Telugu News » Tag » GHMC
Anupama Parameswaran : మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తెలుగులో మంచి చిత్రాలు చేసి అశేష ప్రేక్షకాదరణ పొందింది ఈ ముద్దుగుమ్మ. అఆ, శతమానం భవతి, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే, తేజ్, కృష్ణార్జున యుద్ధం, రాక్షసుడు వంటి సినిమాల్లో నటించారు. ఎప్పుడూ పద్దతిగా ఉండే అనుపమ.. ఈ ఏడాది ఆరంభంలో దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి హీరోగా వచ్చిన రౌడీ బాయ్స్ సినిమాలో రెచ్చిపోయారు. […]
Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10 రాత్రి స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తుండగా, ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయన తీవ్రగాయాలు అయ్యాయి. నగరంలోని కేబుల్ బ్రిడ్జ్-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మెడికవర్‌లో ప్రాథమికి చికిత్స అనంతరం ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు. సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వెంటిలేటర్ అవసరం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతానికి ఐసీయూలోనే అతడికి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన చికత్సకు […]
GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని లింగోజిగూడ డివిజన్ కి జరిగిన ఉపఎన్నికలో ఎవరూ ఊహించనివిధంగా కాంగ్రెస్ పార్టీ క్యాండేట్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గెలిచారు. దీంతో కమలనాథులు కంగుతిన్నారు. కాషాయం పార్టీ ఈ ఓటమిని కొనితెచ్చుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లింగోజిగూడ వ్యవహారం తెలంగాణ బీజేపీలో కొద్ది రోజులుగా కలకలం రేపుతోంది. 2020 డిసెంబర్ లో జరిగిన బల్దియా ఎన్నికల్లో ఈ డివిజన్ నుంచి బీజేపీ అభ్యర్థి ఆకుల రమేష్ గౌడ్ విజయం సాధించినా.. […]
Hyderabad : హైదరాబాద్ మహానగరాన్ని కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవటం కోసం బల్దియా యంత్రాంగం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రోడ్ల మీది చెత్తను తొలగించటం ప్రారంభించింది. దీంతోపాటు సిటీవ్యాప్తంగా సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. ఫాగింగ్ కూడా చేపట్టారు. మరోవైపు జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ సేవలని మళ్లీ ప్రారంభించారు. రెండు నంబర్లను (9154686549, 58) రోజులో 24 గంటల పాటు అందుబాటులో ఉంచారు. కరోనాకి సంబంధించిన ఎలాంటి సమాచారం, సహాయం కావాలన్నా వీటికి […]
JanaSena : తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికలో జనసేన పార్టీ పోటీలో లేకపోవటం, అది ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్డ్ పార్టీయే తప్ప రికగ్నైజ్డ్ పార్టీ కాకపోవటంతో దాని కామన్ ఎలక్షన్ సింబల్ అయిన గాజు గ్లాసును నవతరం పార్టీకి కేటాయించారు. దీంతో బీజేపీ-జనసేన కూటమి కంగుతింది. పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి తమకి పడాల్సిన ఓట్లను కోల్పోవాల్సి వస్తుందంటూ కమలనాథులు ఫీలయ్యారు. అయితే జనసేన పార్టీకి ఇదే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ ఎదురైంది. […]
Bandi Sanjay బండి సంజయ్ కుమార్ బీజేపీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. దుబ్బాక, బల్దియాల్లో పార్టీని గెలిపించి ఒక వెలుగు వెలిగారు. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయేసరికి ఆయన్ని ఎవరూ పట్టించుకుంటున్నట్లు లేరు. చివరికి అదే బల్దియాలోని ఒక కార్పొరేటర్ స్థాయి లీడర్ కూడా బండి సంజయ్ ని దేఖట్లేదని నిన్న జరిగిన ఓ సంఘటనను బట్టి అర్థంచేసుకోవచ్చు. మామూలుగా కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రాంచందర్ రావు తదితరుల బ్యాచ్ ఎలాగూ బండిని పెద్దగా పరిగణనలోకి […]
BJP-TRS : తెల్లారితే శనివారం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లో శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనుండగా ఈరోజు శుక్రవారం రాత్రి తెలంగాణ బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపటం ఏంటి అనుకుంటున్నారా?. ఇది నిజమే. ఫేక్ న్యూస్ కాదు. గులాబీ పార్టీని గుండెలకు హత్తుకొని మెచ్చుకోవాల్సిన వార్త. రాజకీయం అంటే పరస్పరం తిట్టుకోవటం కాదు. సున్నితాంశాల్లో సరైన, సానుకూల నిర్ణయం తీసుకోవటం కూడా అని కారు పార్టీ […]
