Telugu News » Tag » telangana cm kcr
MLC Kavitha : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ ముందు మరోసారి విచారణకు హాజరు కాబోతుంది. తనను రాజకీయంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ఎదుర్కొలేక కేసులు బనాయిస్తున్నట్లుగా కవిత విమర్శించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు విఫలమైందని, దాన్ని జాతీయ స్థాయిలో చూపించేందుకు ప్రయత్నిస్తున్న తమపై కుట్రలు చేస్తున్నారంటూ కవిత ఆరోపించారు. మహిళా బిల్లు పై పార్లమెంటులో ఒత్తిడి తెస్తామని ఆమె […]
Pawan kalyan : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పవన్ కల్యాణ్ మళ్లీ క్రియాశీల రాజకీయాలు మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన పదో వార్షిక ఆవిర్భావ సభను కృష్నా జిల్లా మచిలీ పట్నంలో నిర్వహించారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అనేక విషయాలపై క్లారిటీ ఇచ్చారు. చాలామంది నన్ను ప్యాకేజ్ స్టార్ అంటున్నారు. ఇప్పుడేమో కొత్త నినాదం ఎత్తుకున్నారు. నాకు తెలంగాణ సీఎం కేసీఆర్ వెయ్యి కోట్లు ఆఫర్ చేశారంటూ […]
Bandi Vs Kanna: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పని తీరు విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ రెండు వేర్వేరు దారుల్లో పయనిస్తుండటం గమనార్హం. కేసీఆర్ గాంధీ హాస్పిటల్ ని సందర్శించి అక్కడి కొవిడ్ పేషెంట్లతో నేరుగా మాట్లాడి వాళ్లకు ధైర్యం చెప్పిన సంగతి తెలిసిందే. దీన్ని కూడా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తప్పుపట్టగా ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ స్వాగతించటం […]
KCR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికారిక నివాసమైన ప్రగతిభవన్ కి 20 రోజుల విరామం తర్వాత ఇవాళ గురువారం మధ్యాహ్నం వచ్చారు. కరోనా వైరస్ పాజిటివ్ అని తేలటంతో ఆయన ఇన్నాళ్లూ మెదక్ జిల్లాలోని తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్న సంగతి తెలిసిందే. మొన్న మంగళవారం నిర్వహించిన కొవిడ్-19 టెస్టులో నెగెటివ్ అని నిర్ధారణ కావటంతో సీఎం ఇక తన రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈరోజు హైదరాబాద్ కి చేరుకున్నారు. వైద్య, ఆరోగ్య మంత్రి […]
KCR: కొవిడ్-19 వైరస్ సోకటంతో దాదాపు పది రోజులుగా హోం ఐసోలేషన్ లోనే ఉంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన తాజా వార్త వెలువడింది. ఆయనకు లేటెస్టుగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా వైరస్ నెగెటివ్ అని వచ్చింది. ఈ రోజు బుధవారం ర్యాపిడ్ యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశారు. యాంటీ జెన్ ఎగ్జామ్ లో నెగెటివ్ అని రాగా ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితం రేపు గురువారం వెల్లడి కానుంది. తొలిసారిగా ఈ నెల 21న […]
Jagan vs Kcr : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లీడర్లకి భలే ఐడియాలు వస్తుంటాయ్. కాకపోతే అవి వాళ్ల పార్టీని బాగుచేసేవి మాత్రం కావు. ప్రత్యర్థి పార్టీలకు ప్లస్ చేసేవి. అయితే వాటిలో కాస్త ప్రజాకోణం కూడా ఉండటం విశేషం. హస్తం పార్టీ ఎమ్మెల్సీ, ఆ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి ఇవాళ ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి, రాష్ట్ర అధికార యంత్రాంగానికి ఒక సూచన చేశారు. అదేంటంటే నాగార్జునసాగర్ శాసన సభ నియోజకవర్గ […]
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో మరోసారి ముసలం పుట్టిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేత సొంతగా పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాడంటూ ఆ పార్టీకే చెందిన మంత్రి కీలక వ్యాఖ్యలు చేశాడు . ఇంతకీ పార్టీ నుండి బయటకు వచ్చి సొంతగా పార్టీ పెట్టె నేత ఎవరయ్యా అంటే ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అని అంటున్నారు. నిజానికి ఈటెల రాజేందర్ కు సీఎం కేసీఆర్ కు […]
