Telugu News » Tag » #jansena
Andhrapradesh : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఇటీవల పార్టీ శ్రేణుల్ని, ముఖ్య నేతల్ని ఉద్దేశించి ‘త్యాగాలకు సిద్ధమవ్వాలి..’ అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. జనసేన అలాగే టీడీపీతో పొత్తు దిశగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. అయితే, అప్పుడే ఎన్నికల హంగామా కనిపిస్తోంది రాజకీయ వర్గాల్లో.! జనసేనతో పొత్తు దాదాపు ఖాయమైపోయిందని తెలుగు తమ్ముళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే జనసేనకు కేటాయించేది 25 నుంచి 30 అసెంబ్లీ నియోజకవర్గాలు […]
YS Jagan Mohan Reddy And Pawan Kalyan : ఎన్నడూ జరగని కలయిక అది. అదీ అత్యంత రహస్యంగా.. తాడేపల్లిలోని ఏపీ సీఎం జగన్ నివాసానికి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సీక్రెట్ గా వచ్చి కలిశారు. ఎందుకు కలిశాడు.. ఏంటి అన్నది ఎవ్వరికీ తెలియదు. అసలే వర్మ.. నిప్పు లేకున్నా పొగ రాజేసి అందరికీ కళ్ల మంట తెప్పించగలడు. ఆయన నోట్లో నోరు పెడితే మనకే కంపుకొడుతుంది. ప్రత్యర్థులను సోషల్ మీడియా ద్వారా చావు […]
Pawan Kalyan : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఓ సినిమా రాబోతోందిట.! 2024 ఎన్నికల సమయంలో సినిమాని విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారట. అయితే, ఇది ఆయన ఇమేజ్‌ని దారుణంగా దెబ్బ తీసే ఆలోచనతో తెరకెక్కనున్న సినిమా అట. గతంలో పవన్ కళ్యాణ్‌ని రాజకీయంగా దెబ్బతీసేందుకు ఓ సినిమా తీసిన దర్శకుడే, ఇప్పుడు మళ్ళీ అలాంటి ఇంకో సినిమాని తెరకెక్కించే బాధ్యతను భుజానికెత్తుకున్నాడట. పవన్ కళ్యాణ్‌తో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఓ […]
Pawan Kalyan: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి, ఆ సంస్థల డైరెక్టర్ వేమూరి కనకదుర్గ (63) ఇవాళ మంగళవారం ఉదయం కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కనకదుర్గ పార్థివ దేహానికి ఈ రోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం స్మశాన వాటికలో అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కనకదుర్గ మృతి పట్ల రాజకీయ, సినీ, పాత్రికేయ రంగాల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర […]
Janasena బీజేపీ–జనసేన పార్టీల మధ్య పొత్తు చిత్తు కాబోతోందా అంటే నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు అవును అనే అంటున్నాయి. నిన్న ఆదివారం హైదరాబాద్ లో పార్టీ ఆవిర్భావ సమావేశంలో అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ బీజేపీ తమ పట్ల వ్యవహరిస్తున్న అవమానకరమైన తీరును ఎండగట్టాడు. ఇవాళ సోమవారం ఏపీ బీజేపీ తమకు సహాయ నిరాకరణ చేయటాన్ని ఏపీ జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ పట్టిచూపాడు. అంతేకాదు. కమలనాథులతో కలిసి నడవాలా వద్దా అనే విషయంలో […]
Pawan Kalyan గ్రామాల్లో జరిగే పంచాయితీ ఎన్నికల్లో పార్టీలకు సంబధించిన గుర్తులు అంటూ ఏమి వుండవు, పార్టీల గుర్తుల మీద ఎన్నికలు జరిగితే గ్రామాల అభివృద్ధికి అడ్డం పడుతాయనే ఉద్దేశ్యంతో దానిని సవరణ చేయటం జరిగింది. కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో పార్టీలన్నీ కూడా అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులు గెలిచారని ఇన్ని స్థానాల్లో గెలిచారని హడవిడి చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే ఎన్నికల్లో 40 శాతం పైగా విజయాలు […]
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యాడు. తన అన్నయ్య మీద ఉన్న ప్రేమను తెలుపుతూ ఒక ప్రకటన చేసాడు . అయితే చిరంజీవికి తమ్ముడిగా పుట్టడం తన అదృష్టమని ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు పవన్. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అసామన్యుడిగా ఎదిగాడు. అలాగే ఎందరికో స్ఫూర్తి ప్రధాతగా నిలిచిన వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. అన్నయ్య చిరంజీవి చేయిపట్టి పెరిగానని, ఆయనే […]
