Telugu News » Tag » Trailer
హోలీ పండుగ .. వకీల్ సాబ్ ట్రైలర్ పండుగలా మారింది. ఎప్పుడైతే ట్రైలర్ విడుదలవుతుందని ప్రకటన వచ్చిందో ఇక అప్పటి నుండి ఫ్యాన్స్ ఈ ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా చూస్తూ వచ్చారు. కొద్ది సేపటి క్రితం వకీల్ సాబ్ చిత్ర ట్రైలర్ విడుదల చేయగా, ఈ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేయడమే కాకుండా అభిమానులకు రెట్టింపు ఆనందాన్ని కలుగజేస్తుంది. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ సినిమా ట్రైలర్‌ను చూస్తుండే సరికి ఫ్యాన్స్ పూనకం వచ్చినట్టు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్. దిల్ రాజు-శిరీష్ నిర్మించిన ఈ మూవీని శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేశారు. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. వెరైటీగా చేస్తున్న ప్రమోషన్స్ సినిమా బజ్ ను పెంచేశాయి. ఇక ట్రైలర్ కూడా విడుదల చేసి అంచనాలు రెట్టింపు చేయాలని భావించిన మేకర్స్ మార్చి 29 సాయంత్రం ఆరు గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. పవన్ […]
యంగ్ స్టార్స్ నితిన్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలలో వెంకీ అట్లూరి తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ రంగ్ దే. మార్చి 26న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేయగా, ఇందులో నితిన్, కీర్తి సురేష్ రిలేషన్ చూస్తుంటే చిన్నప్పటి నుండి టామ్ అండ్ జెర్రీ మాదిరిగా కనిపిస్తున్నారు. ఇక పెళ్లైన తర్వాత వారిద్దరి జీవితాలలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేది వెంకీ అట్లూరి […]
టాలీవుడ్ మన్మథుడిగా పేరు సంపాదించిన నాగార్జున యుక్త వయస్సులో ఎక్కువగా రొమాంటిక్ చిత్రాలే చేశాడు. ఇప్పుడు కాస్త వైవిధ్యం చూపిస్తూ విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుంటున్నాడు. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో వైల్డ్ డాగ్ అనే సినిమా చేసిన నాగార్జున ఇందులో ఎన్ఐఏ ఏజెంట్‌గా కనిపించి సందడి చేయనున్నారు. ఏప్రిల్ 2న విడుదల కానున్న ఈ చిత్రంలో సయామీ ఖేర్, దియా మీర్జా, అతుల్ కుల్ కర్ణి, అలీ రెజా ప్రధాన పాత్రలు పోషించారు. హైదరాబాద్‌లో జరిగిన […]
NAANDHI : అల్లరి నరేష్ అంటే కామెడీ చిత్రాలే కాదు కొన్ని సీరియస్ పాత్రలు కూడా గుర్తొస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి శంభో శివ శంభో, నేను, లడ్డూబాబు వంటి ప్రయోగాత్మక చిత్రాలు. వీటిలో అల్లరి నరేష్ నటన నభూతో నభవిష్యత్ అనే చెప్పాలి. వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న అల్లరోడు ఇప్పుడు సరికొత్త పాత్రలో ప్రేక్షకులని అలరించేందుకు సిద్దమయ్యాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నాంది అనే మూవీ చేసిన నరేష్ ఈ చిత్రాన్ని ఫిబ్రవరి […]
Uppena : మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో వెండితెర ఎంట్రీకి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇస్తున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ కలిసి ఈ సినిమాని నిర్మించాయి. ఎప్పుడో విడుదల కావలసిన ఈ చిత్రం కరోనా వలన వాయిదా పడింది. దేవి శ్రీ ప్రసాద్ […]