Telugu News » Tag » kcr
Minister Indrakaran Reddy : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ మొత్తం లీకేజీ వెనుక అధికార పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారంటూ విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి మరియు బండి సంజయ్ ఇటీవల ఈ విషయమై మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ కి లీకేజీ వ్యవహారంలో హస్తం ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలిసే అన్ని జరుగుతున్నాయి అని కూడా వారు అనుమానం […]
YS Sharmila : కామారెడ్డి జిల్లాలోని నాగ మడుగు ఎత్తిపోతల పథకం ప్రారంభించిన సమయంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్‌టిపి అధ్యక్షురాలు షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పిట్లంలో పిట్టకథలు చెప్పిన పిట్టల దొరకొడకా కేటీఆర్ అంటూ షర్మిల తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను రోకలి బండతో కొట్టి చంపింది ఎవరు అంటూ ఆమె ప్రశ్నించింది. 33 ప్రాజెక్టులు నిర్మించి బీడు భూములకు నీళ్ళు అందించిన వైయస్సార్ ఎలా తెలంగాణను రోకలి బండతో కొట్టినట్లు […]
Kavitha – YS Avinash Reddy : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు లేకుండానే రాజకీయం వేడెక్కింది. ఒక వైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత ఈడీ విచారణకు హాజరు అవ్వనుండటంతో పాటు ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె అభిమానులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడంతో పాటు ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు షేర్ […]
Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను సొంత పార్టీ నేతల ఖండిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్ ఏర్పడడం ఖాయమని, కచ్చితంగా టిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు మరియు సీనియర్ రాజకీయ నాయకులు సీరియస్ గా తీసుకుంటున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమే అయి ఉంటాయి అంటూ భవిష్యత్తులో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ కలిసే […]
KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17వ తారీకున నూతన సచివాలయం ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే. అదే రోజున బీఆర్‌ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయబోతుంది. పార్టీ శ్రేణులు భారీ ఎత్తున బహిరంగ సభలో పాల్గొనేలా చేస్తున్నారు. తమిళ సీఎం స్టాలిన్.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. తేజస్వి యాదవ్ ఇంకా పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకులు బీఆర్‌ఎస్ పార్టీ యొక్క […]
Telangana : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు గవర్నర్ తమిళి సై ల మధ్య వివాదం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. బీజేపీ గవర్నర్ అంటూ బీఆర్‌ఎస్ నాయకులు ఆమెపై విమర్శలు చేస్తూ ఉంటే గవర్నర్ మాత్రం తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని.. రాజ్యాంగం రాష్ట్రంలో అమలు కావడం లేదంటూ విమర్శించింది. తన వద్ద ఇప్పటికే పలు బిల్లులను పెండింగ్ లో ఉంచిన గవర్నర్ తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా […]
KTR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకుగాను బీఆర్‌ఎస్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఏపీ నుండి పలువురు ముఖ్య నేతలు బీఆర్‌ఎస్ లో జాయిన్ అవుతున్నట్లుగా ప్రకటించారు. అంతే కాకుండా ఖమ్మంలో భారీ ఎత్తున బీఆర్‌ఎస్ సభను నిర్వహించడం జరిగింది. ఆ సభలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ కనిపించక పోవడం అందరిని ఆశ్చర్య పరిచింది. మొదటి నుండి కూడా కేటీఆర్ బీఆర్‌ఎస్ కి […]
KCR : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ని ఫిబ్రవరి లో రద్దు చేయబోతున్నట్లుగా బీజేపీ నాయకుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి జోష్యం చెప్పాడు. ఫిబ్రవరిలో అసెంబ్లీని రద్దు చేసి మే నెలలో ఎన్నికలకు కేసీఆర్ వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడంటూ రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నాడు. ఇప్పటికే కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఓటమి తధ్యం అని భావిస్తున్నాడు. ఇంకా ఆలస్యం అయితే దారుణమైన పరాభవం ఎదువుతుందనే ఉద్దేశ్యంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నాడు అంటూ రాజగోపాల్ […]
KCR : బీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ఇంకా పలువురు జాతీయ స్థాయి నాయకులు పాల్గొన్నారు. బహిరంగ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ ని పెద్దన్నగా పేర్కొన్నాడు. తమ అందరికీ కేసీఆర్ పెద్దన్న అన్నట్లుగా కేజ్రీవాల్ సంబోధించారు. […]
Shantikumari : తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి నియమితులయ్యారు. 1989 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన ఆమె గత కొన్నాళ్లుగా అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. అంతకు ముందు వైద్య ఆరోగ్యశాఖ యొక్క ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహించారు. కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో మెదక్ కలెక్టర్ గా పని చేసిన శాంతి కుమారి అప్పటి నుండి కూడా కేసీఆర్ కి సన్నిహితురాలుగా కొనసాగుతున్నారని రాజకీయ వర్గాల టాక్. […]
Bandi Sanjay : తెలంగాణ అసెంబ్లీ కి సాధారణంగా అయితే ఈ ఏడాది చివర్లో ఎన్నికలు రావాల్సింది. కానీ బండి సంజయ్ మాత్రం మరో ఐదు ఆరు నెలల్లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి అంటూ జోష్యం చెప్తున్నారు. తాజాగా ఆయన బూత్ కమిటీల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో బిజెపి విజయం సాధించడానికి పోలింగ్ బూత్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ […]
Viral News : బట్టతల ఉన్న వారిని సమాజం చిన్న చూపు చూస్తుందని, బయట ప్రపంచంలో వారిని అవమానిస్తూ ఉద్యోగాలు చేసుకోనివ్వడం లేదని బట్టతల బాధితుల సంఘం అధ్యక్షుడు వెల్ది బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బట్టతల బాధితులకు ప్రతి నెల రూ. 6000 పింఛన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. సమాజంలో బట్టతల బాధితులు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారని వారిని మానసిక వికలాంగుల కింద గుర్తించాలని ఆయన విజ్ఞప్తి […]
Telangana : తెలంగాణ రాష్ట్రానికి.. అందునా, గ్రేటర్ హైద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌కీ.. అదునా, కంటోన్మెంట్ మీదుగా రాకపోకలు సాగించే హైద్రాబాదీలకు కేంద్ర ప్రభుత్వం కొత్త సంవత్సరంలో తీపి కబురు అందించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో సాధారణ పౌరులు సంచరించేందుకు పరిమితులున్నాయి. కొన్ని చోట్ల అనుమతుల నిరాకరణ జరుగుతుంటుంది. ఆ ప్రాంతంపై పూర్తిగా కేంద్ర రక్షణ శాఖకే పూర్తి హక్కులున్నాయ్ ఇప్పటిదాకా. పెరుగుతున్న నగర జనాభా.. అదే పెద్ద సమస్య.. నగర జనాభా విపరీతంగా పెరుగుతోంది.. ఈ క్రమం […]
KCR : బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేనను దెబ్బ కొట్టేందుకు బీఆర్ఎస్‌లోకి చేరికల్ని కేసీయార్ ప్రోత్సహిస్తున్నట్లు విజయశాంతి ఆరోపించారు. ‘ఏపీలో జనసేనను, జనసేనతో సానుకూలమై వున్న బీజేపీని నష్టపరిచే ప్రయత్నం బీఆర్ఎస్ రూపంలో కేసీయార్ చేస్తున్నట్లు ఆ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేరికల పరిణామాలు సంకేతాలు ఇస్తున్నాయి..’ అని విజయశాంతి తన ట్వీట్ ద్వారా ఆరోపించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని […]
BRS : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ ని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రణాళిక రూపొందిస్తున్నారు. అందులో భాగంగా పక్క రాష్ట్రం ఏపీకి చెందిన పలువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మరియు మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ఇంకా పార్థసారథి తదితరులు నేడు కేసీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. కేసీఆర్ వారికి బీఆర్‌ఎస్ కండువా […]