Srivari Brahmotsavam : తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావటంతో, ఇవి ‘బ్రహ్మోత్సవాలు’ అయ్యాయని అంటారు.తొమ్మిది రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి బ్రహ్మోత్సవాలు అయ్యాయి. ముస్తాబైన తిరుమల.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పవిత్ర తిరుమల ముస్తాబవుతోంది. ఈ నెల 27, మంగళవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజులపాటు ఈ బ్రహ్మోత్సవాలు […]