బీజేపీ అంటే కేవలం ఉత్తర భారతదేశంకు మాత్రమే చెందినదిగా కొంత కాలం వరకు ఉంది. ఎప్పుడైతే కర్ణాటకలో ప్రభుత్వంలోకి వచ్చారో అప్పటి నుండి సౌత్ లోని ఇతర రాష్ట్రాల్లో జెండా పాతేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కాని వర్కౌట్ అవ్వడం లేదు. అక్కడ ఇక్కడ ఎక్కడైనా సింగిల్ డిజిట్ ను మాత్రం దాటిన సందర్బాలు కనిపించడం లేదు. గతంలో ఎప్పుడు లేని […]
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ మూడు రోజులు ఉంటుందని మొదట వార్తలు వచ్చాయి. కాని వెంట వెంటనే ప్రధాని మరియు మంత్రులు కలవడంతో రెండు రోజుల్లోనే కేసీఆర్ హైదరాబాద్ తిరిగి వచ్చాడు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఏం చేశారు, ఎవరిని కలిశారు, ఏం అడిగారు అనే విషయాలపై పూర్తి స్పష్టత అయితే లేదు. కాని రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటూ మాత్రం స్పష్టంగా మీడియాలో వచ్చేలా జాగ్రత్త పడ్డారు. వేరే మీడియాలో విమర్శలు వచ్చినా కూడా […]
జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో సీఎం కెసిఆర్ మేనిఫెస్టో ను విడుదల చేసాడు. ఇక ఈ మేనిఫెస్టోలో సినీ పరిశ్రమకు వరాలు కురిపించారు. ఇక ఆయన మాట్లాడుతూ.. కరోనా వల్ల సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని ఆపదలో ఉన్న పరిశ్రమను ఆదుకుంటామని హామీ ఇచ్చాడు. సుమారుగా సినీ పరిశ్రమ మీద ఆధారపడిన 40 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారందరికీ అండగా ఉంటామని చెప్పుకొచ్చాడు. చిన్న సినిమాలు తీసే వారికీ కూడా అండగా నిలుస్తామని పేర్కొన్నాడు. త్వరలో థియేటర్లు […]
జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు అన్ని కూడా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి మంత్రి కేటీఆర్ వారం రోజుల పాటు ప్రచారం సాగనున్న విషయం తెలిసిందే. దీనితో ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటూ ప్రతిపక్షాలకు గట్టిగా కౌంటర్లు వేస్తున్నాడు. ఇక ఇదే తరుణంలో పలుమార్లు పొత్తు విషయాన్నీ కూడా ప్రస్తావించాడు. అయితే టీఆర్ఎస్ పార్టీ మజ్లీస్ పార్టీ తో పొత్తు పెట్టుకోవడం లేదని ఒంటరిగానే పోటీ చేస్తున్నామని పదే పదే చెప్పుకొచ్చాడు. ఇక […]
ఏం కరోనానో ఏమో… ఈ మాయదారి కరోనా వచ్చి అందరి జీవితాలను నాశనం చేసింది. రోజుకు 24 గంటలు నడిస్తేనే ఆదాయం అంతంత మాత్రం. అటువంటిది ఒకేసారి ఆరునెలలకు పైగా ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు నడవకుంటే ఎలా ఉంటది. రెండు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర బస్సులు ఎన్ని నడిచినా కూడా ఆదాయం తక్కువే వస్తుంది. లాక్ డౌన్ ను సడలించినా.. బస్సులు రోడ్డెక్కినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు మాత్రం రోడ్డెక్కలేదు. దీంతో ఇరు […]
జనగామ జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు వేదికలను సీఎం కెసిఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రైతుల కోసం వేదికలు నిర్మించామని అన్నారు. దేశంలోనే తెలంగాణ రైతులు మొదటి స్థానంలో ఉన్నారని తెలిపాడు. రైతులకు వేదిక నా కళ అని సీఎం కెసిఆర్ పేర్కొన్నాడు.
నిన్న ఒక న్యూస్ ఛానల్ లో తెలంగాణ మంత్రి రాసలీలలు అంటూ ఒకటే బ్రేకింగ్ న్యూస్ వేసి అదరకొట్టారు, తెలంగాణ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరించే ఆ న్యూస్ ఛానల్ లో అదే తెరాస కు చెందిన మంత్రి యొక్క రాసలీలల గురించి న్యూస్ రావటం నిజం విడ్డురం, అయితే అవి ఎంత వరకు నిజమో కాదో తెలియక మిగిలిన మీడియా సంస్థలు దాని జోలికి వెళ్ళలేదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం దాని గురించి పెద్ద […]