Telugu News » Tag » Sonia gandhi
Rahul Gandhi : కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా చెప్పుకోవచ్చు. కొన్నాళ్ళ క్రితం వరకూ ఆయనకు ఓ విదేశీ స్నేహితురాలు వుండేది. ఆమెతో రాహుల్ గాంధీ వివాహం జరుగుతుందంటూ ప్రచారం తెరపైకొచ్చింది. కానీ, రాహుల్ ఇప్పటికీ బ్రహ్మచారిగానే వుండిపోయారు. రాహుల్ పెళ్ళెప్పుడు.? అని తరచూ చర్చ జరుగుతుంటుంది. సల్మాన్ ఖాన్ తరహాలోనే రాహుల్ కూడా పెళ్ళి చేసుకునే ఆలోచన వున్నట్లు కనిపించరు. భార్య ఎలా వుండాలంటే.. తాజాగా తన భార్య ఎలా […]
MLA Umang Singhar : ఇప్పటికే పీకల్లోతు కష్టాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ మరింతగా ఇబ్బందులు పడే విధంగా ఆ పార్టీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఒక వైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీకి జీవం పోసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలోనే ఆ పార్టీ నాయకులు కొందరు పార్టీ యొక్క ప్రాణం తీసేలా వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమంగ్ సింఘార్ పై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేసింది. లైంగిక వేధింపుల […]
Mallikarjuna Kharge : ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడొచ్చాడు. తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇకపై సలహాలు, సూచనలకు మాత్రమే పరిమితమవుతారు. పార్టీ పరంగా పాలనా వ్యవహారాలన్నీ అధ్యక్షుడి హోదాలో మల్లికార్జున ఖర్గేనే చూసుకోవాల్సి వుంటుంది. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించినట్లుగానే మల్లికార్జున ఖర్గే గెలిచారు. నిజానికి, ఇవి నామమాత్రపు ఎన్నికలే అయితే, కాంగ్రెస్ పార్టీలో ఒకింత ప్రజాస్వామిక పద్ధతిలోనే అంతర్గత ఎన్నికలు జరగడం గమనార్హం. ఎవరు పోటీ చేయాలన్నదానిపై కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడింది. […]
Congress Party : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగబోతున్న విషయం తెల్సిందే. గాంధీ కుటుంబంకు చెందిన సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఈసారి ఎన్నిక పోటీలో నిలవడం లేదు. దాంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్లు ఆ పదవిపై మోజు పెంచుకున్నారు. ఇప్పటికే సోనియా గాంధీ ఆశీర్వాదం కోసం ప్రయత్నించారు. ఇప్పటికే అధ్యక్ష పదవికి శశి థరూర్ మరియు దిగ్విజయ్ సింగ్ లు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. […]
BJP Politics : గోవాలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ మార్కు రాజకీయాలు గోవాలో షురూ అయ్యాయ్. గోవాలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 20 సీట్లు గెలుచుకుంది. మెజార్టీకి ఒక్క సీటు తక్కువగా వుండడంతో విపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీకి ఆ ఎన్నికల్లో 11 సీట్లు దక్కాయి. మొత్తంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలలో 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు బీజేపీలో […]
Rahul Gandhi : కాంగ్రెస్ భావి ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పిలుచుకునే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, త్వరలో దేశవ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రను తొలుత అక్టోబర్ 2న ప్రారంభించాలని అనుకున్నా, దాన్ని సెప్టెంబర్ 7వ తేదీకి మార్చారు. ‘భారత్ జోడో’ పేరుతో ఈ పాదయాత్ర నిర్వహిస్తారు రాహుల్ గాంధీ. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీని దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ, తమ యువ నేత రాహుల్ గాంధీతో దేశ వ్యాప్తంగా […]
Sonia Gandhi : ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ మరోమారు కోవిడ్ బారిన పడ్డారు. ఆమెకు కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు పార్టీ సీనియర్ నేతల్లో ఒకరైన మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ వెల్లడించారు. ప్రస్తుతం సోనియా గాంధీ స్వల్ప అనారోగ్యంతో బాడపడుతున్నారనీ, హోం ఐసోలేషన్‌లో వున్నారనీ చెప్పారు జైరాం రమేష్. ఇటీవల సోనియా కుమార్తె, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. మూడు నెలల్లో రెండో […]
