Telugu News » Tag » Tirumala
Ravali : పెళ్లి సందడి సినిమా లో హీరోయిన్ గా నటించిన రవళి ని తెలుగు ప్రేక్షకులు అంత సులభంగా మరచిపోరు. రాఘవేందర్రావు ఆమెని ఎంత అందంగా చూపించారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. చాలా పద్ధతి అయిన పక్కింటి అమ్మాయి పాత్రలో రవళిని చూపించాడు. రవిళి ని అందంగా చూపించి అందరిని ఆకట్టుకున్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆ తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ ని పరిచయం చేసినా కూడా రవళి అంతా అందంగా వాళ్లు లేరు అనే […]
Tirumala : కలియుగ వైకుంఠం తిరుమల కి 2022 సంవత్సరంలో భారీ ఆదాయం వచ్చింది. ఈ ఏడాది హుండీ గలగలలాడింది. 2022 సంవత్సరం మొత్తం కలిపి 1320 కోట్ల రూపాయలు హుండీ ద్వారా ఆదాయం వచ్చినట్లుగా టీటీడీ అధికారులు అధికారికంగా వెల్లడించారు. 2022 సంవత్సరంలో తిరుమల శ్రీవారిని 2 కోట్ల 35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. కోటి ఎనిమిది లక్షల మంది శ్రీవారికి తల నీలాలు సమర్పించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య ప్రతి […]
Namitha : బాలకృష్ణ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న సీనియర్ నటి నమిత తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భర్త మరియు ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో కలిసి నమిత శ్రీవారిని దర్శించుకున్నట్లుగా తెలుస్తోంది. రంగ నాయకుల మండపంలో వేద పండితుల ఆమెకు ఆశీర్వచనం ఇచ్చి లడ్డు ప్రసాదమును అందించారు. అనంతరం ఆమె ఆలయం నుండి బయటకు వచ్చారు. ఆ సందర్భంగా మీడియా వారు ఆమెను మాట్లాడించేందుకు ప్రయత్నించారు. తన పిల్లలు బాగున్నారని.. స్వామి వారి […]
Nandini Roy : ఏం మొక్కుకుందోగానీ, ఏకంగా మోకాళ్ళ మీద తిరుపతి – తిరుమల మెట్ల మార్గంలో వెళ్ళింది సినీ నటి నందినీ రాయ్. బిగ్ బాస్ ఫేమ్ నందినీ రాయ్ పలు సినిమాల్లో నటించింది.. పలు వెబ్ సిరీస్‌లలో కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె తిరుపతికి వెళ్ళింది. మోకాళ్ళ మీద తిరుమల కొండ మెట్లెక్కుతున్న వైనాన్ని సోషల్ మీడియా వేదికగా వీడియో రూపంలో పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చింది నందినీ రాయ్. మామూలుగా మెట్లెక్కడమే […]
Tirumala : సరదాగా తన భార్య విసిరిన సవాల్‌ని ఆ బర్త సీరియస్‌గా తీసుకున్నాడు. సినిమాల్లో హీరోయిన్‌ని హీరో యెత్తుకుని మెట్ల మీద వెళుతూ, కొండపైనున్న దేవుడ్ని దర్శించుకుంటుంటాడు. చాలా సినిమాల్లో చూశాం ఇలాంటి సన్నివేశాల్ని. వాటి కోసం చాలా ప్రత్యేకమైన ఏర్పాట్లుంటాయ్.! కానీ, ఇక్కడ అలాంటి ఏర్పాట్లేమీ లేవు. ఓ వ్యక్తి తన భార్యను భుజాన మోస్తూ తిరుమల – తిరుపతి మెట్లెక్కేశాడు. ఒకటి కాదు, రెండు కాదు.. పదీ కాదు, పాతికా కాదు.. ఏకంగా […]
Tirumala : తెలుగు రాష్ట్రాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల కొండపై బ్రహ్మోత్సవాలకు అంకురార్పరణ జరిగింది.ఇవాళ్టి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు.. నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. కరోనా తరువాత తొలిసారి భక్తుల సమక్షంలో ఉత్సవాలు జరగనున్నాయి.బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. విద్యుత్ వెలుగుల్లో శ్రీవారి ఆలయం, రంగనాయకుల మండపం అలంకరించారు. సీఎం జగన్ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలకు […]
Srivari Brahmotsavam : తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావటంతో, ఇవి ‘బ్రహ్మోత్సవాలు’ అయ్యాయని అంటారు.తొమ్మిది రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలు అయ్యాయి. ముస్తాబైన తిరుమల.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పవిత్ర తిరుమల ముస్తాబవుతోంది. ఈ నెల 27, మంగళవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజులపాటు ఈ బ్రహ్మోత్సవాలు […]
Archana Gautam : హిందీ సినీ నటి అర్చన గౌతమ్ నేడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వెళ్లారు. అక్కడ ఆమెకు టీటీడీ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను డబ్బులు చెల్లించినప్పటికీ దర్శన టోకెన్ ఇవ్వలేదని ఆమె ఆరోపించింది. కార్యాలయంలో తాను ఫిర్యాదు చేసేందుకు వెళ్ళగా అక్కడికి సిబ్బంది తనను కొట్టేందుకు ప్రయత్నించారని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. తనతో తప్పుగా ప్రవర్తించిన వారికి దేవుడు తగిన శిక్ష […]
