Telugu News » Tag » raghunandan rao
Telangana దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన నిన్న శనివారం బీజేపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థి కె.రత్నప్రభ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక బై ఎలక్షన్ లో తెలంగాణ ఉద్యమాన్ని మట్టికరిపించి జైశ్రీరామ్ నినాదాన్ని అక్కడి నుంచి తిరుపతి దాకా తీసుకొచ్చామని గర్వంగా చెప్పుకున్నారు. ఈ సమయంలో శాసన సభ్యుడు రఘనందనరావు ముఖ్య విషయాన్ని మర్చిపోయాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో […]
దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డిపై విమర్శలు చేసాడు. అయితే ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక లో బీజేపీ గెలుపు మొదలయ్యి హైదరాబాద్ లో సౌండ్ వినిపించిందని ఇక ఈ సౌండ్ ఇప్పుడు నాగార్జునసాగర్ వరకు వినిపించాలని చెప్పుకొచ్చాడు. అలాగే ఒక ముసలాయన నేను పుట్టింది కాంగ్రెసే.. పెరిగింది కాంగ్రెసే.. ఆఖరికి నేను చచ్చిన కూడా కాంగ్రెసే అని అంటున్నారని, భవిష్యత్ లో బీజేపీ పార్టీలో చేరితే బడతా పూజ […]
గుమ్మడి కాయంత ప్రతిభ ఉన్నా.. ఆవగింజంత అద`ష్టం ఉంటేనే కాలం కూడా కలిసొస్తుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి ఈ మాట సరిగ్గా సరిపోతుంది. లేకపోతే.. పదవి వచ్చి పట్టుమని పది నెలలు కూడా కాలేదు. అప్పుడే ఈయన తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ ని ఓ రేంజ్ లోకి ఎలా తీసుకెళ్లగలడు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజల్లో కొద్దోగొప్పో వ్యతిరేకత ఉంది. కానీ.. దాన్ని ఒడిసి పట్టుకోవటానికి బీజేపీకి ఇన్నాళ్లకు గానీ సరైన సమయం […]
తెలంగాణ దుబ్బాక ఎన్నికలో బలమైన తెరాస పార్టీని మట్టికరిపించి విజయం సాధించిన రఘునందన్ రావు గురించి తెలుగు రెండు రాష్ట్రాల్లో బాగా తెలుసు, ప్రస్తుతం అతను ఒక రకంగా తెలంగాణ పాలిటిక్స్ లో హీరో అనే చెప్పాలి. అలాంటి రఘునందన్ ఇప్పుడు తనమీద జరుగుతున్నా ట్రోల్ల్స్ విషయంలో ఆవేదన వ్యక్తం చేస్తూ, నన్ను తప్పుగా ట్రోల్ల్స్ చేయొద్దు అంటూ వేడుకుంటున్నాడు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా మాట్లాడుతూ తాను సైన్స్ టీచర్‌నని, ప్రకృతిని నమ్ముతానని, యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుందంటూ […]
జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం అట్టహాసంగా సాగుతుంది. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ లు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ప్రచారంలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా జోరుగా పాల్గొంటున్నాడు. ఇక ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ పథకంలో కేంద్రం వాటా ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇక ఆయన ప్రచారం చేస్తున్న ఏరియా కార్పొరేటర్ భవన ఫోటోను ప్రజలకు చూపిస్తూ.. ఈ భవనానికి జిహెచ్ఎంసీ అధికారులు ఎంత పన్నువేసారో […]
తెలంగాణాలో ఉత్కంఠంగా సాగిన దుబ్బాక ఉపఎన్నికల్లో ఎట్టకేలకు బీజేపీ విజయ ఢంకా మోగించింది. అయితే నువ్వానేనా అన్నట్లు పోటీ ఇచ్చారు టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు. అయితే మొదటి రౌండ్ నుండి ఆధిక్యంలో కొనసాగిన బీజేపీ, మధ్యలో కాస్త వెనుకకు తగ్గింది. ఇక ఆ తరువాత కొన్ని రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగడంతో ఇరు పార్టీల మధ్య ఉత్కంఠం మొదలయ్యింది. ఇక చివరి నిమిషం వరకు కూడా ఎవరు గెలుస్తారా అనే ఉత్కంఠ పోటీ ఏర్పడింది. ఇక ఎట్టకేలకు […]
తెలంగాణాలో ప్రస్తుతం దుబ్బాక ఉపఎన్నికల పోరు కొనసాగుతుంది. ప్రధాన పార్టీలు అన్ని కూడా ప్రచారంలో జోరుగా పాల్గొన్నాయి. అయితే నిన్నటితో ప్రచారానికి తెర పడింది. ఇక అన్ని పార్టీలు ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొని ముగించారు. ఇక బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలతో పాల్గొని ప్రచారాన్ని ముగించాడు. అయితే ఆఖరి రోజు ప్రచార కార్యక్రమంలో రఘునందన్ రావు మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధిలో అట్టడుగున ఉందని అన్నారు. సిద్ధిపేట, గజ్వెల్, […]
తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఉపఎన్నిక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై తీవ్రస్థాయిలో ఉత్తమ్ ఆరోపణలు చేశారు. ఒకవేళ రఘునందన్ గెలిస్తే వెంటనే టీఆర్ఎస్ లోకి వెళ్తారని జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఉత్తమ్ కూడా దుబ్బాకలోనే ఉన్నారు. ఉపఎన్నిక దృష్ట్యా కాంగ్రెస్ ముఖ్యులంతా దుబ్బాకలో మకాం వేశారు. ఎన్నికల ప్రచారం కూడా ముమ్మరంగా సాగుతోంది. అన్ని పార్టీలు నువ్వెంత అంటే నువ్వెంత అన్న రేంజ్ లో పోట్లాడుకుంటున్నాయి. దుబ్బాక […]
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మొత్తం చూపు, దుబ్బాక ఉప ఎన్నిక పైనే ఉంది. అయితే దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం కారణంగా అక్కడ మల్లి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే అన్ని పార్టీలనుండి అభ్యర్థులను ఖరారు చేసి, ప్రచారం కూడా సాగిస్తున్నారు. అయితే ఇప్పుడు అన్ని పార్టీలకు ఈ దుబ్బాక ఉప ఎన్నిక కీలక పరీక్షా కానుంది. దీనితో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇక ఒకవైపు ఎలాగైనా సిట్టింగ్ సీటు […]
తెలంగాణలో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరుగుతున్న ఏకైక స్థానం దుబ్బాకపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. హైదరాబాద్‌లో భారీ వర్షాలు వరదలతో ఈ ఎన్నికపై కాస్త హైప్ తగ్గినా ఇప్పుడు మళ్లీ అందరూ అటే చూస్తున్నారు. ఈ ఎన్నికలు రాష్ట్రంలో చాలా రాజకీయ మార్పులు తెచ్చే అవకాశం ఉండటమే అందుకు కారణం. ఈ ఒక్క స్థానం ఫలితంతో ఏం మారుతుంది అనేవాళ్లూ ఉన్నప్పటికీ సునిశితంగా పరిశీలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. అవేంటో ఒకసారి చూద్దాం. హరీషన్నకు అగ్ని […]