Telugu News » Tag » High court
High Court Ruled Election Of MLA Vanama Venkateswara Rao Invalid : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావుకు గట్టి షాక్ తగిలింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కొత్తగూడెం నుంచి ఆయన గత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో బీఆర్ ఎస్ తరఫున పోటీ చేసిన జలగం వెంకట్ రావు ఓడిపోయారు. అప్పట్లో కాంగ్రెస్ తరఫున.. ఇక గెలిచిన తర్వాత వనమా […]
MP Avinash Reddy :మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని 31 తారీకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు జడ్జి సిబిఐ కి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పచ్చ మీడియా చర్చ కార్యక్రమంలో ఏకంగా హైకోర్టు జడ్జిపై ఆరోపణలు చేయడం జరిగింది. డబ్బు మూటలు తీసుకుని జడ్జిమెంట్ ఇస్తున్నారు అంటూ న్యాయ స్థానాలను మరియు జడ్జ్ ల మీద బహిరంగంగా ఆరోపణలు చేయడం జరిగింది. టీవీ చర్చలో పాల్గొన్న మాజీ జడ్జి రామకృష్ణ, […]
Karate Kalyani : ఖమ్మంలో ఏర్పాటు చేయబోతున్న సీనియర్ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై కొన్ని రోజులుగా వివాదం రాజుకుంటోంది. నటి కరాటే కల్యాణి ఈ విగ్రహ ఏర్పాటు మీద హిందూ సంఘాలతో ఆమె నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి రూపంలో ఎందుకు పెడుతున్నారు.. మామూలుగా పెడితే నాకు అభ్యంతరం లేదని ఆమె తెలుపుతున్నారు. ఇలా దేవుడి రూపంలో పెట్టడం వల్ల హిందువుల […]
Sr NTR : ఖమ్మం ట్యాంక్ బండ్ వద్ద రూ.4 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 28న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇంతలో కోర్టు ఈ విగ్రహ ఆవిష్కరణకు స్టే విధించింది. యాదవ సంఘం నాయకులు శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించవద్దంటూ కోర్టును ఆశ్రయించడం జరిగింది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పై అభ్యంతరాలు ఉన్న కారణంగా హైకోర్టు […]
High Court : నిజంగానే బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది.! తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తెరపైకొచ్చిన ‘ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారం’ కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు వేసిన పిటిషన్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీర్పు వెల్లడించిన న్యాయస్థానం, సీబీఐ విచారణకు ఆదేశించడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితిగా మారింది) ఎమ్మెల్యే పైలట్ […]
Ippatam Villagers : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కారణంగా ఇప్పటం గ్రామం వార్తల్లోకెక్కింది. ఈ గ్రామంలోనే జనసేన పార్టీ గతంలో పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించారు. ఆ సభ నిర్వహణ కోసం గ్రామస్తులు తమ భూముల్ని ఇచ్చారు. ఇందుకు కృతజ్ఞత చెబుతూ, 50 లక్షల రూపాయల్ని గ్రామాభివృద్ధి కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు కూడా. కాగా, గ్రామంలో రోడ్ల వెడల్పు నిమిత్తం అధికారులు కూల్చివేతలు చేపట్టగా, ఈ వ్యవహారం పెను రాజకీయ దుమారానికి […]
Bandi Sanjay : బీజేపీ తెలంగాణ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ నేటి నుంచి ప్రారంభించనుండగా, పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు నిన్న రాత్రి బండి సంజయ్‌ని అడ్డుకున్న సంగతి తెలిసిందే. భైంసా వెళ్ళేందుకు బండి సంజయ్ ప్రయత్నించగా, ఆయన్ని జగిత్యాల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇంట్లోంచి బయటకు వస్తే బండి సంజయ్‌ని అరెస్టు చేస్తామని ఈ రోజు ఉదయం కూడా […]
TRS MLAs : తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను తమవైపుకు తిప్పుకునేందుకు బీజేపీ తరఫున ప్రయత్నాలు చేసిన ఇద్దరు స్వామీజీలు ఓ వ్యాపారి తాజాగా అరెస్టయ్యారు. ఈ కేసులో తొలుత పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకోగా, ఏసీబీ కోర్టు.. వారి రిమాండ్‌ని తిరస్కరించింది. అయితే, సైబరాబాద్ పోలీస్ విభాగం, ఈ కేసులో హైకోర్టుని ఆశ్రయించడం గమనార్హం. హైకోర్టులోనూ తొలుత నిందితులకు కొంత అనుకూల పరిస్థితి కనిపించింది. ఇంతలోనే సీన్ మారింది. సైబరాబాద్ పోలీసుల వాదనలతో […]
