Telugu News » Tag » Vizag
Gajuwaka : సినిమా వేరు, నిజ జీవితం వేరు అనగలమా ఇప్పుడు.? అనలేమనే చెప్పాలేమో. ఎందుకంటే, సినిమాలు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయ్. తాజాగా వైజాగ్ గాజువాకలో జరిగిన సంఘటన చూస్తే సినిమాల ప్రభావం ముఖ్యంగా యువతపై ఎంతలా వుందో అర్ధం చేసుకోవచ్చు. ఓ అమ్మాయి, అబ్బాయి కలిసి ఒకే బైక్‌పై ప్రయాణిస్తున్నారు. అందులో వింతేముంది అంటారా.? అమ్మాయిని వెనక సీట్లో కూర్చొబెట్టుకుంటే ఓకే, ఒళ్లో కూర్చోబెట్టుకుని రయ్ రయ్ మని రోడ్డుపై దూసుకెళ్తున్నాడో యువకుడు. అందుకే […]
YCP : విశాఖ వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్’ కోసం గర్జన నిర్వహించింది. ఉదయం వైసీపీ గర్జన, సాయంత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన.! గత కొద్ది రోజులుగా ఈ కార్యక్రమాలపై అధికార వైసీపీ నుంచి కవ్వింపు చర్యల్ని చూస్తూనే వున్నాం. ‘జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని విశాఖలో అడుగు పెట్టనివ్వం..’ అంటూ వైసీపీ నేతలు హెచ్చరించారు. ఈ లిస్టులో పలువురు మంత్రులు కూడా వున్నారు. మరోపక్క, ‘మనల్ని ఎవడ్రా ఆపేది.?’ అంటూ […]
YCP : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వెళ్ళారు. జనసేన పార్టీ నిర్వహిస్తోన్న జనవాణి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ రోజు సాయంత్రం జనసేనాని విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. పెద్దయెత్తున పార్టీ కార్యకర్తలు జనసేనానికి స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి రావడంతో, భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అడుగు ముందుకు కదలడానికి చాలా సమయం పట్టింది. అయితే, భారీగా వచ్చిన అభిమానులకు తోడు.. ఆ మార్గంలో పవర్ కట్ కారణంగా వాహనాలు ముందుకు వెళ్ళేందుకు వీలు లేని పరిస్థితి […]
Vaarasudu : ఆగస్ట్ 1 నుంచి చిత్రీకరణలను నిలిపివేస్తున్నట్టు ఇదివరకే తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు నుంచి సెట్స్ పై ఉన్న చిత్రాలు, ప్రారంభమయ్యే కొత్త సినిమాల షూటింగ్స్ ఆగిపోనున్నాయి. కానీ ఇతర భాషలకు చెందిన సినిమా షూటింగ్స్ యాథావిధిగా కొనసాగుతాయి. అయితే తొలి తెలుగు మూవీగా వారసుడు ప్రచారం జరిగిన ఇప్పుడు బంద్ నేపథ్యంలో తమిళ మూవీగా చెప్పుకొస్తున్నారు. భలే ప్లాన్.. తమిళ స్టార్ హీరో విజయ్ తొలిసారి […]
Covid19: కరోనా వైరస్ ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి వలన ఎందరో జీవితాలు నాశనం అయ్యాయి. ఇప్పటికీ కొందరి పరిస్థితి దారుణంగా మారింది. అయితే తొలి వేవ్‌లో కరోనా బారిన పడిన వారు 10 నుండి 15రోజులలో కోలుకోగా, సెకండ్ వేవ్‌లో రోజుల సంఖ్య పెరిగింది. 20 రోజుల తర్వాత నెగెవిట్ రిపోర్ట్ వచ్చింది. తాజాగా ఏపీలో ఓ వ్యక్తి కరోనా మహమ్మారి బారిన పడి 60 రోజుల పాటు హాస్పిటల్ లో […]
Ganta Srinivasa rao : గంటా శ్రీనివాస రావు ఈమధ్య కొంచెం అతి చేస్తున్నారేమో అని ఏపీ ప్రజలకు అనిపిస్తోంది. ఎందుకంటే.. ఆయన ఏం చేసినా కొంచెం అతిగా చేస్తున్నట్టున్నారు. ఆయన ప్రజల మంచి కోసమే చేస్తున్నా.. ఎందుకో దాంట్లో నిజాయితీ కనిపించడం లేదంటూ కొందరు తప్పుపడుతున్నారు. ఎందుకంటే… గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అంత వరకు బాగానే ఉంది. ఆయన రాజీనామా చేసింది కూడా విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్నారని. […]
ఏపీకి మూడు రాజధానుల విషయంలో చాలా పట్టుదలతో ఉన్న సీఎం జగన్ మోహన్ రెడ్డికి కొందరు అడ్డు పడుతూ ఉన్నారు. మూడు రాజధానుల విషయంలో కోర్టు కేసు నడుస్తోంది. లేదంటే ఇప్పటి వరకు వైజాగ్ కు ఏపీ రాజధాని తరలి వెళ్లేది. మూడు రాజధానుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయంను పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఈ సమయంలో జగన్ ప్రభుత్వం ఎలాగైనా కోర్టు సమస్యలను పరిష్కరించుకుని మూడు రాజధానులను ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం కు […]
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తాను అనుకున్నది సాధించడానికి ఎంత దూరం అయిన వెళ్తాడు అనడానికి మూడు రాజధానుల నిర్ణయం ఒక ఉదాహరణ. జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నాక విశాఖపట్నంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు తర్జన భర్జన పడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతికి మద్ధతుగా నిలబడటంతో, విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలకి కష్టాలు మొదలయ్యాయి. అలాగే విశాఖ కార్పొరేషన్ లో కూడా వైసీపీ జెండా ఎగురవేయాలని భావిస్తున్న వైసీపీ పార్టీ నగరంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలని తమ […]
