Telugu News » Tag » JC Brothers
JC Brothers: జేసీ దివాకర్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని రాజకీయ నేత. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి మంత్రిగా పనిచేసిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత టీడీపికి పరిమితం అయ్యారు. అనంతపురం ఎంపీగా 2019 వరకు ఉన్న ఆయన.. ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్పి కుమారుడ్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఈయన మాత్రం అప్పుడప్పుడు మీడియాతో ముచ్చటిస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా జేసీ బ్రదర్స్ ముద్దుల మనవడు ధీర్ దివాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు […]
JC Diwakar Reddy : రాజకీయ రంగంలో సంచలనం జేసీ దివాకర్ రెడ్డి. ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ తెలీదు.. ఎవరికో కాదు ఆయనకు కూడా తెలీదు.. ఏపీ లో అత్యంత వివాదాస్పదమైన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది జేసీ అని చెప్పొచ్చు.. అయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పై సంచలన వ్యాఖ్యలు చేసిన దివాకర్ రెడ్డి సొంత పార్టీ పై, పార్టీ అధినేత అని చూడకుండా సెన్సేషనల్ కామెంట్స్ […]
ys jagan : మున్సిపల్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మొత్తం వైసీపీ దాదాపు క్లిన్ స్వీప్ చేసిందనే చెప్పాలి. ఎక్కడ టీడీపీ ఎదురునిలబడిన ఆనవాలు కనిపించలేదు. ఇంతటి వైసీపీ హావలో కూడా టీడీపీ తరుపున గెలిచి నిలిచిన మొనగాడు ఒకే ఒక్కడు జేసీ ప్రభాకర్ రెడ్డి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత దారుణమైన ఇబ్బందులను ఎదుర్కొన్న నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అనే చెప్పవచ్చు. ఆయన ఆర్థిక మూలాలు దెబ్బతీశారు. ట్రావెల్స్ వ్యాపారాన్ని పూర్తిగా దిగ్బంధించారు. […]
JC Brothers : జేసీ బ్రదర్స్ గురించి తెలియని వాళ్లు చాలా అరుదుగా ఉంటారనడంలో అతిశయోక్తిలేదు. సుదీర్ఘకాలంగా రాజకీయాలత అనుబంధం ఉన్న ఈ అన్నదమ్ములు. జేసీ బ్రదర్స్‌కు తాడిపత్రి నియోజకవర్గం ఎంత కంచుకోటో ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే 2014 ఎన్నికలకు ముందు వరకు ఇద్దరు కాంగ్రెస్ నుంచి తాడిపత్రిని ఏలారు. ఆ ఎన్నికల్లో వీరు టీడీపీలోకి వచ్చినా మళ్లీ తాడిపత్రిలో గెలిచి పట్టు నిలుపుకున్నారు. అయితే గత ఎన్నికల్లో పోటీకి ఈ ఇద్దరు […]
Chandra Babu అనంతపురంలో జేసీ సోదరుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా జేసీ దివాకర్ రెడ్డి ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం, సొంత పార్టీనా, పక్క పార్టీనా అనే తేడా లేకుండా నిక్కచ్చిగా తన అభిప్రాయాలను వెల్లడించే స్వభావం అయన సొంతం, ఆ వ్యవహార శైలినే ఇప్పుడు ఆయనకు అనేక ఇబ్బందులు తెచ్చిపెట్టింది అనే చెప్పాలి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ను టార్గెట్ చేసుకొని విమర్శలు చేసిన జేసీ ఇప్పుడు దానికి తగ్గ […]
ఏపీలో వైసీపీ, టీడీపీ పార్టీల మధ్య గ్రూపు రాజకీయాలు సహజంగానే సాగుతుంటాయి. ముఖ్యంగా అనంతపురం టీడీపీలో జేసీ ఫ్యామిలీ, పరిటాల ఫ్యామిలీల మధ్య పచ్చ గడ్డివేస్తే భగ్గుమనేలా ఉండేది. అయితే సందర్భం వచ్చినప్పుడు మాత్రం కలిసిమెలిసి ముందుకు సాగుతుంటారు. సాధ్యమైనంతవరకు ఎవ్వరి పని వారు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. అయితే తాజా రాజకీయ పరిమాణాల నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ జేసీ ఫ్యామిలీకి మద్దతుగా మాట్లాడరు. అయితే తాజాగా జేసీ పై జరిగిన దాడిని శ్రీరామ్ స్పందిస్తూ వైసీపీ […]
దీపక్ రెడ్డి తెలుసు కదా.. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి. తాజాగా ఆయన తాడిపత్రి ఘటనపై స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ అనేది ఉందా.. రౌడీల్లా ప్రవర్తించడం ఏంది.. అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పొలిటికల్ టెర్రరిజం అంటే ఏంటో ప్రభుత్వం చూపిస్తోంది. కేవలం టీడీపీని దెబ్బ తీయడం కోసం వైసీపీ పార్టీ చేయని అరాచకాలు లేవు. చంద్రబాబుపై కావాలని బురద జల్లుతున్నారు. టీడీపీ అడ్డు తొలగించుకొని విచ్చలవిడిగా […]
అనంతపురం జిల్లా తాడిపత్రి.. ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలతో ఎప్పుడూ వార్తలో ఉండేది. కానీ.. తర్వాత అక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు తగ్గిపోయాయి. తాడిపత్రి మొత్తం సైలెంట్ అయిపోయింది. కానీ.. మళ్లీ ఇప్పుడు అక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలయ్యాయా అని అనిపిస్తుంది ఈ ఘటన గురించి తెలిస్తే. అనంతపురం అంటేనే గుర్తొచ్చేది జేసీ బ్రదర్స్. వాళ్లకు అక్కడ ఉన్న ఫాలోయింగ్ అటువంటిది. కానీ.. 2019 లో ఎప్పుడైతే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారో.. అంతే.. జేసీ బ్రదర్స్ అన్నిరకాలుగా దివాళా […]
వదల బొమ్మాళీ వదల.. అన్నట్టుగా ఉంది ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ తీరు. ఎవ్వరినీ వదలడం లేదు. ఆరు నూరైనా.. నూరు ఆరైనా.. ఆయన టార్గెట్ లో ఉన్నవాళ్లపై నెమ్మదిగా ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం జగన్ టార్గెట్ మరెవరో కాదు జేసీ బ్రదర్స్. జేసీ బ్రదర్స్ అంటేనే జగన్ కు సుర్రుమంటుంది. వాళ్ల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. అంత వైరం ఉంది వాళ్ల మధ్య. వైఎస్ఆర్ బతికి ఉన్నప్పటి నుంచి వాళ్ల మధ్య గొడవలే. అవి […]
తెలుగు దేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని మైనింగ్ అధికారులు గుర్తించారు. త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ పేరిట జేసీ దివాకర్ రెడ్డి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ అధికారులు తనిఖీలలో తేలింది. అనంతపురం జిల్లా యాడికి మండలం కోనఉప్పలపాడు గ్రామంలో మొత్తం 14 లక్షల మెట్రిక్ టన్నుల దోపిడీ జరిగిందని అధికారులు కనుగొన్నారు. జేసీ దివాకర్ రెడ్డికి చెందిన త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ ముసుగులో విలువైన లైమ్ […]
ఇన్నాళ్లుగా అతి కష్టం మీద రాయలసీమలో పట్టు నిలుపుకుంటూ వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసింది. అధికారంలో ఉన్నా లేకున్నా ఇంతకు ముందు సీమలో టీడీపీకి ఒకే రకమైన పరిస్థితులు ఉండేవి. మహా అయితే సింగిల్ నెంబర్లోనే సీట్లు అటు ఇటు అవుతూ వచ్చేవి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవా మొదలైనప్పుడు సీమలో టీడీపీకి గడ్డు కాలం ఆరంభమైంది. కాకలు తిరిగిన నేతలను బరిలోకి దింపినా ఓటమే ఎదురయ్యేది. అలా దాదాపు పది పన్నెండేళ్ళు రాయలసీమలో పట్టు పెంచుకోవడానికి అల్లాడిన చంద్రబాబు చివరకి 2014 ఎన్నికలప్పుడు ఏదో కొంత ప్రభావం చూపగలిగారు. కానీ […]