Telugu News » Tag » FIlm news
Shivatmika : టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ ఇద్దరు కుమార్తెలు శివాని మరియు శివాత్మిక లు హీరోయిన్స్ గా ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. బాలీవుడ్ లో స్టార్ హీరోలు మరియు హీరోయిన్స్ కూతుర్లు స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు దక్కించుకుంటున్నారు. కానీ తెలుగులో మాత్రం స్టార్ హీరో కూతుర్లు కనీసం సినిమాల్లో ఆఫర్స్ కూడా దక్కించుకోలేక పోతున్నారు. తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు చాలా తక్కువగా వస్తుంటాయి. శివాని మరియు శివాత్మిక ఇద్దరు […]
Pawan Kalyan : ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కి సిద్ధం అయ్యింది. ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందే అన్ స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేసేందుకు ఆహా సిద్ధం అయ్యింది. పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ఎపిసోడ్ విషయంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ప్రభాస్ ఎపిసోడ్ ను కూడా రెండు పార్ట్ లుగా స్ట్రీమింగ్ చేశారు. అంతే కాకుండా ఒక రోజు […]
Vijayasai Reddy : నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సందర్భంగా తారకరత్న గుండెపోటు రావడంతో ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రముఖులు ఇప్పటికే తారకరత్నను పరామర్శించారు. నేడు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తారకరత్నను పరామర్శించారు. విజయ్ సాయి రెడ్డి మరదలు కూతురు అలేఖ్య రెడ్డిని తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దాంతో […]
Shakuntalam : సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17వ తారీఖున ప్రేక్షకుల ముందు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ట్రైలర్ ని కూడా విడుదల చేసి సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెడుతున్నట్లుగా దర్శక నిర్మాత గుణశేఖర్ ప్రకటించాడు. ఈ సినిమాను దిల్ రాజు సమర్పిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా భారీ రిలీజ్ దక్కే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఈ సమయంలో శాకుంతలం సినిమా విడుదల వాయిదా పడుతుందా […]
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హీరోగా సాహో సుజీత్ దర్శకత్వంలో దానయ్య నిర్మాణంలో ఇటీవల ఒక సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా గురించి రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అతి త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కాబోతున్న పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ సినిమా రెండు పార్ట్ లుగా రాబోతుంది అనే ప్రచారం జోరుగా సాగుతుంది. మొదటి పార్ట్ ఇదే ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు […]
Tollywood : మొన్న సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాలు కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దాంతో చాలా మంది స్టార్ హీరోలు 2024 సంక్రాంతి పై కన్ను వేశారు. సంక్రాంతి సీజన్ కి సినిమాలు వస్తే మినిమం టాక్ సొంతం […]
Dil Raju : తమిళ్ సూపర్ స్టార్ విజయ్ తో దిల్ రాజు నిర్మించిన వారిసు చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ నమోదు చేసిన ఆ సినిమా తెలుగులో వారసుడుగా విడుదల అయ్యి తీవ్రంగా నిరాశ పరిచింది. అక్కడ 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసినా కూడా తెలుగు రాష్ట్రాల్లో మినిమం కలెక్షన్స్ నమోదు చేయక పోవడంతో నిర్మాత దిల్ రాజు తీవ్ర సంతృప్తి తో ఉన్నాడని […]
Nani Dasara : ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన నాచురల్ స్టార్ నాని యొక్క దసరా చిత్రం టీజర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాలో నాని మాస్ లుక్ లో కనిపించబోతున్నాడని ముందే క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ లుక్ విడుదల సమయంలోనే నాని లుక్ చాలా విభిన్నంగా ఉంటుందని ఇప్పటి వరకు చూడని నానిని ఈ సినిమాలో చూడబోతున్నామంటూ దర్శకుడు చెప్పగానే చెప్పాడు. టీజర్ లో నాని ని అభిమానులు మాత్రమే కాకుండా […]
