Telugu News » Tag » Ys jaganmohan reddy
Anurag Thakur And YS Jaganmohan Reddy : ఏపీలో లిక్కర్ కింగ్, స్టిక్కర్ కింగ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపే తరుణం వచ్చిందని,కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. ఒకపుడు విదేశీ ఆక్రమణ దారులు వచ్చి ఈ దేశంలో మతం మార్చి, దోపిడి చేస్తే ఇపుడు ఏపీలో జగన్ అదే చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ఏపీలో కొత్త పరిశ్రమలు రావటం లేదని, ఉన్న పరిశ్రమలు తరలిపోతుంటే ఉపాధి ఎలా వస్తుందని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. […]
Jagan: మహారాష్ట్రలో కరోనా వైరస్ వల్ల అల్లాడుతున్న ప్రజల ప్రాణాలను దృష్టి పెట్టుకొని అడిగిన వెంటనే కాదనకుండా వారం రోజుల్లో 300 వెంటిలేటర్లను పంపించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహర్ రెడ్డికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రెండు మూడు రోజుల కిందట హార్ట్ ఫుల్ థ్యాంక్స్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఫోన్ చేసి సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో […]
ysrcp : ఆంధ్రప్రదేశ్ లో తాజాగా విడుదలైన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. దీనితో వైసీపీ శ్రేణుల్లో ఎక్కడ లేని ఉత్సహం కనిపిస్తుంది. మొన్నటి పంచాయితీ ఎన్నికల్లో కూడా వైసీపీ భారీగానే విజయం సాధించింది. దీనితో ఇక మిగిలిన ఉన్న ఎంపీటీసీ-జడ్పీ ఎన్నికలు జరిగితే అందులో కూడా సంచలన విజయాలు నమోదు చేయాలనీ ఉవ్విలాడుతుంది. ఈ బాధ్యత కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకోని పూర్తిచేయాలని వైసీపీ శ్రేణులు బలంగా కోరుతున్నారు. మొన్నటి వరకూ […]
vizag steel : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం వేడి వేడిగా సాగుతుంది. ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అంటూ ప్రతి ఒక్కరు పిలుపునిస్తున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఫై రాజకీయ పార్టీలన్నీ ఏకమై నిరాహార దీక్షలు , ధర్నాలు చేపడుతూ..కేంద్రం ఫై ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయంలో వైసీపీ సర్కార్ తీరు ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారు. అధికార పార్టీ లో ఉన్న ఎంపీలంతా […]
Poll : 2019 శాసనసభ ఎన్నికల తర్వాత ఇక వైసీపీ పార్టీకి తిరుగులేదు అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ప్రతిపక్ష టీడీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు నిలవడమే కష్టం అయిపోయింది. ఈ తరుణంలో వారిని మళ్ళీ పునర్వైభవం దిశగా నడిపించే సమర్థవంతమైన నాయకుడు కనిపించడం లేదు. ఇక జనసేన పరిస్థితి మరింత దయనీయం. కేవలం ఒకే ఒక్క సీట్ సాధించిన ఆ పార్టీ ఇక తప్పని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపింది. ఆ తర్వాత […]
nimmagadda ramesh ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల విషయంలో తమ తమ వాదనలను నెగ్గించుకునేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం.. అటు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈషీ).. పావులు కదుపుతున్నాయి. ఈ వివాదం పూటకొక టర్నింగ్ తీసుకుంటోంది. ఇప్పటికే హైకోర్టులో ప్రభుత్వంపై పైచేయి సాధించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ రోజు (సోమవారం) ఉదయమే మరోసారి కోర్టు మెట్లెక్కాలని రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో ఈ పరిణామాన్ని ఊహించని సీఎం జగన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారని తెలుస్తోంది. కోర్టులు […]
high court : ఆంధ్రప్రదేశ్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యవహారం అధికార పార్టీ వైస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నట్లుగానే సాగుతోంది. దీన్ని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన సొంతింటి విషయంలాగా, తాను చెప్పేదే వేదం లాగా ఫీలవుతున్నట్లు కనిపిస్తోంది. తన పదవీ కాలం మరో రెండు నెలల్లో ముగియనుండటం వల్లే ఆయన ఆరాటపడుతున్నట్లు అనిపిస్తోంది. ఆ తొందరపాటులో నిమ్మగడ్డ అంతా నా ఇష్టం అన్నట్లు చేస్తున్నారని సగటు ఓటరుకి అనుమానం కలుగుతోంది. […]
