Telugu News » Tag » trending news
Mysterious Video : ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో గొర్రెలు గుండ్రంగా తిరుగుతున్నాయ్.! ఆ సర్కిల్ కూడా పక్కాగా కనిపిస్తోంది. అంత గుండ్రంగా తిరగాలని ఆ గొర్రెలకు ఎందుకు అనిపించిందబ్బా.? ఈ వింత చైనాలో చోటు చేసుకుంది. కొన్ని రకాలైన సూక్ష్మజీవుల ప్రభావంతో ఏర్పడే మెదడు ఇన్ఫెక్షన్ల వల్ల జంతువుల్లో ఇలాంటి విపరీతమైన మార్పులు వస్తుంటాయని వైద్యులు చెబుతున్నారు. దాంతో, ప్రపంచమంతా ఒక్కసారిగా వణికిపోయింది. చైనా మీడియా విడుదల చేసిన వీడియో.. చైనా […]
Raghuveera Reddy : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో కీలక మంత్రిగా వ్యవహరించి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా వ్యవహరించిన మాజీ మంత్రి రఘువీరా రెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు పూర్తి దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. కొన్నాళ్ల క్రితం రఘువీరా రెడ్డి ఒక సాధారణమైన రైతు మాదిరిగా టీవీఎస్ ఎక్సెల్ బండి పై ప్రయాణిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మంత్రిగా వందల కోట్ల రూపాయలను సంపాదించుకుంటున్న వారు ఉన్నారు. కానీ […]
Gorilla : థాయిలాండ్ లో ఒక ప్రైవేట్ కమర్షియల్ బిల్డింగ్ పై పటా జూ ఉంది. 32 సంవత్సరాలుగా ఒక గొరిల్లా ప్రత్యేక ఆకర్షణగా అక్కడ నిలుస్తూ ఉంది. ఆ గొరిల్లా పేరు బువా నోయి. ఏడాది వయసున్న సమయంలో ఆ కమర్షియల్ బిల్డింగ్ పై ఉన్న జూ లో బువా నోయి ని బంధించడం జరిగింది. అప్పటి నుండి ఆ గొరిల్లా అదే బోనులో జీవితాన్ని గడుపుతూ వస్తోంది. ఇప్పటి వరకు బయట ప్రపంచం చూడలేదు. […]
Apple Watch : అమెరికాలోని వాషింగ్టన్ లో వింత సంఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి చనిపోయిందని భావించి సమాధి చేశారు. కానీ సమాధిలో ఉన్న వ్యక్తి తన చేతికి ఉన్న యాపిల్ వాచ్ తో ఎమర్జెన్సీ కాల్ చేసి తన ప్రాణాలను కాపాడుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే వాషింగ్టన్ కు చెందిన ఛాయ్ క్యోంగ్ ఆన్ అనే వ్యక్తి తన భార్య రిటైర్మెంట్ ద్వారా వచ్చే డబ్బును పొందేందుకు కుట్ర చేశాడు. ఆమె బతికి ఉండగానే […]
Trending News : ఓ వ్యక్తి చనిపోయాడనుకుని.. అంత్యక్రియలు నిర్వహించేశారు కుటుంబ సభ్యులు. అంత్యక్రియల తర్వాత సంప్రదాయబద్ధంగా జరిగే చిన్న కర్మకు ఏర్పాట్లు జరుగుతుండగా, ఎవరైతే చనిపోయాడనుకున్నారో.. ఆ వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అంతే, బంధువులు అవాక్కయ్యారు.. కుటుంబ సభ్యులు తొలుత ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. వివరాల్లోకి వెళితే, ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులో జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మునుబోలు మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 34 ఏళ్ళ […]
Yogi Adityanath : ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో సారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆయన లక్నో జూ ని సందర్శించారు. ఆ సందర్భంగా అక్కడికి బోనులో ఉన్న పులి పిల్లను చూసి మురిసి పోయారు. ఆయన పులి పిల్లను ఎత్తుకొని కొద్ది సేపు లాలించారు, అంతే కాకుండా పులి పిల్లకు ఆప్యాయంగా పాలు పట్టించారు. చేతులకు గ్లౌజ్ వేసుకొని పులి పిల్లతో కొద్ది సమయం పాటు ఆడుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. […]
Aeroplane : విమానం చాలా చాలా ఎత్తులో ఎగురుతుంటుంది. సాధారణ తుపాకీలతో దాన్ని కాల్చడం సాధ్యమయ్యే పనేనా.? దానికోసం ప్రత్యేకమైన గన్స్ వాడాల్సి వుంటుంది. క్షిపణులతో కావాలనో, పొరపాటునో విమానాల్ని కూల్చేసిన ఘటనల గురించి తరచూ వింటుంటాం. కానీ, ఇక్కడ విషయం వేరే. ఓ విమానంపైకి తుపాకీతో కాల్పులు జరిపారు. అది కూడా దాదాపు మూడు వేల ఐదు వందల అడుగుల యెత్తులో.. గాల్లో వెళుతోన్న విమానంపైకి కాల్పులు జరపడంతో, ఓ తూటా విమానానికి రంధ్రం చేసుకుని, […]