క్రియేటివిటీ అనేది సినిమావాళ్లకు మాత్రమే పరిమితం అనుకోవటం పొరపాటు అవుతుందేమో. ఎందుకంటే ఒక్కోసారి పొలిటికల్ లీడర్లు సైతం భలే సృజనాత్మకత ప్రదర్శిస్తారు. టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ వంటి షార్ట్ కట్ నేమ్స్ కి వెరైటీ, వ్యంగ్య ఫుల్ ఫామ్స్ చెప్పటం ద్వారా, ప్రత్యర్థి నాయకులకు లేనిపోని అపార్థాలను ఆపాదించటం ద్వారా ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి ఓ ఇంట్రస్టింగ్ విమర్శే ఈరోజు చోటుచేసుకుంది. ఇదేం ఖర్మ.. సినిమా తీయి వర్మా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి […]
టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ భూ వివాదం తారా స్థాయికి చేరింది. ఈ వ్యవహారంలో వైకాపా నాయకులు రామకృష్ణపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. విశాఖ తూర్పు నియోజక వర్గం ఏర్పాటు అయినప్పటి నుండి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న ఆయనపై స్థానికుల్లో చాలా పాజిటివ్ స్పందన ఉంది. ఆయన సౌమ్యుడు అని ప్రజలకు సేవ చేసే వ్యక్తి అంటూ పేరుంది. అలాంటి వ్యక్తిపై ఇప్పుడు వైకాపా చేస్తున్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఇన్ని రోజుల నుండి […]
ఏపీలో విశాఖ ఏజెన్సీ ఏరియాలోనే బాక్సైట్ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో చాలామంది పారిశ్రామికవేత్తలు విశాఖ ఏజెన్సీ వైపున చూస్తున్నారు. దశాబ్దాల నుంచి బాక్సైట్ తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పట్లో ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అప్పుడే బాక్సైట్ నిక్షేపాల తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. కానీ.. ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు జరపరాదని పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడంతో అది అక్కడితో ఆగింది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు […]
గంటా శ్రీనివాసరావు.. వైజాగ్ లో ఈయనకున్న ఫాలోయింగ్ మామూలుది కాదు. అందుకే.. ప్రధాన పార్టీలన్నీ గంటాను తమ పార్టీలో చేర్చుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నాయి. గంటా ఎక్కడ ఉంటే.. వైజాగ్ పరిసర ప్రాంతాల ప్రజల ఓట్లు కూడా అటే. అందుకే.. గంటాను వైసీపీలోకి లాక్కునేందుకు బాగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2019 లో టీడీపీ ఓడిపోయిన తర్వాత గంటా ఎందుకో సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం అంతగా పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. దీంతో ఆయన పార్టీ మారుతారంటూ తెగ వార్తలు […]
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని దత్తత తీసుకోవాలనుకున్నారు. అందుకే విశాఖపట్నంలో మౌలిక సదుపాయాలు పెంచేందుకు ముందడుగు వేస్తున్నారు. ఎవరు అడగకుండానే విశాఖపట్నానికి అనేక వరాలు కురిపిస్తున్నారు. నిజానికి విశాఖపట్నం జిల్లాను పాలన రాజధాని ప్రకటించినప్పుడే జగన్ కి విశాఖపై ఎంత ప్రేమ ఉందో అర్థం అయ్యింది. విశాఖ ను మెగా సిటీ గా తీర్చిదిద్దేందుకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. నగర అవసరాలకు తగినట్లుగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు […]
చింతమనేని ప్రభాకర్ వైఎస్సార్సీపీలో ఉండటమేంటి అనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అయిన ఆయన పార్టీ మారుతున్నాడని భావిస్తున్నారా?.. అదేం లేదులెండి. కాకపోతే మొన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక సంఘటన ఆయన్ని గుర్తుకు తెచ్చింది. అదే సమయంలో ఎమ్మార్వో వనజాక్షి ఎపిసోడ్ ను కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే బెటర్. అధికార పార్టీ వాళ్ల ఆగడాలు ఏ రేంజ్ లో ఉంటాయో బాగా అర్థమవుతుంది. అప్పుడు టీడీపీ టీడీపీ పవర్ లో ఉండగా ఇసుక […]
ఉత్తరాంధ్ర రాజకీయాలకు పెట్టింది పేరు గంటా శ్రీనివాసరావు. కానీ.. ఆయన ప్రస్తుత పరిస్థితి గందరగోళంగా ఉంది. కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉంది. ఎటువెళ్లాలో అర్థం కావడం లేదు. టీడీపీలో ఉండలేక.. వైసీపీలోకి వెళ్లలేక.. ఏం చేయాలో తోచని స్థితి ఆయనది. ఉత్తరాంధ్రలో బడా నేతగా ఎదిగినా.. ప్రస్తుతం టీడీపీ అధికారంలో లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆయనది. నిజానికి గంటా రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో స్టార్ట్ అయింది. తర్వాత మెగాస్టార్ చిరంజీవి పార్టీ ప్రజారాజ్యంలో […]