Telugu News » Tag » GHMC elections
నిన్న మొన్నటి వారు తెలంగాణలో టి.ఆర్.ఎస్ పార్టీకి పోటీయే లేదు. బీజేపీ, కాంగ్రెస్ పరిస్థితి నామ మాత్రంగానే ఉంటూ వచ్చింది. అయితే.., దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు టి.ఆర్.ఎస్ కి గడ్డు కాలం నడుస్తోంది. దేశంలో ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేస్తూ వస్తున్న బీజేపీ ఇప్పుడు తెలంగాణలో మకాం వేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పై ప్రజలు నమ్మకం కోల్పోయారు. ఇలాంటి సమయంలో బీజేపీ మాత్రమే ఓటర్ కి […]
జిహెచ్ఎంసి ఎన్నికల్లో భాగంగా 150 డివిజన్లకు గాను 149 డివిజన్లలో ఫలితాలు వెలువడ్డాయి. ఒక్క నేరడమేట్ డివిజన్ ఫలితాల లెక్కింపు ఆగిపోయింది. అయితే ఈ డివిజన్ లో చాలా వరకు ఓట్లు పాడయ్యాయి. దీనితో ఈ సమస్య కోర్టుకు వెళ్ళింది. ఇక ఎట్టకేలకు నెరేడమెట్ ఫలితాలు కూడా వచ్చేసాయి. ఇక ఈ డివిజన్ లో బీజేపీ అభ్యర్థి మీద టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందింది. దీనితో ఓటమి చెందిన బీజేపీ అభ్యర్థి కన్నీరుమున్నీరయ్యారు. తనకు అన్యాయం జరిగిందని, పాడైన […]
జిహెచ్ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి నుండి పోటీ చేసి ఓటమి చెందిన అభ్యర్థులతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇక ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ప్రతిఒక్క నాయకుడికి అండగా ఉంటానని చెప్పుకొచ్చాడు. అలాగే ఎన్నికల ప్రచారంలో అంతమంది కనిపించిన తీరా పోలింగ్ సెంటర్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడలేదని పేర్కొన్నారు. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఎవ్వరు ఉపయోగించుకోలేదని అన్నారు. ఓటమి […]
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పాతిక డివిజన్లు గెలిస్తే బీజేపీ ఘన విజయం సాధించినట్లే అని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కేవలం నాలుగంటే నాలుగే డివిజన్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి ఏకంగా 48 డివిజన్లను గెలుచుకుంది. టీఆర్‌ఎస్ పార్టీకి గత ఎన్నికల్లో 99 డివిజన్లు వస్తే ఈసారి 55 కు ఆ పార్టీని పరిమితం చేయడంలో బీజేపీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో రెండవ స్థానంలో బీజేపీ నిలవడంలో పలువురు ముఖ్య నాయకుల […]
జిహెచ్ఎంసి ఎన్నికల తంతు ముగిసింది. మేయర్ బరిలో మేము అంటే మేము అని కొట్టుకున్న పార్టీలు ఇప్పుడు చల్లబడ్డాయి. ఏ పార్టీ కి స్ప్రష్టమైన మెజారిటీ ఇవ్వకుండా ఓటర్లు తెలంగాణ రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చాయి. ఇక ఇప్పుడు ప్రధానంగా మూడు పార్టీలు ఎవరితో ఎవరు కలుస్తారు అనేది తెలియకుండా వుంది. టిఆర్‌ఎస్ 55 సీట్లు గెలుచువుకోని చావు తప్పి కన్ను లొట్టపోగా, బిజేపి పార్టీ 4 సీట్ల నుండి 48 సీట్లు గెలిచి విజయడంకా మోగించింది. […]
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు చాలా కారణాలు ఉన్నాయి. కాని అవి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పని చేయవు అని అంతా అనుకున్నారు. కాని దుబ్బాక ఎన్నికల్లో విజయాన్ని చూపించి బీజేపీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకుంది. మేయర్ పీఠం దక్కించుకోలేకున్నా కూడా రెండవ అతి పెద్ద పార్టీగా నిలవడం వల్ల నైతికంగా అయితే ఘన విజయం సాధించినట్లే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక బాధ్యతను హరీష్ రావు […]
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ తప్ప మరే పార్టీకి అవకాశం లేదు అనుకుంటూ ఉండగా అనూహ్యంగా మొన్నటి దుబ్బాక ఎన్నికల్లో మరియు నిన్నటి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బ్యాక్ టు బ్యాక్ బీజేపీ షాక్ ల మీద షాక్ లు ఇచ్చింది. ఈ రెండు షాక్ లతో టీఆర్‌ఎస్‌లో అంతర్మధనం మొదలు అయ్యింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హడావుడి మొదలు అయినట్లుగా అనిపిస్తుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగిశాయో లేదో మళ్లీ నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక […]
గ్రేటర్ ఎన్నికల్లో తెరాస పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. గతంలో కేవలం 4 స్థానాల్లో మాత్రం గెలిచిన బీజేపీ పార్టీ ఈసారి ఏకంగా 50 స్థానాల దగ్గరకు రావటం అనేది మాములు విషయం కాదు. ముఖ్యంగా తెరాస వ్యతిరేక వర్గాలు మొత్తం ఏకధాటిగా బీజేపీకి మద్దతు ఇచ్చాయి. అదే సమయంలో గ్రేటర్ లోని కాంగ్రెస్ ఓటింగ్ దాదాపుగా బీజేపీ కి మళ్లినట్లు సృష్టంగా తెలుస్తుంది. మొదటి నుండి బీజేపీ పార్టీ మేయర్ పీఠాన్ని తామే సాధిస్తామని […]
గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఇందులో కోసం మొత్తం 30 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసారు, ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్ట్ లను బట్టి 150 టేబుల్స్ దాక ఏర్పాటు చేయటం జరిగింది. కౌంటింగ్ లో మొదటిగా బ్యాలెట్ ఓట్లను లెక్కించటం జరుగుతుంది. అయితే ఈ బ్యాలెట్ ఓట్లు విషయంలో హైకోర్టు ఎన్నికల సంఘానికి పెద్ద షాక్ ఇచ్చింది. నిన్న రాత్రి ఎన్నికల సంఘం నుండి […]
హోరా హోరీగా జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఓటర్లు మాత్రం లైట్ తీసుకున్నట్లుగా అనిపించింది. మద్యాహ్నం వరకు పోలింగ్ శాతం చూస్తే కనీసం 40 శాతం అయినా చేరుతుందా అనే అనుమానం వ్యక్తం అయ్యింది. ఓటింగ్ సమయం ముగిసే సమయంకు 40 శాతం నమోదు అయితేనే చాలా గొప్ప విషయంగా మద్యాహ్నం వరకు అనుకున్నారు. కాని అనూహ్యంగా చివరి గంటలో ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. చివరి గంటలో ఏకంగా 10 శాతం ఓటింగ్ పెరిగింది. ఈ లెక్క […]
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్ల ఫలితాలు ఎలా వచ్చినా కూడా టీఆర్‌ఎస్ అధినేత కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. హైదరాబాద్‌లోని ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ అభ్యర్థులకు సహకరించకుండా వారి ఓటమి కోసం పని చేశారు అంటున్నారు. మంత్రులకు కూడా ఇచ్చిన బాధ్యత సరిగా నిర్వర్తించడంలో విఫలం అయ్యారు అనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎవరిని కూడా విడిచి పెట్టవద్దంటూ కేసీఆర్ మరియు కేటీఆర్ ఉన్నారట. ఎమ్మెల్యేలకు అప్పగించిన డివిజన్ల విషయంలో కొన్ని విమర్శలు ఉన్నాయి. అక్కడ […]
గ్రేటర్ ఎన్నికలు ఎంత హోరాహోరీగా జరిగాయో అందరికి తెలిసిన విషయమే, ఈ ఎన్నికల్లో 46. 55 శాతం పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో కంటే 0. 30 శాతం ఎక్కువ అనే చెప్పాలి. గ్రేటర్ ఎన్నికల్లో ఒక రకంగా ఇదే అత్యధికం. మరోవైపు వర్క్ ఫ్రం హోం ఎఫెక్ట్.. వరుస సెలవులు.. అన్నింటికీ మించి.. ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపని మున్సిపల్ ఎన్నిక., అయినప్పటికీ.. ఓటర్లు… 46 శాతానికిపైగా ఓట్లేశారంటే.. మరీ తీసి కట్టేం […]
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నాలుగు ప్రధాన పార్టీలైన టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీచేశాయి. ఐతే బీజేపీ మరియు టీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెప్పేశారు. ఓల్డ్ మలక్ పెట్ లో పార్టీ గుర్తులు తారుమారు కావడంతో రీపోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా జరిగి ఉండకపోతే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యేవి. ఈ పోల్స్ ఫలితాలు అటూఇటూ అయినా ఎవరు గెలుస్తారనే దానిపై ఒక క్లారిటీ వచ్చేది. ప్రస్తుతం […]
గ్రేటర్ ఎన్నికల నోఫికేషన్ విడుదల కావటమే ఒక సంచలనం, ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించారేమో అనే అనుమానాలున్న సమయంలో ఒక్కసారిగా తెరమీదకు వచ్చిన గ్రేటర్ ఎన్నికలు కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే నామినేషన్స్, ప్రచారం,పోలింగ్, కౌంటింగ్ షెడ్యూల్ ప్రకటించి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత నుండి గ్రేటర్ పరిధిలో ప్రతి ఒక్క విషయం కూడా సంచలనమే అవుతుంది. ఇక్కడ జరుగుతున్నాయి మున్సిపల్ ఎన్నికల లేక పార్లమెంట్ స్థాయి ఎన్నికల అన్నట్లు జరిగాయి. ఢిల్లీ స్థాయి నేతలు ఇక్కడ గల్లీలోప్రచారం […]
గ్రేటర్ ఎన్నికల పోరులో కీలకమైన పోలింగ్ ఈ రోజు దాదాపుగా ప్రశాంతంగా ముగిసిపోయిందనే చెప్పాలి. అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు తప్పితే అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సమయంలో ఎలాంటి అల్లర్లు, అవాంతరాలు లేకుండా పూర్తి అయ్యాయి. ఎన్నికల గెలుపు కోసం పోటీపడుతున్న ప్రధాన పార్టీలు రాజకీయ పరంగా రెచ్చకొట్టే విధంగా అనేక వ్యాఖ్యలు చేయటం, రెండు పార్టీలు కేవలం మతం కార్డును ఉపయోగించుకొని ఎన్నికల్లో ఓట్లు అడగటం వంటివి జరగటంతో పోలింగ్ రోజు అనేక అల్లర్లు జరిగే […]