కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస రావు అల్లుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. నిన్నరాత్రి ఎమ్మెల్యే ఇంటి పై ఆందోళన కారులు దాడులు చేశారు. శ్రీనివాసమూర్తి ఇంటితో పాటు డి.జే.హళ్లి ఠాణాపై రాళ్ల దాడి చేశారు. శ్రీనివాసమూర్తి ఇంటి వద్ద ఉన్న వాహనాలకు నిప్పు పెట్టారు. స్టేషన్ ఎదుట ఉన్న వాహనాలను తగులబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో 60 మంది వరకు పోలీసులు గాయపడ్డారు.ఆందోళనకారులను అదుపు చేసేందుకు లాఠీఛార్జి సహా, […]