Telugu News » Tag » TRS MLA
Telangana : తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తెరపైకొచ్చిన ‘ఎమ్మెల్యేలకు ఎర కేసు’లో ముగ్గురు నిందితులకు బెయిల్ లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా వున్న రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు మూడు లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం, ముగ్గురి పాస్‌పోర్టులను పోలీస్ స్టేషన్‌లో సరెండర్ చేయాలని ఆధేశించింది. ప్రతి సోమవారం సిట్ ముందు హాజరు కావాల్సిందిగా నిందితుల్ని ఆదేశించింది హైకోర్టు. […]
TRS MLA : టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలుకు ప్రయత్నించారంటూ బిజెపి ముఖ్య నాయకుల పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన సిట్ అధికారులు త్వరలోనే బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ని విచారించేందుకు సిద్దం అయ్యింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఈనెల 21వ తారీఖున బిఎల్ సంతోష్ ని హాజరు అవ్వాలంటూ సిట్ నోటీసులు పంపించింది. కమాండ్ కంట్రోల్ లోని సిట్ కార్యాలయంలో ఈనెల 21వ తారీఖున ఉదయం […]
TRS : తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితుల్ని పోలీసులు ఈ రోజు సాయంత్రం అవినీతి నిరోధక శాఖ కోర్టు న్యాయమూర్తి యెదుట హాజరుపరిచారు. ఫరీదాబాద్‌కి చెందిన రామచంద్ర భారతి, హైద్రాబాద్‌కి చెందిన నందకుమార్, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సింహయాజి ఆ ముగ్గురు నిందితులు. పోలీస్ స్టేషన్‌లో వైద్య పరీక్షలు.. రిమాండ్ రిపోర్ట్.. నిన్న సాయంత్రం హైద్రాబాద్ శివార్లలోని ఓ ఫాం హౌస్‌లో (టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి చెందినది) […]
BJP : తెలంగాణ రాస్ట్ర సమితి ఎమ్మెల్యేలు నలుగుర్ని భారతీయ జనతా పార్టీ కొనుగోలు చేసేందుకు యత్నించిందంటూ తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం చెలరేగుతోన్న సంగతి తెలిసిందే. ‘సెకెండ్ హ్యాండ్ ఎమ్మెల్యేలను బీజేపీ పట్టించుకోదు. ఎవరైనా బీజేపీలోకి రావాలంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి. అలాంటప్పుడు, మేమెందుకు ఎమ్మెల్యేలను కొంటాం..’ అని బీజేపీ నేత, ఎంపీ ధర్మపురి అరవింత్ తెగేసి చెబుతున్నారు. ఇదంతా టీఆర్ఎస్ ఆడుతోన్న డ్రామా అనీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌లో, టీఆర్ఎస్ సానుభూతిపరులైన […]
Laxma Reddy: మాజీ మంత్రి, అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఒకసారి ఇలాగే ప్రజలపై తీవ్ర అసహనం ప్రదర్శించి వార్తల్లో నిలిచిన ఈయన మళ్లీ అదే తప్పు చేయటం చర్చనీయాంశంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల శాసనసభ్యుడు లక్ష్మారెడ్డి నిన్న శనివారం తన పార్టీ మున్సిపల్ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎలక్షన్ లో కారు పార్టీకి తక్కువ […]
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకోని రావటమే తన లక్ష్యమని చెపుతున్న వైఎస్ షర్మిల ఆ దిశగా రాజకీయ పార్టీని స్థాపించటానికి చకచకా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణలోని ఉమ్మడి జిల్లా నేతలతో వరసగా సమావేశాలు నిర్వహిస్తూ కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది. షర్మిల కొత్త పార్టీ వెనక బీజేపీ ఉందని.. బీజేపీ షర్మిలను నడిపిస్తూ రెడ్ల ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తోందని.. కొందరు ఆరోపిస్తుంటే.. మరి కొందరు మాత్రం ఆమె కొత్త పార్టీ వెనక సీఎం కేసీఆర్ […]
తెలంగాణాలో ఓ మంత్రిని చంపడానికి ప్రయత్నిస్తున్నారట. ఇక ఈ విషయాన్నీ ఆ మంత్రే స్వయంగా ఆరోపణలు చేసాడు. అది ఎవరో కాదు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్. అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరిగిన రోజు కూకట్ పల్లి లో ఆయన డబ్బులు పంచుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆయనపై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయం పై మంత్రి పువ్వాడ స్పందిస్తూ.. నాపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసారని, దీనితో నా […]
నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన చనిపోయే ముందు పలు విషయాలు మాట్లాడి కన్ను మూశారు. ఇక నర్సన్న మాట్లాడే మాటలు వింటే కన్నీరు పెట్టాల్సిందే. ఇక ఆయన మాట్లాడిన విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. నర్సన్న మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా భారతీయ కమ్యూనిస్ట్ నాయకులకు, అలాగే పార్టీని ముందుకు తీసుకెళ్తున్న కళాకారులకు విప్లవ వందనాలు అంటూ చెప్పుకొచ్చాడు. ఏడేండ్ల నుండి పార్టీని విడి మీ […]
తెలంగాణాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) మృతి చెందారు. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున కన్ను మూశారు. ఇక తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి మరింత విషయమించడంతో తుది శ్వాస విడిచారు. ఇక నర్సింహయ్య మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఇక ఆయన మృతి పట్ల సీఎం కెసిఆర్ తో […]
తెరాస ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి కారు పై రైతులు చెప్పులు విసిరారు. అయితే యాచారం మండలం మేడిపల్లిలో భారీ వర్షాలకు నిండిన చెరువు దగ్గర పూజలు చేసేందుకు ఎమ్మెల్యే వచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కు చేదు అనుభవం ఎదురు అయింది. గ్రామంలోకి రావొద్దంటూ అడ్డుకొని, ఆయన కారుపై చెప్పులు విసిరారు రైతులు. అయితే ఆ గ్రామం ఫార్మాసిటీలోకి పోతుందని అందుకు కారణం ఎమ్మెల్యే నే అని ఆగ్రహం వ్యక్తం చేసారు […]