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు మాత్రమే కాకుండా రాజకీయం కూడా చేసిన విషయం తెలిసిందే. ఫుల్ టైం రాజకీయం చేస్తూ పార్ట్ టైం సినిమాలు చేస్తూ రెండు పడవల ప్రయాణం సాగిస్తున్నాడు పవన్. ఆ కారణంగానే సినిమాలకు న్యాయం చేయలేక పోతున్నాడు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా ప్రారంభం అయ్యి చాలా నెలలు అయింది. రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ఇప్పటి వరకు ఆ సినిమా […]
Apsara Rani : రామ్ గోపాల్ వర్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ముద్దుగుమ్మల్లో అప్సర రాణి ఒకరు. వర్మ యొక్క థ్రిల్లర్ సినిమాతో ఈ అమ్మడు గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత వర్మ కాంపౌండ్ లో పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. వర్మ ఒకానొక సమయంలో ఈమె అందానికి ఫిదా అయిపోయి సోషల్ మీడియాలో విచ్చల విడిగా పోస్ట్ లు పెట్టి రచ్చ చేశాడు. ఇలాంటి అందమైన అమ్మాయిని చూడలేదు అన్నట్లుగా ఈమె పై […]
Shakuntalam : సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమా యొక్క విడుదల తేదీ దగ్గర పడుతోంది. వచ్చే నెల విడుదల కాబోతున్న శాకుంతలం సినిమా యొక్క పబ్లిసిటీ కార్యక్రమాల విషయంలో దర్శకుడు గుణశేఖర్ పెద్దగా యాక్టివ్ గా లేడు అంటూ విమర్శలు వస్తున్నాయి. అదుగో ఇదుగో అంటూ చాలా మంది చాలా రకాలుగా శాకుంతలం గురించి ఊహించుకున్నారు. ఆ స్థాయిలో శాకుంతలం సినిమా ను ప్రమోట్ చేయడం లేదు అంటూ గుణశేఖర్ తీరుపై సినీ ప్రముఖులు […]
Virat Kohli : టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన టీమ్ మెంబర్ కేఎల్ రాహుల్ పెళ్లికి ఏకంగా రెండు కోట్ల రూపాయల విలువ చేసే బీఎండబ్ల్యూ కారును బహుమానంగా ఇచ్చాడు. రాహుల్ పెళ్లి కానుకల్లో ఇదే అత్యంత ఖరీదైన కానుకగా బాలీవుడ్ మరియు ముంబై వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. క్రికెటర్ కేఎల్ రాహుల్ మరియు అతియా శెట్టిలు గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు కూడా ఇరువురు కుటుంబ పెద్దలను ఒప్పించి ఇటీవలే […]
Naatu Naatu : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దక్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా లోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్ ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ పాట నిలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. సినీ ప్రముఖులు.. రాజకీయ ప్రముఖులు ఇంకా ఎంతో మంది స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ… సినిమా వైభవాన్ని చాటేందుకు ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉంది. కోట్లాది మంది […]
Balakrishna : నందమూరి బాలకృష్ణ కు జోడీగా నటించాల్సిందిగా అయిదు ఆరు సంవత్సరాల క్రితం కాజల్ అగర్వాల్ ను అడిగిన సమయంలో బిజీగా ఉన్నాను డేట్లు ఖాళీ లేవు అన్నట్లుగా సమాధానం ఇచ్చిందట. ఆ సమయంలో బాలయ్య కు జోడీగా మరో హీరోయిన్ ను తీసుకు రావాల్సి వచ్చింది. బాలయ్య సినిమా లో నటించే అవకాశం కాజల్ అగర్వాల్ కు రెండు సార్లు వచ్చిందట. రెండు సార్లు కూడా కావాలని సినిమాను కాదనుకుందట. అందుకు కారణం బాలకృష్ణ […]
Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా చిత్రీకరణ ఇటీవలే వైజాగ్ లో ప్రారంభం అయిన విషయం తెల్సిందే. అక్కడ షూటింగ్ ప్రారంభం అయ్యిందో లేదో వెంటనే ఒక లీక్ వచ్చేసింది. అది ఏమైనా మ్యాటర్ అయితే ఏమో కానీ ఏకంగా ఒక ఫొటో లీక్ అవ్వడంతో సుకుమార్ సీరియస్ అయ్యాడట. సుకుమార్ ఇప్పటికే లీక్ ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రొడక్షన్ వారికి సూచించారట. అయినా […]