Telugu News » Tag » ycp leaders
Nara Lokesh : తమ పార్టీ కార్యకర్తల్ని అన్యాయంగా అరెస్టు చేశారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ అధికార వైసీపీ మీద మండిపడ్డారు. ఈ క్రమంలో ఆయన మాట మీద అదుపు కోల్పోయారు. వైసీపీ సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్క్రూ లూజ్.. అంటూ మండిపడ్డారు లోకేష్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ గాడిదలు కాస్తున్నారా.? అంటూ విరుచు కుపడ్డారు. ‘మేం […]
YCP leaders : విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయి తీరుతుందనీ, చంద్రబాబు కాదు కదా, ఇంకెవరు అడ్డొచ్చినా విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవకుండా ఆపలేరనీ పదే పదే వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఇంతకీ, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవుతుందా.? లేదా.? న్యాయస్థానాల్లో కేసులున్నంత మాత్రాన, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవకుండా ఆగిపోదు. ప్రభుత్వానికి ఈ విషయంలో చిత్తశుద్ధి వుండాలి. అదే అసలు సమస్య. మూడు రాజధానులంటూ ప్రకటించేస్తే సరిపోదు. సరైన అధ్యయనం లేకుండా, రాష్ట్రానికి మూడు […]
Minister Roja : ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజుకో రీతిన ప్రజల నుంచీ, సొంత పార్టీ నేతల నుంచీ, కార్యకర్తల నుంచీ నిరసనను ఎదుర్కోవాల్సి వస్తోంది. గడప గడపకీ మన ప్రభుత్వం.. అంటూ ప్రతిష్టాత్మకంగా వైసీపీ ఓ కార్యక్రమం చేపడితే, తమ గడప వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలను, ఎంపీలనూ, మంత్రులనూ ప్రజలు నిలదీస్తున్న వైనం చూస్తున్నాం. చాలా చోట్ల సొంత పార్టీకి చెందిన కింది స్థాయి నేతలు, కార్యకర్తలు కూడా తమ ప్రభుత్వంపై విమర్శలు […]
CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బలమైన నేతగా కొనసాగుతున్నప్పటికీ సొంత జిల్లాలో మాత్రం కొన్ని సమస్యలను పరిష్కరించ లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలకు మరియు కార్యకర్తల మధ్య సంబంధాలు కాలక్రమేనా పూర్తిగా తెగిపోతున్నాయి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కడప జిల్లాలో ఎమ్మెల్యేలు పార్టీ విషయాలను పట్టించుకోకుండా పక్కనే ఉన్న బెంగళూరు కి వెళ్లి వ్యాపారాలు చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం చాలా జిల్లాల్లో పరిస్థితి ఇలానే […]
ఏపీలో రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరగినప్పటినుండి రెండు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇక మొదట్లో చంద్రబాబు నాయుడు పరిపాలన చేయగా.. రెండవసారి జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో అధికారాన్ని చేపట్టారు. ఇక వైసీపీ అధికారాన్ని చేపట్టగానే సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ప్రవేశపెడుతోంది. దీనితో వచ్చే రోజుల్లో కూడా వైసీపీదే రాజ్యమని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. అలాగే ఏపీలో టీడీపీ పనయిపోయిందని టీడీపీలో నాయకులు లేరని వైసీపీ నాయకులు, […]
అంధ్రప్రదేశ్ను ముందుకు నడిపించడంలో జగన్ ప్రభుత్వం ఎప్పుడు ముందంజలోనే ఉంటుంది. ప్రజలలోకి సంక్షేమ కార్యక్రమాలు తీసుకుని వెళ్లడంలో వైఎస్ జగన్ చాలా వరకు ముందు ఉన్నారు. ఎన్నో రకాల పథకాలతో ప్రజలకు చేరువ అయ్యారు. కానీ ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొన్ని చిక్కులు వచ్చి పడ్డాయి అని తెలుస్తుంది. ముఖ్యంగా నిధుల సమీకరణ విషయంలో మంత్రుల నుంచి సహాయ సహకారాలు అనేది అందడం లేదు. జగన్ ప్రవేశపెట్టిన పధకాలు అన్ని ఇప్పుడు […]
ఏపీలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపడుతాం అంటూ ఎన్నికల మేనిఫెస్టోలో వైకాపా పేర్కొన్న విషయం తెల్సిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలుపుకునేందుకు వైకాపా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఏపీలో భారీగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందుకు సంబంధించి మంత్రులు మరియు ఎమ్మెల్యేలు చాలా బలంగా హామీ ఇస్తున్నారు. ఏపీలో చాలా మంది కొత్త ఇళ్ల కోసం ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. వైకాపా ప్రభుత్వం కనుక ఆ పార్టీకి చెందిన వారు […]
ఏపీ రాజకీయాలు ఎప్పటికి హాట్ హాట్ గా ఉంటాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ల మధ్య నువ్వానేనా అనేలా మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మధ్య వైసీపీ లో వర్గపోరుకు అంతులేకుండా పోతుంది. ఇక ఇప్పటికే నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా, ఈడిగ కార్పొరేషన్ ఛైర్మెన్ కేజే కుమార్ ల మధ్య వర్గపోరు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇది ఇలా ఉంటె మరో నియోజకవర్గంలో కూడా వర్గపోరు జోరుగా సాగుతుంది. […]
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి నేటికీ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక ఈ శుభ సందర్భంగా ఏపీలో ఏర్పాటు చేసిన వాహన మిత్ర పథకంలో అర్హులైన ఆటో డ్రైవర్లకు మంత్రి కోడలి నాని నిధులు విడుదల చేసారు. ఇక అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లకు ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇలాంటి పథకం ఏర్పాటు చేయలేదని చెప్పుకొచ్చాడు. అరులైన అందరికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపాడు. అలాగే కొత్త వారు కూడా ఈ […]
ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఎప్పటికి మాటల యుద్ధం జరుగుతుంది. ఇక ఇది ఇలా ఉంటె అధికార పార్టీలో వర్గపోరు ఉండడంతో నాయకుల మధ్య అనేక సమస్యలు వస్తున్నాయి. ఇక ఇప్పటికి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో వైసీపీ లో వర్గ పోరు గట్టిగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇదే తరుణంలో మరో చోట కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. వర్గపోరు కారణంగా వైసీపీ నుండి బయటకు […]
ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు లబ్ది పొందడం ఆనవాయితీ. ఇది మంచి పద్దతి కాకపోయినా తరతరాలుగా జరుగుతూ వస్తున్న తంతు ఇదే. అందుకే ఏ పార్టీలో అయినా ద్వితీయ శ్రేణి నాయకులు గెలుపు కోసం ఒళ్ళు దాచుకోకుండా పనిచేస్తుంటారు. గెలుపోటముల మీద వారి ప్రభావం బాగానే ఉంటుంది. గత ఎన్నికల్లో వైసీపీలో ఉన్న అలాంటి నాయకులు గట్టిగా పనిచేయబట్టే ఆ పార్టీ అంతటి మెజారిటీతో గెలవగలిగింది. అలాంటి వైసీపీ లీడర్లు ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు. పార్టీ గెలిస్తే కాంట్రాక్టులు, […]