Revanth Reddy Vs Rajagopal Reddy : కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయనపై పలువురు కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పరోక్షంగా మండిపడ్డారు. డిష్యూం.. డిష్యూం తెలంగాణ కోసం కొట్లాడామని చెప్పుకునే కొందరు ముసుగువీరులు.. తమ ఆర్థిక లావాదేవీల కోసం, తమ అవసరాల కోసం మోదీ, అమిత్ షా […]
Revanth Reddy : తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ‘తల్లి’ సోనియా గాంధీకి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెన్నుపోటు పొడిచారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ కాస్సేపటి క్రితమే రాజగోపాల్ రెడ్డి ప్రకటన చేసిన విషయం విదితమే. రాజగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం ఈ అంశంపై మాట్లాడేందుకు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సోనియాగాంధీని ఈడీ వేధిస్తున్న సమయంలోనే బీజేపీతో రాజగోపాల్ […]
Adhir Ranjan Chowdhury : కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న విషయం విదితమే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ఉద్దేశించి ‘రాష్ట్రపత్ని’ అని ఆయన పేర్కొనడాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపడుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ నేతలు పార్లమెంటు వేదికగా చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. ‘నేను చేసిన వ్యాఖ్యలు పొరపాటే. అది మాట్లాడే సమయంలో దొర్లిన తప్పు తప్ప, ఉద్దేశ్య పూర్వకంగా రాష్ట్రపతిని రాష్ట్రపత్నిగా […]
Sonia Gandhi : నేషనల్ హెరాల్డ్ కేసులో ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ‘ఈడీ’ విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నిజానికి, ఈ వయసులో సోనియా గాంధీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనాల్సి రావడం ఒకింత ఇబ్బందికరం. గత కొంతకాలంగా సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అసలు పార్టీ పగ్గాల్ని భరించలేకపోతున్నారామె. కానీ, తప్పడంలేదు. రాహుల్ పార్టీ బాధ్యతల్ని తీసుకోకపోవడం, పార్టీని సమర్థవంతంగా నడిపేంత సీన్ ఇంకెవరికీ లేకపోవడంతో.. సోనియా అలా అలా […]
Sonia Gandhi : ఈడీ, సీబీఐ లాంటి విచారణ సంస్థల్ని ‘పంజరంలోని చిలక’తో న్యాయస్థానాలే గతంలో పోల్చిన విషయం అందరికీ గుర్తుండే వుంటుంది. అది కాంగ్రెస్ హయాంలోని పరిస్థితి. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏముంది.? ఏమీ లేదు. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి టీడీపీ నేతగా వున్న సమయంలో.. అదీ ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చేశాక.. ఆయన మీద సీబీఐ ఓ కన్నేసి వుంచిన సంగతి తెలిసిందే. టీడీపీ నుంచి బీజేపీలో సుజనా చౌదరి […]
Sonia Gandhi : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోమారు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి సమన్లు పంపింది. నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించి సోనియాగాంధీ సహా ఆమె తనయుడు రాహుల్ గాంధీ ఆరోపణలు ఎదుర్కొంటోన్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ ఇటీవల ఐదు రోజులపాటు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేశాయి. సోనియా గాంధీ కూడా అప్పుడే ఈడీ విచారణకు హాజరు కావాల్సి వుండగా, ఆమెకు అనారోగ్యం కారణంగా అది […]
Sonia Gandhi : కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీకి పర్సనల్ సెక్రటరీగా పనిచేసే పీపీ మాధవన్ అనే వ్యక్తి దళిత మహిళపై లైంగిక దాడి చేయగా, ఆయనపై రేప్ కేస్ ఫైల్ అయింది. 26ఏళ్ల యువతి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. యువతికి ఉద్యోగం ఇస్తానని నమ్మించి, వివాహం చేసుకుంటానని మాటిచ్చి మోసానికి పాల్పడ్డాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. రేప్ కేసు.. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఐపీసీలోని సెక్షన్‌లు 376, 506 […]
Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ తీవ్రమైన ఆరోపణల్ని, అభియోగాల్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈడీ దూకుడు పెంచింది. రాహుల్ గాంధీని ప్రత్యేకంగా విచారిస్తోంది. మరోపక్క, సోనియాగాంధీ అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతోందనీ, ఈ సమయంలో తాను ఆమెకు సహాయకారిగా వుండాలని చెబుతూ, రాహుల్ గాంధీ ఈడీ విచారణ నుంచి కొంత వెసులుబాటు పొందారు. మరోపక్క, […]