Police Department : న్యాయస్థానాల్లో పోలీస్ వ్యవస్థకు పదే పదే ఎదురు దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి.? విపక్షాలు అతి తెలివి ప్రదర్శిస్తున్నాయా.? ప్రభుత్వాన్ని నడిపేవారు పోలీసు వ్యవస్థను అడ్డగోలుగా వాడుతుండడం వల్లే ఈ పరిస్థితా.? తెలంగాణలో ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో పోలీస్ శాఖ అత్యుత్సాహంపై హైకోర్టులో అక్షింతలు పడ్డాయంటూ పెద్దయెత్తున దుమారం చెలరేగుతోంది. నిందితుల రిమాండ్‌ని ఏసీబీ కోర్టు తిరస్కరించింది. హైకోర్టు కూడా పోలీసుల వాదనను తాజాగా తోసిపుచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాదు.. గత మూడేళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌లో […]
BJP : తెలంగాణ రాస్ట్ర సమితి ఎమ్మెల్యేలు నలుగుర్ని భారతీయ జనతా పార్టీ కొనుగోలు చేసేందుకు యత్నించిందంటూ తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం చెలరేగుతోన్న సంగతి తెలిసిందే. ‘సెకెండ్ హ్యాండ్ ఎమ్మెల్యేలను బీజేపీ పట్టించుకోదు. ఎవరైనా బీజేపీలోకి రావాలంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి. అలాంటప్పుడు, మేమెందుకు ఎమ్మెల్యేలను కొంటాం..’ అని బీజేపీ నేత, ఎంపీ ధర్మపురి అరవింత్ తెగేసి చెబుతున్నారు. ఇదంతా టీఆర్ఎస్ ఆడుతోన్న డ్రామా అనీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్‌లో, టీఆర్ఎస్ సానుభూతిపరులైన […]
Minister Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతానికైతే అమరావతి మాత్రమే రాజధాని. వైసీపీ చెబుతున్నట్లు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అన్న కోణంలో చూసినా, అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతిలో ఇల్లు కట్టుకున్నారు, అక్కడి నుంచే పరిపాలన కూడా సాగిస్తున్నారు. శాసనసభ, హైకోర్టు, సెక్రెటేరియట్.. అన్నీ అమరావతిలోనే వున్నాయి. అమరావతి కాకుండా ప్రస్తుతం రాష్ట్రానికి ఇంకో రాజధాని వుందని ఎలా చెప్పగలం.? కానీ, మంత్రి బొత్స […]
Telangana Rashtra Samiti : తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ‘ఎన్నికల గుర్తు’ విషయంలో ప్రతిసారీ ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో వున్నప్పుడు, టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు అయిన ‘కారు’ని పోలిన కొన్ని గుర్తుల కారణంగా నష్టపోతున్నామని గులాబీ నేతలు చెబుతూ వస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఈ విషయమై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి ఫిర్యాదు చేసింది. అయితే, స్వతంత్ర అభ్యర్థులకు కేంద్ర ఎన్నికల సంఘం, […]
Bigg Boss : బిగ్ బాస్ రియాల్టీ షోని బ్యాన్ చేయాలంటూ ఏపీ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. రియాల్టీ షో ముసుగులో అసభ్య కార్యకలాపాలు జరుగుతున్నాయనీ, అత్యంత జుగుప్సాకరంగా ఆ షో నడుస్తోందని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా, ఈ షోకి సంబంధించి కొన్ని ఎపిసోడ్ల వీక్షణకు హైకోర్టు ధర్మాసనం సమాయత్తమవుతోంది. అసభ్యత వుందా..? […]
YS Jagan Mohan Reddy: మాట తప్పేది లే… మడమ తిప్పేదే లే.! ఇవన్నీ మాటలకే పరిమితం. చేతల్లో అంతా రివర్స్. సీపీఎస్ రద్దు.. అని మాట ఇవ్వడం, ఆ మాట తప్పడం.! మద్యపాన నిషేధమని చెప్పడం.. తూచ్.. అలా తమ మేనిఫెస్టోలో చెప్పలేని బుకాయించడం.! ఇది కదా వైసీపీ అంటే.! ఆఖరికి వైసీపీ శాశ్వత అధ్యక్ష పదవి విషయంలో కూడా మాట తప్పుడే.. మడమ తిప్పుడే.! ఇటీవల వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లోనే […]
దిగ్గజ నటుడు, నడిగర్ తిలకం శివాజీ గణేశన్ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. ఎన్నో అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించాడు. అయితే ఆయన మరణించిన రెండు దశాబ్దాల తర్వాత కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. తన తండ్రి ఆస్తిలో తనకు వాటా ఇవ్వలేదంటూ నటుడు ప్రభు, నటుడు, నిర్మాత రామ్‌కుమార్ లపై తోబుట్టువులు శాంతి, రాజ్వీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. లుకలుకలు.. శివాజీ గణేశన్ తరువాత ఆయన ఫ్యామిలీ నుంచి ప్రభు హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం […]