. ఇదే ఇప్పుడొచ్చిన సమస్య. కేంద్రం నుండి 47 వేల కోట్లను తీసుకొచ్చే మార్గమే లేకుండా పోయింది. దీంతో కేంద్రం నుండి వస్తున్న 20 వేల కోట్లతోనే ప్రాజెక్ట్ ఎలా పూర్తిచేయాలి అనే విషయాన్ని ఆలోచిస్తోందట ప్రభుత్వం. […]
సొంత స్థలం, సొంత ఇళ్ళు ఉండాలనేది సగటు మధ్యతరగతి వ్యక్తికి జీవితాశయంగా ఉంటుంది. అదే పేదలకైతే అది తీరని కోరికలానే మిగిలిపోతుంటుంది. వారిలోని ఈ కోరికనే రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయల కోసం వాడుకుంటుంటాయి. ఎన్నికల హామీల్లో ఉచిత ఇళ్ళు, ఇళ్ల స్థలాల పంపిణీ అంటూ హామీలు గుపిస్తుంటాయి. కొన్ని పార్టీలు అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట మేరకు మొత్తంగా కాకపోయినా కొంతమేరకైనా ఇళ్లను కట్టి ఇస్తుంటుంది. చంద్రబాబు నాయుడు కూడ తన హయాంలో ఉచిత ఇళ్ల పేరుతో గృహాలు నిర్మించారు. వాటిలో చాలా వరకు పూర్తికాగా ఇంకొన్ని ఈమధ్యే జగన్ హయాంలో […]
రైతులను ఎవరైనా సరే గౌరవించి తీరాల్సిందే. ఇది చట్టంలో రాసి లేకపోవచ్చు కానీ మానవత్వం అనే పుస్తకంలో మాత్రం ఉంది. రైతులే దేశానికి వెన్నెముక అంటారు. రాజకీయ నాయకులు సమావేశాల్లో దీన్ని చాలా చక్కగా చెబుతుంటారు. కానీ ఏనాడో రైతుల వెన్నముక విరిగిపోయింది. ఇప్పుడు గౌరవం అనేది కూడ లేకుండా పోయింది. మొన్నామధ్యన పోలీసులు రాజధాని ఉద్యమం ఉద్రిక్తల్లో కొంతమంది రైతులను అరెస్ట్ చేశారు. వారిని నరసరావుపేట సబ్‌జైలు నుంచి గుంటూరు జిల్లా జైలుకు బస్సులో తరలించే క్రమంలో చేతులకు బేడీలు వేసి తీసుకుని వెళ్లారు. అది పెద్ద దుమారం అయింది. […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థంకాదు. ఒక్కోసారి జనంలోకి వచ్చి పడిపోయే ఆయన ఇంకోసారి పిలిచినా వినబడనంత దూరం వెళ్లిపోతుంటారు. సమస్యలున్నప్పుడే నాయకుల సత్తా, కమిట్మెంట్, స్టాండ్ ఏంటో బయటపడతాయి. ఇప్పుడు రాష్ట్రం కష్టాల్లో ఉంది. పవన్ లాంటి ఫైర్ ఉన్న నాయకుడి అవసరం గట్టిగా ఉంది. కాదనుకుంటే ఎంతటి ప్రయోజనమున్నా పక్కకు వచ్చేయడం పవన్‌కున్న అలవాటు. ఇప్పుడదే కావాల్సింది. అధికార, ప్రతిపక్షాలు బీజేపీని అధిష్టానాన్ని పోలవరం విషయంలో గట్టిగా నిలదీయలేకున్నాయి. ఎవరి ప్రయోజనాలు ఏమిటో చెప్పుకుంటే పెద్ద చరిత్ర అవుతుంది కాబట్టి ఒక్కమాటలో […]
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో వైసీపీ, టీడీపీ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. చంద్రబాబు కమీషన్లు తినడం వలనే కేంద్రం ఆగ్రహించి నిధులు నిలిపివేసిందని, అంచనాలను తగ్గించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా కేంద్రం నుండి నిధులు తెచ్చుకోవడం చేతగాక తమ మీద నిందలు వేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే వాస్తవానికి గత ప్రభుత్వం కేంద్రం నుండి నిధులు రాకపోయినా సొంత నిధులు 4000 కోట్లు వెచ్చించి నిర్మాణాలు చేపట్టింది. అయితే వాటిలో ఎంత నిధులు పక్కదారి పట్టాయనేది తేలాల్సి ఉంది. ఆ నిధుల నుండి 3000 కోట్లు కేంద్రం రీఎంబర్సిమెంట్ చేశారు. అయితే గత అంచనాలకు తగ్గట్టు 47000 […]