Telugu News » Tag » Revanth reddy
Revanth Reddy : ఒకవైపు తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా సాగుతూ రాజకీయ పార్టీలు ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి మేమే పోటీ అంటే మేము పోటీ అంటూ బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీల నాయకులు పోటా పోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ మరియు కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న ఈ సమయంలోనే […]
Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించి ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పాదయాత్ర నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ కొత్త ఇన్చార్జ్ మాణిక్ రావు థాక్రే ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. […]
Revanth Reddy : మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరం అవ్వబోతున్నాడు అనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కోమటిరెడ్డి మాట్లాడడం.. ఆయనకు పార్టీ అధినాయకత్వం షోకాజ్ నోటీసు పంపించడం కూడా అయింది. కోమటిరెడ్డి ప్రస్తుతం ఎంపీగా ఉన్న కారణంగా ఆయనని వదులుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. అందుకే ఆయన బుజ్జగించి పార్టీలో కొనసాగేలా చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బాధ్యతలు చేపట్టిన మాణిక్రావు […]
congress : తెలంగాణ కాంగ్రెస్ ను కాపాడుకునేందుకు అధినాయకత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ గా చేసినప్పటి నుండి కూడా ఆ పార్టీ సీనియర్ నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు. రేవంత్ రెడ్డి టీ పీసీసీ చీఫ్ గా ఎంపిక అవ్వడం లో కీలక పాత్ర పోషించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాకూర్ పై కూడా సీనియర్ లు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డికి మాణిక్యం ఠాకూర్ […]
Sunil Kanugoli : కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చే దిశగా వ్యూహకర్త సునీల్ కనుగోలుతో ఆ పార్టీ గతంలో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల సునీల్ కనుగోలుకి సైబర్ క్రైమ్ పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. ఆయన్ను అరెస్టు చేసేందుకు అధికార పార్టీ కుట్ర పన్నిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారానికి పాల్పడుతున్నారన్నది సునీల్ కనుగోలుపై వచ్చిన ప్రధాన ఆరోపణ. ఆరోపణల్ని ఖండించిన సునీల్ కొనుగోలు… […]
Revanth Reddy : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చుట్టూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లే నానా రచ్చా చేస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్ సహా, టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతల్ని ‘వలస నేతలు’గా కాంగ్రెస్ సీనియర్లు పిలవడం, కాంగ్రెస్ పార్టీలో పెను ప్రకంపనలకు కారణమయ్యింది. రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ పార్టీ నష్టపోయిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు చాలామందే వున్నారు. అందులో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు. […]
Revanth Reddy : రేవంత్ రెడ్డి పై తిరుగు బాటు జెండా ఎగరవేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు నాయకులు అంతా కూడా సైలెంట్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. అంతే కాకుండా మాణిక్యం ఠాకూర్ తొలగింపుకు సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోపోవడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నుండి తెలంగాణ పార్టీ సీనియర్ కాంగ్రెస్ నేతలకు స్పష్టమైన క్లారిటీ వచ్చేసింది. […]
Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై ఆ పార్టీ సీనియర్ నేతలు అసమ్మతి వ్యక్తం చేస్తూ పలువురు ముఖ్య నేతలు భేటీ అయిన విషయం తెలిసిందే. మరింత మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు నేడు సాయంత్రం జరగబోతున్న కీలక మీటింగ్ లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ మీటింగ్ లో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని, అసలైన కాంగ్రెస్ మాదే అంటూ సీనియర్లు ప్రకటించే అవకాశం […]
Revanth Reddy : తెలంగాణలో పాదయాత్రల సీజన్ కొనసాగుతోంది. వైఎస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పాదయాత్రకు ప్రస్తుతం ఆమె చిన్నపాటి విరామం ఇచ్చారు. ఇటీవల జరిగిన పలు అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో ఆమె తన పాదయాత్రకు చిన్న బ్రేక్ ఇచ్చారు. మరోపక్క, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. విడతల వారీగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది. రంగంలోకి […]
Revanth Reddy : ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానానికి పరిమితం కావలసి వస్తుందేమో అంటూ రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సమయంలో మరో వైపు ఆ పార్టీలో రాజకీయ ముసలం కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పటి నుండి కూడా కొందరు సీనియర్ నేతలు ఆయనకు సహకరించకుండా తమ మార్గంలో తాము అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తిరుగుబాటు జెండా […]
Revanth Reddy : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. విచారణ కు మీ నివాసంలో హాజరైన పర్వాలేదు.. ఢిల్లీకి వచ్చిన పర్వాలేదు అన్నట్లుగా సిబిఐ కవితకు ఆఫర్ ఇచ్చింది అంటూ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఎంతో మందిని విచారించిన సిబిఐ ఎందుకు సీఎం కూతురు కవితకి ఈ వెసులు బాటు ఇచ్చారు అంటూ రేవంత్ రెడ్డి […]
Revanth Reddy : తెలుగు రాష్ట్రాల్లో పాద యాత్రల సీజన్ మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే సంవత్సరం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఆ తదుపరి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల విపక్ష పార్టీల ముఖ్య నేతలు పాద యాత్రలు చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్లి సమస్యలను తెలుసుకుని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ […]
Congress : మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని కాదనుకుని, బీజేపీలోకి వెళ్ళి చేతులు కాల్చుకున్నారు. ‘కాంగ్రెస్ ఓడినందుకు బాధలేదు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయినందుకు పండగ చేసుకుంటున్న హస్తం నేతలు..’ అన్నట్లుంది పరిస్థితి. డబ్బు పంచలేదు.. ఇవి నిఖార్సయిన కాంగ్రెస్ […]
Rahul Gandhi : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాహుల్ గాంధీతో పాటు జాతీయ నాయకులు మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర అవ్వడంతో పార్టీ నాయకులు రాష్ట్ర నాయకులు కీలకంగా తీసుకున్నారు. రాహుల్ గాంధీ వద్ద మంచి పేరు దక్కించుకునేందుకు సాధ్యమైనంత ఎక్కువ జనాలను […]
Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేడు తెలంగాణలో ఎంటర్ అవ్వబోతుంది. మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా నది మీదుగా రాహుల్ గాంధీ తెలంగాణలో అడుగు పెట్టబోతున్నారు. అందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతున్నన్ని రోజులు రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలతో పాటు భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొనేలా ఇప్పటికే కార్యక్రమాలను రూపొందించారు. జిల్లాల నుండి […]