Telugu News » Tag » Network
అమరావతి: 2019 ఎన్నికల్లో జగన్ సాధించిన విజయం చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా పట్టించుకోకుండా పట్టుదలతో ప్రయత్నించి, చివరికి గెలిచి సీఎం పదవిని దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోని రాజంపాలెంలో వైసీపీ నాయకులు సీఎం జగన్ మోహన్ రెడ్డికి గుడి కట్టనున్నారు. ఈ గుడికి సంబంధించిన భూమి పూజను గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ నిర్వహించారు. మన దేశంలో ఇప్పటివరకు హీరోయిన్స్ ఖుష్భూ, ఇలియానా, నయనతార లాంటి వారికి కూడా […]
కరోనా కల్లోలం సృష్టిస్తుంది. పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా అన్ని చోట్ల విస్తరిస్తుంది. అయితే ఈ మహమ్మారి పెళ్లి జరగవలసిన ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే ఏపీ లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఓ యువకుడు కరోనా సోకి చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. అయితే బుధవారం ఆ యువకుడు పెళ్లిపీటలు ఎక్కావాల్సిన లోపే మరణించారు. ఆదోనిలోని 11వ వార్డుకు చెందిన 28 సంవత్సరాల వయస్సు గల యువకుడు గత నెల […]
తెలంగాణాలో పాత సచివాలయాన్ని కూల్చి కొత్త హంగులతో సచివాలయాన్ని నిర్మించాలి అని ఇప్పటికే పాత భవనాన్ని కూల్చివేసింది సర్కార్. అయితే తాజాగా కొత్త సచివాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. అయితే ఈ మొత్తాన్ని ఆర్అండ్ బి శాఖ ద్వారా విడుదల చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ఒకటి, రెండు రోజుల్లో అధికారులు టెండర్లకు నోటిఫికేషన్ కూడా వేయనున్నారు. అయితే కొత్తగా నిర్మించబోయే సచివాలయం తూర్పు దిక్కున అభిముఖంగా ఉండనుంది. […]
అమరావతి: కరోనాతో రాష్ట్రంలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్న తరుణంలో అక్టోబర్ 15 నుండి రాష్ట్రంలో కళాశాలలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఉన్నత విద్యపై ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ నెలలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి కావలసిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు. అక్రమాలకు పాల్పడే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని […]
ఏపీ రాజధానిని అమరావతి నుండి తొలగిస్తూ, రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు హయాంలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. రాజధానిని అమరావతి నుండి మార్చి తమకు అన్యాయం చేయవద్దని, మొదట అమరావతిని రాజధానిగా చేయడానికి ఒప్పుకున్న జగన్ ఇప్పుడు ఎందుకు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నార్తు. రాజధాని అంశంపై […]
అమరావతి: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో రాజధాని మార్పు పై రోజుకో అంశం బయటకు వస్తుంది. మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన తరువాత ఈ ప్రక్రియను తప్పు పడుతూ అమరావతి జేఏసీ నాయకులు రాష్ట్ర హై కోర్టును ఆశ్రయించారు. దీని పై స్పందించిన కోర్ట్ రాజధాని అంశం కేంద్ర పరిధిలోనిదా లేక రాష్ట్ర పరిధిలోనిదా తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ […]
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డి ఇకలేరు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి మృతి చెందిరు. అయితే 2004, 2008, 2014, 2019 ఎన్నికల్లో రామలింగారెడ్డి నాలుగు సార్లు దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే గా గెలిచారు. ఇక 2001 నుండి TRS అధినేత కేసీఆర్ తో కలసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. సోలిపేట రామలింగారెడ్డి సుమారు 25 ఏళ్ళు జర్నలిస్టుగా పనిచేసారు. అయితే 2004 […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మహిళల రక్షణకు సరైన చట్టాలు లేవని, వారి భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో ఒక ఎస్సీ మహిళను కొందరు దుండగులు ట్రాక్టర్లుతో తొక్కించి చంపడం దారుణమన్నారు. అలాగే కర్నూల్ జిల్లా వెలుగోడులో జరిగిన అత్యాచారం కేసులో ఎలాంటి పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై టీడీపీ నాయకుడు నారా లోకేష్ స్పందిస్తూ … […]
కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. అలాగే ఇండియాలో కూడా ఈ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తుంది. ఎలా అంటే రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా ఇండియాలో గత 24 గంటల్లో 52,509 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 19,08,254కి పెరిగి పోయింది. అలాగే గత 24 గంటల్లో దేశంలో 857 మంది ఈ మహమ్మారి బారిన పడి చనిపోయారు. ఇక మొత్తం మరణాల సంఖ్య 39,795కి చేరింది. గత […]
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాయలసీమ ఎత్తిపోతల ఉత్తర్వులు రద్దు చేయాలని, టెండరు ప్రక్రియ చేపట్టకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ విధానంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నీటిని అదనంగా తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తలపెట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సహా ఇతర […]
తెలంగాణ లో కరోనా కేసుల విస్తరణ రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. అయితే తాజాగా వైద్యారోగ్య శాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2012 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 13 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీనితో మొత్తం కేసులు సంఖ్య 70,958 కి చేరింది. జిల్లాల వారీగా కేసులు; జీహెచ్‌ఎంసీ – 532,రంగారెడ్డి – 188,మేడ్చల్ మల్కాజ్‌గిరి – 198,సంగారెడ్డి – 89,ఆదిలాబాద్ – […]
కరోనా మహమ్మారి తో ప్రతిఒక్కరు కూడా విషాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ మహమ్మారి దాటికి ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అయితే.. ఈ తిప్పలు ఇంకా ఎన్ని నాళ్ళు అని బాధపడుతున్నారు. అయితే న్యూయార్క్‌లోని బ్రూక్లేన్‌లో చోటుచేసుకున్న ఒక ఘటన గురించి తెలిస్తే తప్పకుండా కళ్ల నుండి నీరు వస్తాయి. వివరాల్లోకి వెళితే సెల్వియా (35) అనే మహిళ, బ్రూక్‌డాలే యూనివర్శిటీ హాస్పిటల్ మెడికల్ సెంటర్‌లో లేబర్ అండ్ డెలివరీ నర్సుగా పనిచేస్తోంది. అయితే […]
వాషింగ్ టన్: కరోనాపై పోరాటం చేయడంలో ఇండియా, చైనాల కంటే అమెరికా ఉత్తమంగా పోరాటం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కరోనా వల్ల ఎక్కువగా భాదింపబడ్డ దేశాల్లో అమెరికా కూడా ఒకటని, అయిన కూడా తిరిగి పుంజుకునే శక్తి తమకుందని ధీమా వ్యక్తం చేశారు. రోజు రోజుకు దేశంలో కొత్తగా నమోదు అవుతున్న కేసుల సంఖ్య తగ్గుతుందని వెల్లడించారు. అలాగే కరోనాకు సంబంధించిన వాక్సిన్ ను అమెరికానే కనిపెడ్తుందని ధీమా వ్యక్తం చేశారు. బయో […]
కరోనా మహమ్మారి ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ మహమ్మారి చిన్న, పెద్ద, పేద, ధనిక, కులం, మతం అని తేడా లేకుండా అందరికి సోకుతుంది. అయితే ఈ కరోనా వైరస్ మిగతా వారితో పోలిస్తే ఊబకాయం ఉన్న వ్యక్తులకు సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. మన శరీరంలో ఆకలిని నియంత్రించే హార్మోన్ లెప్టిన్. ఇక ఈ లెప్టిన్ హార్మోన్ శరీరంలో ఎక్కువగా ఉంది అంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాగే లెఫ్టిన్ హార్మోన్ ఉన్న […]
హైదరాబాద్: కరోనాతో ప్రపంచం మొత్తం విలవిలలాడుతున్న తరుణంలో ప్రజలు హాస్పిటల్స్ ను డేవాలయలుగా, డాక్టర్స్ ను దేవుళ్లుగా చూస్తున్నారు. అయితే కొంతమంది డాక్టర్స్ ఈ విపత్కర పరిస్థితిని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. దీని పై తెలంగాణ ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న హాస్పిటల్స్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఈ మాటలు హామీల వరకే పరిమితం అవుతాయని, ఆచరణలో సాధ్యం కావాని చాలామంది అనుకున్నారు. […]