హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాలలో బీజేపీ నాయకులు పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ప్రజల కష్టాలను తెలుసుకొని వాటి కోసం పొరడడంలో ముందుండాలని పార్టీ నేతలకు జేపీ సూచనలు చేశారు. పార్టీ కార్యాలయాలను కార్యకర్తలు వినియోగించుకోవాలని నడ్డా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేపీ రాష్ట్రంలో కరోనాపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, […]