Telugu News » Tag » Tirupathi
Tirupati Laddu : తిరుపతి లడ్డూకి వున్న ప్రాముఖ్యత గురించి కొత్తగా చెప్పేదేముంది.? తిరుపతి లడ్డూ అంటే అది మహా ప్రసాదం.! గతంలో అయితే, ఎన్ని రోజులైనాగానీ లడ్డూ పాడయ్యేది కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదన్నది నిర్వివాదాంశం.! రుచిలోనూ అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా అని భక్తులే చెబుతుంటారు. పెద్ద సంఖ్యలో లడ్డూలనీ తయారు చేస్తుండడంతో, లడ్డూ అనేది ప్రసాదం అనడం కంటే.. లడ్డూ విక్రయాన్ని ఓ వ్యాపారంగా టీటీడీ మార్చేసిందన్న విమర్శలు లేకపోలేదు. […]
Nandini Roy : ఏం మొక్కుకుందోగానీ, ఏకంగా మోకాళ్ళ మీద తిరుపతి – తిరుమల మెట్ల మార్గంలో వెళ్ళింది సినీ నటి నందినీ రాయ్. బిగ్ బాస్ ఫేమ్ నందినీ రాయ్ పలు సినిమాల్లో నటించింది.. పలు వెబ్ సిరీస్‌లలో కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తిరుపతికి వెళ్ళింది. మోకాళ్ళ మీద తిరుమల కొండ మెట్లెక్కుతున్న వైనాన్ని సోషల్ మీడియా వేదికగా వీడియో రూపంలో పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చింది నందినీ రాయ్. మామూలుగా మెట్లెక్కడమే […]
చాలా మంది యజమానులు తమ వద్ద పనిచేసే కూలీలకు ఉద్యోగస్తులకు నెలవారి లేదా రోజువారి చెల్లింపులు చేస్తున్నాం కదా అని వారి బాగోగుల గురించి అస్సలు పట్టించుకోరు. వారు ఏమైతే మాకేంటి వారు చేస్తున్న పనికి డబ్బులు ఇస్తున్నాం వారి గురించి అంతకు మించి పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి అంటూ కొందరు చాలా నిర్దయగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం తమ సంస్థలో పనిచేసే వారిని తమ కుటుంబ సభ్యులుగా భావించి, వారిని గౌరవించడం మనం […]
Minister Roja : దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు కుటుంబ సభ్యులు, సన్నిహితుల్ని తీసుకెళ్ళడం వరకూ ఓకే. ప్రోటోకాల్‌ని మించి ఎక్కుమందిని, అందునా అనుచరుల్ని వెంటేసుకు వెళ్ళడం ఎంతవరకు సబబు.? పవిత్ర పుణ్యక్షేత్రాన్ని టూరిజం కేంద్రంగా మంత్రి రోజా మార్చేశారంటూ జనసేన నేత కిరణ్ రాయల్ విమర్శించారంటే, ఆ విమర్శలు ఊరకనే రాలేదు. తాజాగా, మంత్రి రోజా.. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆమె తన వెంట 30 మందిని తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. తొలుత […]
AP & Telangana రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల జరగనున్న ఉప ఎన్నికలకి ప్రచారం జోరందుకుంది. రెండు చోట్లా విజయం ఏక పక్షంగానే కనిపిస్తోంది. కానీ.. పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య మాత్రం భారీగా ఉంది. తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో ఏకంగా 41 మంది తుది పోరులో నిలవగా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో ఫైనల్ గా 28 మంది బరిలో ఉన్నారు. పరిమాణం, ఓటర్ల సంఖ్య పరంగా నాగార్జునసాగర్ […]
TDP పచ్చ బ్యాచ్ పాలిటిక్స్ పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ తిరుమల తలనీలాలను సైతం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని విమర్శిస్తున్నారు. భక్తులు సమర్పించే తల వెంట్రుకలు మయన్మార్ మీదుగా చైనాకి స్మగ్లింగ్ అవుతున్నాయని ఎల్లో మీడియా ఫేక్ వార్తలను వండి వార్చుతోందని చెబుతున్నారు. తోక పత్రికగా పేరు మోసిన ఒక న్యూస్ పేపర్ అదే పనిగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రతిష్టను దెబ్బతీసేలా కథనాలను […]
ఓం నమో వేంకటేశాయ.. ఏడు కొండలవాడా.. గోవిందా.. గోవింద. శ్రీవారి భక్తులకు శుభవార్త. ఇక అందరూ ఆ స్వామిని దర్శించుకోవచ్చు. కరోనా నేపథ్యంలో విధించిన రూల్స్ అన్నింటినీ తాజాగా తొలగించారు. దీంతో ఇక పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడినవారు కూడా కలిగియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుణ్ని దర్శనం చేసుకోవచ్చు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)వారు శుక్రవారం సాయంత్రం ప్రకటన జారీ చేశారు. భక్తుల మనోభావాలను.. శ్రీవారి భక్తుల మనోభావాలను, ఆచారాలను పరిగణనలోకి తీసుకొని తిరుమల […]
తెలుగు రాష్ట్రాల్లో బలపడిపోయామనే ఉద్దేశ్యంతో ఉంది భారతీయ జనతా పార్టీ. తెలంగాణాలో అంటే ఎంపీ ఎన్నికల్లో, దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయాలు సాధించింది కాబట్టి ఆ రాష్ట్రంలో పుంజుకున్నామని కమలనాథులు అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ దుబ్బాక గెలుపును చూసుకుని ఆంధ్రాలో చంకలు గుద్దుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. త్వరలో జరగబోయే లోక్ సభ అప్ ఎన్నికల్లో కూడ గెలుపు తమదేనని ధీమాతో ఉన్నారు. వారి ధీమా కొద్దిగా వింతగానే ఉన్నా గెలుపు కోసం ప్రయత్నం మాత్రం […]