Air Bags : ఇకపై కార్లలో ఖచ్చితంగా ఎయిర్ బ్యాగ్స్ వుండాల్సిందే. కారు వేరియంట్, ధరతో సంబంధం లేకుండా మొత్తం ఆరు ఎయిర్ బ్యాగ్స్ కార్లలో వుండాలని కేంద్రం చెబుతోంది. నిజానికి, ఈ నిబంధన అమలు చేయడానికి చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కోవిడ్ కారణంగా కార్ల తయారీ రంగం ఒకింత ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న నేపథ్యంలో, ఎయిర్ బ్యాగ్స్ తప్పని సరి నిబంధనను కాస్త వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ నిబంధన అమల్లోకి రానుంది. కేంద్ర మంత్రి […]
IAS : బీహార్‌లోని పాట్నాలో ఓ ఐఏఎస్ అధికారి అసహనంతో ఊగిపోయారు. అంతలా ఆ ఐఏఎస్ అధికారి అసహనంతో ఊగిపోవడానికి కారణం, బాలికలు శానిటరీ ప్యాడ్స్ అడగడమే. ఐఏఎస్ అధికారిణి హార్దోత్ కౌర్ భమ్రా తీరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళితే, ‘అమమ్మాయిల గౌరవం పెంచడం’ అనే అంశంపై జరిగిన ఓ కార్యక్రమంలో బాలికలు తమ తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్స్ అందించాలంటూ ఓ బాలిక తన అభిప్రాయం చెప్పడమే నేరం […]
Tamilanadu : తమిళనాడు లోని తేన్ కాశి జిల్లాలో దారుణం జరిగింది. స్థానిక లాలగుడి ఇరువు గ్రామంలో నివాసం ఉంటున్న ఇసాకి రాజ్ అనే వ్యక్తి కి కొన్నాళ్ల క్రితం పెళ్లి జరిగింది. దాంపత్య జీవితం అంతా సాఫీగా జరుగుతుంది అనుకుంటున్న సమయంలో ఈసాకి రాజ్ తీవ్ర అనారోగ్య సమస్యలకు గురయ్యాడు. దాంతో భార్య భర్తల మధ్య విభేదాలు తలెత్తి విడాకులు తీసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత ఇసాకి రాజ్ పద్మావతి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. పద్మావతిని […]
Kerala Auto Driver : కేరళకు చెందిన ఓ వ్యక్తికి అనూహ్యంగా లాటరీ తగ్గింది. లక్షల్లో కాదు, కోట్లల్లో తగిలింది లక్కీ లాటరీ. ఆ మొత్తం ఎంతో తెలుసా.? ఏకంగా 25 కోట్లు. ఇంత సొమ్ము వస్తే ఎవరైనా ఏం చేస్తారు.? ఎగిరి గంతేస్తారు. కానీ, ఆ లక్కీ లాటరీ విజేత పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా వుంది. లాటరీలో ఎంత గెలిస్తే అంత మొత్తమూ ఇచ్చేయరు కదా.? పన్నులు పోతాయ్. సుమారుగా 10 కోట్ల వరకూ […]
Ants : ఈ భూగోళంపై చీమలు ఎక్కువగా వున్నాయా.? మనుషులు ఎక్కువగా వున్నారా.? అంటే ఎలా లెక్కకట్టగలరు.? కానీ, కొందరు లెక్కకట్టేశారు. మనుషుల కన్నా చీమలే ఎక్కువ వున్నాయని ఓ అంచనా ప్రకారం చెప్పేశారు. ఎప్పటి నుంచో చీమల సంఖ్యను కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే వున్నారు. కానీ, ఖచ్చితంగా కనిపెట్టలేకపోయారు. తాజాగా హాంకాంగ్‌కి చెందిన కొందరు పరిశోధకులు ఈ సాహసానికి పూనుకున్నారు. చీమల సంఖ్యను లెక్కగట్టే ప్రయత్నం చేశారు. ఏకంగా 489 అధ్యయనాల అనంతరం ఓ […]
Bangalore Doctor : డాక్టర్లను దేవుళ్లతో సమానంగా భావిస్తూ ఉంటారు, దేవుడు జన్మనిస్తే డాక్టర్ పునర్జన్మనిస్తాడు. తన ప్రాణాలను కూడా లక్ష్య పెట్టకుండా కరోనా సమయంలో ఎంతో సమాజ సేవ చేసిన వైద్యులు కచ్చితంగా దేవుళ్లతో సమానం అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా మరో సంఘటన డాక్టర్ దేవుడు సమానం అన్నట్లుగా ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. బెంగళూరుకు చెందిన ఒక డాక్టర్ ఏకంగా మూడు కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆపరేషన్ చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా […]
Viral News : అనగనగా ఓ వృద్ధుడు.. ఆ వృద్ధుడి వయసు 89 ఏళ్లు. ఇంకా శృంగార వాంఛలు చచ్చిపోలేదు. 87 ఏళ్ల భార్యను శృంగారంలో పాల్గొనమని పదే పదే వేధిస్తున్నాడట. ఆ వేధింపులు తట్టుకోలేక ఆ 87 ఏళ్ల వృద్ధ భార్య ఓ హెల్ప్ లైన్‌ని ఆశ్రయించిందట. సదరు హెల్ప్ లైన్ బృందం వారు ఆ వృద్ధ దంపతులిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పరిష్కార మార్గాన్ని చూపించారట. అప్పటితో ఆ వృద్ధురాలికి భర్త నుంచి శృంగార వేధింపులు […]
Viral News : తన భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం వుందని అనుమానం వచ్చినా సహించని భార్యలున్న సమాజం మనది. అలాంటిది ఓ హిజ్రాని ప్రేమించాడని తెలిసి తన భర్తకు అదే హిజ్రాతో పెళ్లి చేసిన ఓ భార్య కథ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. కలహండి జిల్లా నర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని డోర్‌కుట్ గ్రామంలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఫకీర్ నియాల్‌కి ఐదేళ్ల క్రితం వివాహైంది. ఆ […]