ఏపీ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నేడు కొత్తగా 10,276మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే కరోనా బారిన పడి 97మంది మరణించారు. దీనితో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 3,45,216కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసులు.. జిల్లాల వారిగా.. అనంతపురంలో 1020చిత్తూరులో 1220ఈస్ట్ గోదావరిలో 1321గుంటూరులో 719కడపలో 539కృష్ణాలో 232కర్నూలులో 850నెల్లూరులో 943ప్రకాశంలో 693శ్రీకాకుంలో […]
టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో స్టార్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. అయితే విజయ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఫైటర్ ఈ విషయం అందరికి తెలిసిందే. తాజాగా విజయ్ దేవరకొండ, ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో ఓ సినిమా చేయనున్నాడనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు సుమారు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు విజయ్, ఇంద్రగంటి నుండి […]
హైదరాబాద్ లో సంచలనమైన కేసు నమోదు అయింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో తనపై 139 మంది అత్యాచారం చేశారని లెక్కపెట్టుకొని మరీ వారి పేర్లతో ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆమె 42 పేజీల FIR ను పోలీసులకు తెలిపింది. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లాకు చెందిన ఆమెకు మిర్యాలగూడకు చెందిన ఒక వ్యక్తితో 2009లో వివాహం అయింది. ఇక వివాహం అయిన ఏడాదికే విడాకులతో ఆ బంధం ముగిసింది. ఆ తరువాత పుట్టింట్లో ఉండగా […]
కరోనా వైరస్ దృష్ట్యా సినిమా థియేటర్లు అన్ని కూడా మూతపడ్డాయి. దీనితో సినిమాలు అన్ని కూడా ఓటిటి ఫ్లాట్ ఫర్మ్ ద్వారా విడుదల అవుతున్నాయి. తాజాగా స్టార్ హీరో సూర్య సినిమా కూడా ఓటీటీ రిలీజ్ కు సిద్ధం అవుతుంది. అయితే లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ సూరారయి పొట్టారు తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’. ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా కనిపించనుంది. ఇక ఈ సినిమా […]
విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలో గొప్ప పేరును సంపాదించుకున్న హీరో గా పేరును సంపాదించుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ముద్ర వేసుకున్నాడు. ఇక తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోగా మారిపోయాడు విజయ్. ఇక అదే తరుణంలో తరువాత వచ్చిన గీత గోవిందం కూడా మంచి హిట్ గా నిలిచిపోయింది. కానీ ఆ తరువాత వచ్చిన నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాలు ఊహించిన స్థాయిలో ఆదరించలేక పోయాయి. […]
కరోనా కారణంగా గణేష్ ఉత్సవాలు సాదా సీదాగా జరుగుతున్నాయి. దేశంలోనే అత్యంత పేరు గాంచిన ఖైరతాబాద్ మహా గణపతి ఈ ఏడాది 9 అడుగుల ఎత్తుకే పరిమితం అయ్యాడు. అయితే ఈ ఏడాది ధన్వంతరీ నారాయణ మహాగణపతి రూపంలో గణపయ్య భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. ఉదయం 10.30గంటలకు ఖైరతాబాద్ గణేషుడు తొలి పూజ అందుకున్నాడు. కరోనా నేపథ్యంలో భక్తులకు అనుమతి లేకున్నా దర్శనానికి వస్తున్నారు. ఇక ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి పూజలు జరుగుతున్నాయి. […]
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే ఈ వైరస్ ను నివారించేందుకు ప్రపంచ దేశాలలోని పరిశోధకులు అందరు కూడా వ్యాక్సిన్ కోసం కష్టపడుతున్నారు. తాజాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజెషన్ (డబ్ల్యూహెచ్‌వో) కీలక ప్రకటన చేసింది. అయితే ఈ కరోనా సంక్షోభం రెండు ఏళ్లలో ముగుస్తుంది అని డబ్ల్యూహెచ్‌వో అధ్యక్షుడు టెడ్రోస్ అథనమ్ గేబ్రియాసిస్ వెల్లడించారు. అయితే 1918 సంవత్సరంలో వచ్చిన స్పానిష్ ఫ్లూ కూడా అంతం అవ్వడానికి రెండేళ్ల సమయం పట్టిందని అన్నాడు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ […]
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ సంఘటన స్థలాన్ని పరిశీలించడానికి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి వెళ్తుండగా.. శ్రీశైలం మార్గమధ్యలోనే ఉప్పునుంతల పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ మల్లు రవిలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనితో శ్రీశైలం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం […]