Telugu News » Tag » K. Narayana
Narayana: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఒక విలక్షణమైన రాజకీయ నాయకుడు. ఎప్పుడూ ఏదో ఒక వెరైటీ పని చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ వయసులోనూ జిమ్ కి వెళ్లి ఎక్సర్ సైజ్ లు చేస్తుంటారు. ఒక కామ్రేడ్ అయుండి గుడికి వెళ్లి దేవుణ్ని దర్శించుకుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లోని లోటుపాట్ల పైనే కాకుండా తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో వంటి కార్యక్రమాల పైన కూడా విమర్శలు గుప్పిస్తుంటారు. […]
ఏ విషయంలోనూ ప్రత్యర్థులకు దొరకని వైఎస్ జగన్ ఒకేఒక్క విషయంలో మాత్రం తరచూ ప్రత్యర్థులకు చిక్కిపోతున్నారు. ఎక్కడైనా ఎవరికైనా సమాధానం చెప్పగల వైసీపీ నేతలు ఆ ఒక్క మ్యాటర్లో మాత్రం బిక్కమొహం వేస్తున్నారు. అదే ప్రధాని మోదీ. జగన్ సీఎం అయిన రోజు నుండి ప్రధానికి సమ్మతంగానే ఉంటూ వస్తున్నారు. అడుగడుగునా మోదీకి మద్దతు తెలుపుతూ ఆయన చల్లని చూపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఢిల్లీలో ఇచ్చే మద్దతు గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మోదీ అడగకుండానే అన్ని బిల్లులకు గ్రీన్ సిగ్నల్ వెళ్లిపోవడం వైసీపీ నేతలకు తప్పనిసరి కర్తవ్యం అయిపోయింది. […]
ఏపీలో కమ్యూనిస్టులు ఏనాడూ వంత పాడే రాజకీయాలు చేసింది లేదు. ప్రతి విషయంలోనూ వాళ్ళకంటూ ఒక సొంత నిర్ణయం ఉండేది. జనం తమను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సమస్యల పట్ల స్పందిస్తూ, అప్పుడప్పుడూ పోరాటాలు చేస్తూ వచ్చారు. కానీ ఏనాడూ తెరవెనుక రాజకీయ నడిపిన చరిత్ర లేదు వాళ్లకి. జనంలో పలుకుబడి లేకపోయినా నిజాయితీపరులనే పేరైతే ఉండేది. ఇప్పుడది కనుమరుగవుతోంది. ఎన్నడూలేని తరహాలో తోడు కోసం ప్రధాన పార్టీల అండ కోసం అర్రులు చాస్తున్నారు వాళ్ళు . ఒకరేమో తెలుగుదేశం టర్న్ తీసుకుంటే ఇంకొకరేమో వైసీపీకి వంతపడుతున్నారు. మొన్నటికి మొన్న సీపీఐ నారాయణగారు విశాకహాలో గీతం […]