Telangana తెలంగాణలో ఒక వైపు నాగార్జునసాగర్ శాసన సభ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారానికి ఈరోజు గురువారంతో గడువు ముగుస్తుండగా ఇంకో వైపు రాష్ట్రంలో మరో భారీ రాజకీయ సమరానికి తెర లేచింది. దీన్నే మనీ పురపాలక పోరుగా కూడా పేర్కొనొచ్చు. 2 (గ్రేటర్ వరంగల్, ఖమ్మం) మున్సిపల్ కార్పొరేషన్లు, 5 (సిద్ధిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్) మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ఈరోజు మధ్యాహ్నం నోటిఫికేషన్ విడుదలైంది. దీని ప్రకారం రేపు శుక్రవారం నుంచి ఈ […]
GHMC : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేష్(జీహెచ్ఎంసీ) తన పేరును సార్థకం చేసుకుంది. నిజంగా ‘‘గ్రేటర్’’ హైదరాబాద్ అని నిరూపించుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకం అమలులో దేశంలోనే నంబర్ వన్ ప్లేసును ఆక్రమించింది. గతేడాది కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే కదా. దీంతో నగరాల్లోని ప్రజలందరి మాదిరిగానే వీధి, చిరు వ్యాపారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో వాళ్లను ఆర్థికంగా కాస్త ఆదుకోవటం కోసం మోడీ […]
కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు వివాదాలు కొత్తేమి కాదు. గతంలో ఎన్నో వివాదాల మధ్య నలిగిన మోహన్ బాబు తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు . గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నిబంధనలు ఉల్లంఘించడంతో ఆయనకు లక్ష రూపాయల జరిమానా విధించారు. ఈ విషయం తెలుసుకున్న మోహన్ బాబు కుటుంబం షాక్‌కు గురైనట్టు తెలుస్తుంది. వివరాలలోకి వెళితే మోహన్ బాబు కొంత కాలం క్రితం ఫిలింనగర్‌లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న బస్టాప్ ఎదురు […]
రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్న పేరు. ఆ పార్టీ.. ఈ పార్టీ అని కాకుండా.. ఏ పార్టీలోనైనా సరే.. రేవంత్ రెడ్డి పేరే వినిపిస్తోంది. ఆయన పేరుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. ఓవైపు టీఆర్ఎస్ కు మరోవైపు బీజేపీకి.. ఇంకోవైపు కాంగ్రెస్ లోకి సీనియర్ లీడర్లకు రేవంత్ కంటగింపుగా మారారు. నిజానికి.. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో ఇంకా బతికే ఉంది అంటే దానికి కారణం ముమ్మాటికీ రేవంత్ రెడ్డి. ఆయనే లేకపోయి […]
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా మలుపుతిరగనున్నాయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ రోజు చేసిన ప్రకటన వింటే ఎవరికైనా అదే అనిపిస్తుంది. ఆయన నాయకత్వంలో పలువురు బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు శుక్రవారం గవర్నర్ తమిళిసై సుందరరాజన్ ను కలిశారు. అనంతరం బండి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చేతిలో కీలుబొమ్మ.. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నూతన కౌన్సిల్ ఏర్పాటుచేయాలని […]
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏ రాష్ట్రంలో అయినా సరే.. పార్టీని ఏమాత్రం ప్రజలు ఆదరించడం లేదు. ఘోరంగా ఓడిస్తున్నారు. తెలంగాణలోనూ అంతే. ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఘోరంగా ఓటమి చెందింది. ఆ ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. […]
ఇటీవలి ఎన్నికల్లో అనూహ్యమైన విజయాలను నమోదు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో మాంచి జోరు మీదున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి మరికొద్ది సేపట్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న వేళ ఒక బ్యాడ్ న్యూస్. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో కార్పొరేటర్ గా గెలిచిన ఆకుల రమేశ్ గౌడ్ కొద్దిసేపటి కిందటే చనిపోయారు. ఆయన్ని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. ఫలితాలొచ్చిన మూడు రోజులకే.. ఈ నెల ఒకటిన జరిగిన బల్దియా ఎలక్షన్స్ లో రమేశ్ […]
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆరెస్) ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తమ మనసులోని మాటలను బయటపెడుతున్నారు. యువ రాజుకు పట్టాభిషేకం కావాలని వారంతా కోరుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు (కేటీఆర్)ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని డైరెక్ట్ గా, ఓపెన్ గానే చెబుతున్నారు. తాజాగా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ చేసిన వ్యాఖ్యలు ఈరోజు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. పెద్దాయన ఇకొద్దు.. టీఆరెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్)ను […]