Telugu News » Tag » telugu sports news
Rishabh Pant : టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ని ఢీ కొట్టింది. దాంతో వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా రూర్కీ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది. కారును స్వయంగా రిషబ్ పంత్ నడుపుతున్నాడు. అదుపు తప్పిన కారు డివైడర్ ని ఢీ కొట్టడంతో ఫల్టీలు కొట్టిందని.. ఆ సమయంలోనే పంత్ బయటకి […]
Cameron Green : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి సంబంధించి ఇటీవల జరిగిన మినీ వేలంలో ఆస్ట్రేలియా క్రికెటర్ కెమెరూన్ గ్రీన్ రికార్డు మొత్తానికి అమ్ముడు అయిన సంగతి తెలిసిందే. ఏకంగా 17.6 కోట్ల రూపాయలకు ఈ ఆల్ రౌండర్‌ని సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్ జట్టు. కెమెరూన్ గ్రీన్ ఎంత విలువైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆ విషయం ఇంకోసారి నిరూపితమయ్యింది. ఆస్ట్రేలియా – దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మూడో రోజు […]
Ricky Ponting : ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ ఆసీస్ కెప్టెన్ రికీ పాంటింగ్ అస్వస్థతతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఒక మ్యాచ్ కామెంట్రీ చేస్తూ ఉండగా ఆయన హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారని వెంటనే ఆయనకు ప్రథమ చికిత్స అందించి హాస్పిటల్లో జాయిన్ చేసినట్లుగా తెలుస్తోంది. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా వెస్ట్ ఇండీస్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు ఆటకు ఛానల్ 7 తరపున పాంటింగ్ కామెంట్రీ చెప్తున్నాడు. ఈ మ్యాచ్ కు 40 […]
Kieron Pollard : అంతర్జాతీయ క్రికెట్‌కి ఇప్పటికే గుడ్ బై చెప్పేసిన వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ కీరన్ పోలార్డ్, తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి కూడా గుడ్ బై చెప్పేశాడు. అయితే, ఆటగాడిగా మాత్రమే రిటైర్మెంట్ తీసుకుంటున్నానంటూ కీరన్ పోలార్డ్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. సుదీర్ఘకాలం పాటు ముంబై ఇండియన్స్ పట్టుకి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తనదైన గ్లామర్ అద్దాడు పోలార్డ్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ముంబై జట్టుకి కీరన్ పోలార్డ్ అత్యద్భుతమైన సేవలందించిన సంగతి […]
Gautam Gambhir : టీమిండియా కు ఎన్నో అద్భుత విజయాలను సొంతం చేసి పెట్టిన ఏకైక కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని. మూడు ఐసీసీ ట్రోఫీలను తన కెప్టెన్సీలో ధోని ఇండియా కు అందించాడు. అలాంటి అరుదైన రికార్డ్ ఇప్పట్లో కాదు ఎప్పటికీ కూడా ఏ టీం ఇండియా కెప్టెన్ కి సాధ్యం కాదు అంటూ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలై టీ 20 వరల్డ్ కప్ […]
MS Dhoni : మొన్నీమధ్యనే టీమిండియా మాజీ క్రికెటర్ ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ టీమిండియా సొంతమవుతుందని జోస్యం చెప్పాడు. అంతేనా, కొంతకాలం క్రితం భారతదేశంలోకి ఓరియో ప్రవేశించిందనీ.. ఆ ఏడాది టీమిండియా వరల్డ్ కప్ సొంతం చేసుకుందనీ.. ఇప్పుడు ఇంకోసారి కొత్త ప్రోడక్ట్ ఓరియో నుంచి వచ్చిందనీ, ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ టీమిండియాదేననీ ధోనీ చెప్పుకొచ్చాడు. ఓరియో బిస్కెట్ల తయారీ సంస్థకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్. దాంతో, ధోనీ.. ఓరియో బిస్కెట్లకీ, […]
AB De Villiers : ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్న సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నాడు. ఇటీవల గల్లీ లో పిల్లలతో డివిలియర్స్ క్రికెట్ ఆడుతూ సందడి చేసిన విషయం తెల్సిందే. అందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియో లు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అవుతున్న ఈ సమయంలోనే తన సింప్లిసిటీని చాటుకుంటూ డివిలియర్స్ ఒక టీ […]
Rohit Sharma : టీ20 వరల్డ్ కప్ లో టీం ఇండియా దూసుకు పోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సెమీస్ లో అడుగు పెట్టిన టీం ఇండియా సిరీస్ పై కన్ను వేసింది. రెండవ సారి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో జట్టు సీనియర్లు జూనియర్లకు ఎంతో ప్రోత్సాహంగా నిలుస్తున్నారట. ప్రతి ఒక్క ఆటగాడు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారట. ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక కథనం ప్రకారం విమాన ప్రయాణం […]