తిరుపతి ఉప ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. వైసీపీ, టీడీపీ, బీజేపీ – జనసేన కూటమి ఎవరికివారు కసరత్తులు స్టార్ట్ చేశారు. ఎలాగూ సిట్టింగ్ స్థానం, ఆపై పార్లమెంట్లో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. కాబట్టి ఆ స్థానాన్ని తిరిగి గెలుచుకోవడం పెద్ద కష్టమేమీ కాదనే ధీమాలో ఉన్నారు వైసీపీ నేతలు. తెలుగుదేశం పార్టీ ఏమో ఇప్పటివరకు అభ్యర్థి ఎవరో ప్రకటించలేదు. ఎలా ముందుకెళతారన్న విషయమై స్పష్టత ఇవ్వలేదు. టీడీపీకి పోటీ చేయాలనే ఉన్నా సరైన గెలుపు గుర్రం దొరకట్లేదట. ఇక బీజేపీ […]
గత ఎన్నికల్లో వైకాపాను సంపూర్ణంగా ఆదరించిన ఇచ్చిన జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఒకటి. జిల్లాలోని 10కి 10 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే గెలిచారు. ఇలాంటి జిల్లాలో పార్టీ కీలక నేతల నడుమ సఖ్యత తప్పిన వాతావరణం కనిపిస్తోంది. మంత్రి పదవుల కేటాయింపులు జరిగినప్పుడు జిల్లా ఎమ్మెల్యేల మధ్యన మొదలైన అంతరాలు తారాస్థాయికి చేరాయి. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి యువ లీడర్లతో అస్సలు పొసగని పరిస్థితి కనబడుతోంది. జిల్లా రాజకీయాల్లో తనకు ప్రాధాన్యం తగ్గుతోందని భావించిన […]
ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్లడం అనే అంశం తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. అన్యమతస్థులు తిరుమలకు వెళ్తే అక్కడ డిక్లరేషన్ ఫారం పై సంతకం చేయాలనే సాంప్రదాయం ఉంది. అయితే ఇప్పుడు స్వామి వారి ఉత్సవాలకు వెళ్లనున్న జగన్ కూడా డిక్లరేషన్ పై సంతకం చేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిక్లరేషన్ పై జగన్ సంతకం పెట్టటాల్సిన అవసరం లేదని, గతంలో ఇందిరా గాంధీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి డిక్లరేషన్ పై […]
నార్త్ ఇండియాలో మొదలైన కుల, మత రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రారంభం అయ్యాయి. అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి యొక్క రథం తగలబడటంతో రాష్ట్రంలో దేవుళ్ళ పేరిట రాజకీయాలు జరుగుతున్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి హిందు మతాలను గౌరవించడం లేదని ప్రతిపక్షాల నేతలు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో జగన్ కు తిరుమలకు వెళ్లడం మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. తిరుమల శ్రీవారిని అన్యమతస్థులు ఎవరు దర్శించినా డిక్లరేషన్ ఇవ్వడం సంప్రదాయంగా వస్తుంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ […]
కరోనా లాక్ డౌన్ విధించిన క్రమంలో వలస కూలీలకు వాహనాలు ఏర్పాటు చేసి సొంత ప్రాంతాలకు పంపించాడు సోను సూద్. అలాగే ఎంతో మంది ఆకలి తీర్చి గొప్ప మనుసును చాటుకున్నాడు. అలాగే విదేశంలో చిక్కుకుపోయిన కొంతమంది భారతీయ విద్యార్థులను తన సొంత ఖర్చుతో స్వదేశానికి రప్పించాడు.ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సహాయాలు చేసాడు. ఇది ఇలా ఉంటె తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన నాగేశ్వరరావు అనే రైతు, అతని భార్యాబిడ్డలు పడుతున్న కష్టం చూసి చలించిన […]
ప్రస్తుత రోజుల్లో అమ్మాయిలకు మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నారు కొంతమంది అబ్బాయిలు. చాలా వరకు ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. కానీ ఓ కిలాడీ మూడు పేర్లు పెట్టుకొని ఏకంగా ముగ్గురు యువకులను మోసం చేసింది. ఇక వివరాల్లోకి వెళితే తిరుపతి కి చెందిన పతంగి స్వప్న అలియాస్ పతంగి హరిణి, అలియాస్ నందమురారి స్వప్న ఈ మూడు పేర్లు పెట్టుకుంది ఈ మాయ లేడి. ఇక మూడు పేర్లు పెట్టుకొని ముచ్చటగా మూడు పెళ్లిళ్లు […]
భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు ఉధృత స్థాయికి చేరుకుంటున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో రికార్డు స్థాయి కేసులు నమోదు అవుతున్నాయి. ఇదిలా ఉండగా ఆదివారం ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్ లో 5041పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా 56 మంది చనిపోవడం కూడా జరిగింది. కరోనా కేసులు ఒక్క సారిగా ఆంధ్రప్రదేశ్ లో చెలరేగుతుండడం తో అక్కడి ప్రజలు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం […]