Telugu News » Tag » T20 World Cup
Cricketer : ఒకప్పుడు క్రికెట్లో సెంచరీ కొట్టడం అంటే చాలా గొప్ప విషయం.. కానీ వన్డేల్లో డబల్ సెంచరీ సాధించి మొదటి సారి క్రికెట్ అభిమానులను సచిన్ టెండూల్కర్ ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే. ఇక టీ20 లో సెంచరీ కొట్టడం అంటే అసాధ్యం అని చాలా మంది భావించారు, కానీ సునాయాసంగా టీ20 లో కూడా సెంచరీలు కొట్టేస్తున్న క్రికెటర్స్ ఇప్పుడు మన దేశంతో పాటు ఇతర దేశాల్లో చాలా మంది ఉన్నారు. టెస్టుల్లో 400 […]
Irfan Pathan : టీ20 వరల్డ్ కప్ లో నేడు ఫైనల్ లో భాగంగా పాకిస్తాన్ మరియు ఇంగ్లాండ్ జట్టులు తలపడబోతున్న విషయం తెలిసిందే. ఈ తుది పోరులో కచ్చితం గా ఇండియా నిలుస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఇంగ్లాండ్ చేతిలో ఇండియా ఘోర పరాజయం పాలవ్వడంతో పాకిస్తాన్ తో ఫైనల్లో తలపడే అవకాశం ఇంగ్లాండు కి దక్కింది. ఇంగ్లాండ్ మరియు పాకిస్తాన్ మధ్య జరగబోతున్న ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి చేసిన ట్వీట్ […]
T20 World Cup : ఆస్ట్రేలియాలో జరుగుతోన్న 2022 టీ20 వరల్డ్ కప్ పోటీలకు సంబంధించి ఫైనల్ మ్యాచ్ పట్ల ఎవరికీ పెద్దగా ఆసక్తి లేకుండా పోయింది. ఎప్పుడైతే టీమిండియా ఈ టోర్నీ నుంచి సెమీస్ దశలో నిష్క్రమించిందో, అప్పుడే టోర్నీ మీద క్రికెట్ అభిమానులకి ఆసక్తి పోయింది. ఈ టోర్నీ మొత్తంలో టీమిండియా తలపడిన మ్యాచ్‌లకు మాత్రమే ఎక్కువగా క్రికెట్ అభిమానులు హాజరయ్యారు. మిగతా మ్యాచ్‌లన్నీ చప్పగానే సాగాయి. ఆఖరికి ఆథిథ్య ఆస్ట్రేలియా జట్టు తలపడ్డ […]
Babar Azam : రేపు టీ20 వరల్డ్ కప్ – 2022 ఫైనల్ మ్యాచ్ జరగబోతున్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ మరియు ఇంగ్లాండ్ జట్లు తలపడబోతున్నాయి. ఈ రెండు జట్లలో ఏ జట్టు గెలుస్తుందా అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ రేపు జరగబోతున్న ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిస్తే 2048లో ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్ జట్టు టీం కెప్టెన్ బాబర్ ఆజమ్ పాకిస్తాన్ […]
Rohit Sharma : హిట్ మ్యాన్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కంటతడి పెట్టాడు. సెమీస్‌లో టీమిండియా ఓటమి పాలై, టీ20 వరల్డ్ కప్ 2022 పోటీల నుంచి నిష్క్రమించడంపై రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ, చాలామంది రోహిత్ శర్మ మీద సెటైర్లేస్తున్నారు.. ఆయన మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ధాటిగా బ్యాటింగ్ చేసి, స్కోర్ బోర్డుని 200 దాటించి వుంటే.. ఇంగ్లాండ్ మీద ఒత్తిడి పెరిగేది కదా.? […]
Rohit Sharma : రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా, టీ20 వరల్డ్ కప్ 2022ని కైవసం చేసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, సెమీస్‌లోనే టీమిండియా ఇంటికి వచ్చేసింది. ఫైనల్ వరకూ చేరకుండానే టీమిండియా ఈ టోర్నీ నుంచి ఔట్ అయిపోవడం భారత క్రికెట్ అభిమానులకు అస్సలేమాత్రం మింగుడు పడటంలేదు. ఆట అన్నాక గెలుపోటములు సహజం. అయితే, ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో భారత బౌలర్లు ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్క వికెట్ అయినా తీయలేకపోయారు. రోహిత్ శర్మకి […]
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో టీమిండియా చేతులెత్తేసింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా, బౌలింగ్‌లో అత్యంత పేలవమైన ఆటతీరు ప్రదర్శించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్.. పైగా, ఫైనల్‌కి తీసుకెళ్ళే మ్యాచ్.. అందునా, పాకిస్తాన్‌తో ఫైనల్‌లో తలపడే అవకాశం.. ఇన్ని ప్రత్యేకతలున్న మ్యాచ్‌ని టీమిండియా లైట్ తీసుకుంది. తొలుత బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. నిజానికి, ఇది చిన్న స్కోర్ ఏమీ […]