Minister Roja : దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు కుటుంబ సభ్యులు, సన్నిహితుల్ని తీసుకెళ్ళడం వరకూ ఓకే. ప్రోటోకాల్‌ని మించి ఎక్కుమందిని, అందునా అనుచరుల్ని వెంటేసుకు వెళ్ళడం ఎంతవరకు సబబు.? పవిత్ర పుణ్యక్షేత్రాన్ని టూరిజం కేంద్రంగా మంత్రి రోజా మార్చేశారంటూ జనసేన నేత కిరణ్ రాయల్ విమర్శించారంటే, ఆ విమర్శలు ఊరకనే రాలేదు. తాజాగా, మంత్రి రోజా.. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆమె తన వెంట 30 మందిని తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. తొలుత […]
Minister Roja : ఇటీవల వైసీపీ మంత్రులు తిరుమల వేదికగా నానా రచ్చ చేస్తున్నారు. కొండపై కొందరు మంత్రులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం దుమారం రేపుతోంది. ఇవాళ తన అనుచురులతో కలిసి ఆమె వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్నారు మంత్రి రోజా . ఇదేం పద్దతి.. ఆమె వెంట 30 మంది అనుచరులు ఆలయంలోకి వెళ్లారు.. కానీ 20 మందికి అనుమతి లేదని సిబ్బంది చెప్పినా.. అధికారులపై ఒత్తిడి తెచ్చారు.. మరో 20 మందికి బ్రేక్ దర్శనం […]
Sidiri Appalaraju : ఇటీవల కాలంలో వైసీపీ మంత్రులు కొందరు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ప్రజల కోసం పని చేయాల్సిన మంత్రలు ప్రజలనే ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా మంత్రి అప్పలరాజు తిరుమలలో వీరంగం సృష్టించారు. భక్తుల ఆగ్రహం.. శ్రీవారి దర్శనం కోసం అనుచరులతో కలిసి తిరుమలకు మంత్రి అప్పలరాజు చేరుకున్నారు. అనుచరులందరికీ ప్రొటోకాల్ దర్శనం కల్పించాలని టీటీడీపై ఒత్తిడి తీసుకొచ్చారు. మంత్రి అప్పలరాజు ఒత్తిడికి టీటీడీ అధికారులు […]
Roja And Ravali : సినీ నటి రవళి గుర్తుందా.? అదేనండీ, ‘వినోదం’ వంటి సినిమాల్లో నటించిన బొద్దుగుమ్మ. నాగార్జునతో ఓ సినిమాలో నటించింది. బాలయ్యతోనూ సినిమా చేసింది. స్టార్ హీరోయిన్.. అనిపించుకునేదాకా వెళ్ళినా, ఆ స్థాయిని అందుకోలేకపోయిందామె. బుల్లితెరపై హరిత అనే ఓ నటి వుంటుంది.. ఆమెకు రవళి స్వయానా సోదరి. ఇప్పుడు రవళి సినిమాల్లో కనిపించడంలేదు. మరి, రవళి పేరెందుకు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.? అంటే, దానికి ఓ బలమైన కారణం వుంది. […]
Tirumala : ఇటీవల టీటీడీ భక్తుల సౌలభ్యం కోసం అనేక విధి విధానాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టింది. ఇకపై తిరుమలలో కూడా యూపీఐ చెల్లింపుల విధానాన్ని ప్రారంభించింది. భక్తులకు వసతి గదుల కేటాయింపు కౌంటర్లలో ఈ చెల్లింపు విధానం అందుబాటులో ఉంటుంది. చెల్లింపుల కష్టాలకి చెక్.. ఈ కౌంటర్లలో యూపీఐ చెల్లింపులకు లభించే ఆదరణను బట్టి.. కొండపై అన్ని రకాల సేవల చెల్లింపులకు యూపీఐని అనుమతించాలని టీటీడీ […]
Tirumala : ఇటీవల తిరుమల మార్గంలో వన్య ప్రాణులు తెగ సంచరిస్తున్నాయి. తాజాగా తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో నాగపాము హడలెత్తించింది. దాదాపు ఆరడుగుల పొడవున్న నాగుపాము భక్తుల కంటపడింది. 3,400 మెట్టుకు సమీపానికి వచ్చిన నాగుపామును చూసి భక్తులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. పాము హడల్… అడవి నుంచి 3,400 మెట్టుకు సమీపానికి వచ్చిన నాగుపామును చూసి.. భక్తులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. దగ్గర్లోని భద్రతా సిబ్బంది వెంటనే […]
తిరుమల శ్రీవారిని రోజుకి లక్షల్లో భక్తులు దర్శించుకుంటారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ మొక్కులు తీరితే భారీ ఎత్తున కానుకలు సమర్పించుకుంటుంటారు. కొందరు భక్తులు కోట్ల రూపాయల విలువ చేసే కానుకలు ఇస్తారు. మరికొందరు తమకు తోచిన విధంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా కొండపైకి సరిగా భక్తులను అనుమతించలేదు. కొవిడ్ నిబంధనలతో పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో తరచూ శ్రీవారిని దర్శించుకునే భక్తులు స్వామి వారి సన్నిధికి రాలేకపోయారు. […]