Prithvi Shaw : యంగ్ క్రికెటర్ పృధ్వీ షా, సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సాయిబాబా ఫొటోని షేర్ చేస్తూ, ‘సాయిబాబా చూస్తున్నావా..’ అని పేర్కొన్నాడు. టీమిండియాలో చోటు కోసం పృధ్వీ షా లాంటి ఎంతోమంది యంగ్ అండ్ డైనమిక్ క్రికెటర్లు ఎదురుచూస్తున్నారు. కానీ, కొందరికి మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. ఫెయిల్ అవుతున్నా జట్టులో కేఎల్ రాహుల్, దినేష్ కార్తీక్ లాంటోళ్ళని కొనసాగిస్తున్నారు. ఒక్క ఛాన్స్ యంగ్ క్రికెటర్లకు జట్టు […]
Virat Kohli : ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ బౌండరీలతో మోత మోగిపోయింది.. దాదాపు లక్షమంది క్రికెట్ అభిమానుల హోరుతో పండగ వాతావరణం నెలకొంది. భారత్ – పాక్ జట్ల మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయాన్ని అందుకుంది. స్టార్ ఆఫ్ ది డే విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్ అనంతరం ఆసక్తికరమైన ట్వీటేశాడు సోషల్ మీడియా వేదికగా. 130 కోట్ల మంది భారతీయులు ‘కింగ్ కోహ్లీ’ అని నినదిస్తోంటే, క్రీడాభిమానులందరికీ సోషల్ […]
Wasim Akram : 1996 వరల్డ్ కప్ సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ వసీం అక్రమ్ కీలకమైన క్వార్టర్ ఫైనల్ లో ఆడక పోవడంపై తీవ్ర దుమారం రేగింది. ఇండియా పై ఆ మ్యాచ్ పాకిస్తాన్ గెలిస్తేనే ఫైనల్ కి వెళ్తుంది, లేదంటే ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి. అలాంటి కీలకమైన మ్యాచ్ లో భీకరమైన ఫామ్ లో ఉన్న వసీం అక్రమ్ ఆడక పోవడంతో అంతా కూడా ఇండియాతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాడు అంటూ అతడి పై తీవ్ర […]
Sourav Ganguly : టీమిండియా మాజీ కెప్టెన్ ప్రస్తుత బీసీసీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భార్య డోనా తీవ్ర అనారోగ్య సమస్యతో కోల్‌కతలోని వుడ్ ల్యాండ్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. రెండు రోజుల క్రితం ఆమెకు తీవ్రమైన గొంతు నొప్పి మరియు దగ్గు రావడంతో హాస్పిటల్ కి కుటుంబ సభ్యులు తీసుకు వెళ్లారు. కానీ ఆ విషయాన్ని కుటుంబ సభ్యులు మీడియాకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. హాస్పిటల్ వర్గాల నుండి తాజాగా సౌరవ్ గంగూలీ భార్య డోనా […]
Sachin Tendulkar : వారిద్దరూ క్రికెట్ అభిమానులకు దేవుళ్ళతో సమానం… క్రికెట్ ని ఆకాశమే హద్దు అన్నట్లుగా ఇండియాలో క్రేజ్ పెంచిన స్టార్స్ వారిద్దరు. వారిద్దరూ గతంలో కలిసి ఆడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు వారిద్దరూ ఆటకు దూరమయ్యారు. రిటైర్మెంట్ తీసుకున్న సచిన్ టెండూల్కర్ మరియు మహేంద్రసింగ్ ధోని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఆట కోసం అభిమానుల కోసం రెగ్యులర్ గా గ్రౌండ్ లో సందడి చేసే ఈ ఇద్దరు ఈసారి టెన్నిస్ గ్రౌండ్లో […]
Dinesh Karthik : టీమిండియా క్రికెటర్లు మైదానంలో బ్యాటింగ్ చేసే క్రమంలో దాదాపు అంతా ఒకే తరహా హెల్మెట్ ధరిస్తుంటారు. వికెట్ కీపింగ్ సమయంలో టీమిండియాకి సంబంధించినంతవరకు ఏ వికెట్ కీపర్ అయినా కూడా అవే తరహా హెల్మెట్లను ధరించడం చూస్తుంటాం. బౌలింగ్ తీరుని బట్టి, హెల్మెట్ వుంచాలా.? వద్దా.? అన్నది వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ నిర్ణయించుకుంటారు. టీమిండియాకి సంబంధించినంతవరకు చూసుకుంటే దినేష్ కార్తీక్ వెరీ వెరీ స్పెషల్‌గా కనిపిస్తుంటాడు హెల్మెట్ల వాడకం విషయంలో. మిగతా ఆటగాళ్ళ […]
Team India : ఆసియా కప్ 2022 నుండి టీం ఇండియా వెను దిరిగింది. సూపర్ ఫోర్ దశలో వరుసగా రెండు మ్యాచ్ ల్లో పరాభవం చవి చూడడంతో టీం ఇండియా ఫైనల్ రేస్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. మొన్న పాకిస్తాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో టీం ఇండియా పరాభవను చవి చూసిన విషయం తెల్సిందే. ఆ నేపథ్యంలో శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో కచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకొని మళ్లీ పాకిస్తాన్ పై పట్టు సాధిస్తుంది […]