AB De Villiers : ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్న సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్నాడు. ఇటీవల గల్లీ లో పిల్లలతో డివిలియర్స్ క్రికెట్ ఆడుతూ సందడి చేసిన విషయం తెల్సిందే. అందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియో లు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అవుతున్న ఈ సమయంలోనే తన సింప్లిసిటీని చాటుకుంటూ డివిలియర్స్ ఒక టీ […]
Virat Kohli : టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కి భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. దాయాది దేశం పాకిస్థాన్ లో కూడా విరాట్ కోహ్లీ క్రికెట్ ను ఆస్వాదించే వారు లక్షల్లో ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ ని సపోర్ట్ చేసే వారు ప్రపంచ వ్యాప్తంగా కోట్లల్లో ఉంటారు. ఇక నేడు ఇంగ్లాండ్ తో టీ20 […]
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ పోటీలకు సంబంధించి గ్రూప్ దశని కూడా పాకిస్తాన్ దాటలేదేమోనని అంతా అనుకున్నారు. కానీ, పాకిస్తాన్ జట్టుకి అదృష్టం కలిసొచ్చింది. ఫైనల్స్‌కి క్వాలిఫై అయ్యింది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘనవిజయం సాధించింది. న్యూజిలాండ్ చేతులెత్తేయడం పాకిస్తాన్‌కి కలిసొచ్చింది. కాగా, టీమిండియా రేపు ఇంగ్లాండ్‌తో సెమీస్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి, ఫైనల్స్‌కి వెళ్ళాల్సి వుంటుంది టీమిండియా. ప్రస్తుతం టీమిండియా వున్న ఫామ్ చూస్తోంటే, […]
Virat Kohli : టీ20 వరల్డ్ కప్ 2022లో అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ టీం ఇండియా కు ఘన విజయాలను సాధించి పెట్టిన విరాట్ కోహ్లీ బుధవారం ప్రాక్టీస్ సందర్భంగా అక్షర పటేల్ వేసిన బాల్ కి గాయపడ్డట్లుగా సమాచారం అందుతుంది. రేపు ఇంగ్లాండుతో అత్యంత కీలకమైన సెమీస్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ గాయపడడం ఇండియా క్రికెట్ అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. విరాట్ కోహ్లీ గజ్జల్లో బాల్ బలంగా తగిలిందని దాంతో కొన్ని నిమిషాల […]
Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ సందర్భంగా గాయపడడంతో రేపు జరగబోతున్న సెమీస్ మ్యాచ్ కి అందుబాటులో ఉంటాడా లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బలమైన ఇంగ్లాండ్ టీం తో టీమిండియా తలబడాలి అంటే కచ్చితంగా రోహిత్ శర్మ అంటే అనుభవం ఆటగాడు జట్టులో ఉండాలి. ఈ సమయంలో ఆయన గాయపడడం అభిమానులకు ఆందోళన కలిగించింది. అత్యంత కీలకమైన ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడకపోతే కచ్చితంగా ఇండియా కు నష్టం […]
Suryakumar Yadav : టీం ఇండియా యువ సంచలన సూర్య కుమార్ యాదవ్ ఈ మధ్య కాలంలో యమ జోరుగా ఆట ఆడుతూ అందరి ప్రశంసలు దక్కించుకుంటున్న విషయం తెల్సిందే. అద్భుతమైన సగటుతో ఈయన భారీ స్కోర్స్ చేస్తున్నాడు. ఇటీవల జింబాబ్వే మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ భారీ స్కోర్ ను చేయడం తో జట్టుకు విజయం దక్కింది. ఇంకా సూర్య కుమార్ యాదవ్ టీ20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడటం […]
India vs England : టీ20 వరల్డ్ కప్ లో టీం ఇండియా సెమీస్ కు చేరుకున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇంగ్లాండ్ తో ఈ నెల 10వ తారీకున సెమీస్ పోరు లో తలడబోతున్న విషయం తెల్సిందే. ఈ మ్యాచ్ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో సెమీస్ మ్యాచ్ కి ప్రముఖ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో లేక పోవడం చర్చనీయాంశంగా మారింది. 2014 నుండి ఈయన ఇండియా […]
Rohit Sharma : టీ20 వరల్డ్ కప్ లో టీం ఇండియా దూసుకు పోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సెమీస్ లో అడుగు పెట్టిన టీం ఇండియా సిరీస్ పై కన్ను వేసింది. రెండవ సారి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో జట్టు సీనియర్లు జూనియర్లకు ఎంతో ప్రోత్సాహంగా నిలుస్తున్నారట. ప్రతి ఒక్క ఆటగాడు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారట. ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక కథనం ప్రకారం విమాన ప్రయాణం […]