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత ల పై తీవ్రస్థాయిలో మండిపడతారు. నారా చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో విజయసాయి రెడ్డి తరువాతనే ఎవరైనా అని చెప్పుకోవచ్చు. ట్విట్టర్ వేదికగా వరుస విమర్శలు చేస్తున్న విజయసాయి రెడ్డి సంక్రాంతి పండుగ రోజు కూడా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చిత్తుగా ఓడిపోయి రెండేళ్ల అవుతున్నా ఎలా ఓడిపోయానో కూడా తెలియదని సంక్రాంతి సృష్టికర్త చంద్రబాబే చెప్పుకుంటున్నారు. సారీ నన్ను క్షమించండి […]
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు(శుక్రవారం) గోపూజ పెద్దఎత్తున జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,679 ఆలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మునిసిపల్ స్టేడియంలో జరిగే కామధేను పూజలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ), ఏపీ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. పక్కా ఏర్పాట్లు.. సీఎం హోదాలో జగన్ మొదటిసారిగా నరసరావుపేట నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో సత్తెనపల్లి రోడ్డులోని కోడెల శివప్రసాదరావు మునిసిపల్ క్రీడా మైదానంలో గోపూజ […]
రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎప్పటి నుండో ఢిల్లీలో మకాం వేసి ఉన్నారు. నిత్యం రచ్చబండ కార్యక్రమంతో మీడియా ముందుకు వస్తూ సొంత పార్టీని, నేతలను చెడుగుడు ఆడుకుంటున్న ఆయన సొంత నియోజకవర్గం నరసాపురంకు మాత్రం రాలేకపోతున్నారు. దీనికి కోవిడ్ కారణాన్ని చెబుతున్నారు. కోవిడ్ తగ్గిపోయాక వస్తానని అంటున్నారు. అయితే ఆయన నియోజకవర్గానికి రాలేకపోవడానికి వేరొక కారణం ఉందట. ఆయన ఢిల్లీ వదిలి వస్తే ఆయన మీద అనర్హత వేటు పడే ప్రమాదం ఉందని చెప్పుకుంటున్నారు. రఘురామరాజు తన […]
వైకాపాలో టికెట్ పొందిన మహిళా లీడర్లు దాదాపుగా అందరూ గెలుపొందారు. అది వైసీపీకి మంచి బెనిఫిట్ అయింది. అయితే పార్టీకి బలం కావాల్సిన మహిళా ఎమ్మెల్యేల్లో కొందరు మాత్రం పార్టీకి భారమవుతున్నారనే టాక్ వినబడుతోంది. మొదటి నుండి మహిళా లీడర్ల పట్ల జగన్ కు సాఫ్ట్ కార్నర్ ఉంది. వాళ్లకు పూర్తి స్వేచ్ఛతో పాటు మంచి అవకాశాలు కూడ కల్పించారు జగన్. కానీ కొందరి మూలంగా వాటికి ఫులుస్టాప్ పెట్టాల్సిన పరిస్థితి. ఇప్పటికే చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల […]
తెలంగాణ బీజేపీ సంచనలం సృష్టించింది. నెరవేరదనుకున్న కలను నెరవేర్చుకుంది. ఇన్నేళ్లు అసెంబ్లీలో ఒకే ఒక ఎమ్మెల్యేతో నెట్టుకొస్తున్న ఆ పార్టీ ఇప్పుడు మరొక ఎమ్మెల్యేను అసెంబ్లీకి పంపుతోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు గెలుపుతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఉనికి ఉందని స్పష్టంగా తెలిసొచ్చింది. దుబ్బాకలో ఉప ఎన్నికల్లో ఓటమిని కేసీఆర్ కలలో కూడ ఊహించి ఉండరు. అసలు బీజేపీకి ఎప్పటికీ తనను ఢీకొట్టే సీన్ లేదనేది కేసీర్ ప్రగాఢ విశ్వాసంగా ఉండేది. కానీ […]
మోడీ అంటే జగన్ కు భయం. ఆయన ముందు నోరెత్తి గట్టిగా మాట్లాడలేరు. ఆయన మీదున్న కేసులే ఆ భయానికి కారణం. అందుకే హోదా, పోలవరం అంశాల్లో కేంద్ర మొండిచేయి చూపిస్తున్నా జగన్ ఎదురు మాట్లాడలేకపోతున్నారు. ఇవి ఈరోజు వరకు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ జగన్ మీద చేస్తున్న ఆరోపణలు. ఈ ఆరోపణలకు చంద్రబాబు కొన్ని లాజిక్స్ చెప్పడంతో ప్రజల్లో కూడ అవి నిజమేనేమో అనే అనుమానం మొదలైంది. ఇప్పుడు ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసేలా వ్యవహరించనున్నారు […]
ఉత్తరాది రాజకీయాలకు దక్షిణాది రాజకీయాలకు చాలా వ్యత్యాసమే ఉంది. అక్కడ రాజకీయాలు మతం ప్రాతిపదికన నడిస్తే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కులం, సామాజికవర్గం మీద నడుస్తాయి. ఈ రెండూ విపరీతాలే అయినా మతం చిచ్చు కంటే కులం చిచ్చే కొద్దిగా నయం. మనం ఇంకా మతం మీద రాజకీయం నెరిపే స్థాయికి వెళ్ళలేదు. ఇది సంతోషించదగిన విషయం. కానీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడుగారి వైఖరి చూస్తుంటే ఆ విపరీతానికి ఆయనే నాంది పలుకుతారేమో అనిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ […]
విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కీలక ప్రాజెక్ట్ అయిన పోలవరం విషయంలో పనులు నత్తనడకన సాగటానికి గల కారణాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ విషయంలో ఒక పక్క కేంద్ర ప్రభుత్వ వైఖరి ఒకలా ఉంటే మరోపక్క రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇంకోలా ఉంది. విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నాగాని… నిర్మొహమాటంగా ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రానికి సంబంధం లేదని ఇటీవల కేంద్ర […]